Suryaa.co.in

Features

నా తెలంగాణ..దొరల చేతిలో బందిఖానా

నా తెలంగాణ అమ్ముడు పోయిన కలాల తెలంగాణ
నా తెలంగాణ మూగ బోయిన గళాల తెలంగాణ
నా తెలంగాణ దొరల చేతిలో బందిఖానా
నా తెలంగాణ నిదిరించిన
పౌరుషాన్ని రగిలించ లేని మేధావుల తెలంగాణ

నా తెలంగాణ నిలువెల్లా దోపిడీకి గురైన కోటి రత్నాల వీణ
నా తెలంగాణ తల్లడిల్లు తున్న నిరుద్యోగుల రోదన

నా తెలంగాణ పేద ప్రజల వేదన
నా తెలంగాణ రైతుల చితి మండు తున్న ఘాట్ మనికరణ
(కాశీలో నిత్యం కాస్టాలు మండే ఘాట్ పేరు మనికరన)

నా తెలంగాణ ద్రౌపతి వస్త్రాపహరణ ( ధృతరాష్ట్ర సభ)
నా తెలంగాణ బారుల బీరుల మత్తులో ఊగేటి తెలంగాణ

నాడు వీరులు సూర్యులై మండిన తెలంగాణ
నేడు మూర్కులైన చోరుల భజన తెలంగాణ

– నారగొని ప్రవీణ్ కుమార్

LEAVE A RESPONSE