-బ్రాహ్మణ సభ్యుల, రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ నిధులను దోచుకుతింటున్న సొసైటీ సీఈఓ నాగ సాయి
-వశిష్ట, అరుంధతి గ్రూప్ రుణాలు బినామీ పేర్లతో రుణాలు
-అర్చక పురోహిత మిత్ర పేరుతో గ్రూప్ రుణాలులో కూడా బినామీ పేర్లతో అవినీతి
-విజయవాడ నగరంలోని ఒక కార్పొరేటర్ కు విద్యా రుణం పేరుతో ఒక్క రోజులోనే 42 లక్షలు
-కో ఆపరేటివ్ శాఖలో అసిస్టెంట్ రిజిస్టర్ గా ఉంటూ అక్కడ ప్రభుత్వ జీతం
-బ్రాహ్మణ కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీలో మరల నెలకు 1 లక్ష రూపాయల జీతం
-సొసైటీలో మార్ట్ గేజ్ లోన్ పేరుతో ఒక్కరికే కోటి రూపాయల లోన్
-ప్రైవేట్ ఆడిటర్ లతో తనకు అనుకూలంగా ఆడిట్
– బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు శిరిపురపు శ్రీధర్ శర్మ
అమరావతి: బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు శిరిపురపు శ్రీధర్ శర్మ మాట్లాడుతూ…
ఆంధ్రప్రదేశ్ కో- ఆపరేటివ్ చట్టానికి వ్యతిరేకంగా బ్రాహ్మణ కో ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ సీఈవో గా నాగసాయి పనిచేస్తూన్నాడని, బ్రాహ్మణ కో ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీకి కనీసం నేటి వరకు చట్ట ప్రకారం ఎన్నికలు సక్రమంగా నిర్వహించకుండా అక్రమంగా ఎన్నికల్ని దొడ్డిదారిన నిర్వహించబోయి హైకోర్టులో అభాసుపాలై, జగన్ ప్రభుత్వ పరువును బహిరంగంగా తీసేసాడని, ఈ బ్రాహ్మణ కో ఆపరేటివ్ క్రెడిట్ ప్రభుత్వ సొసైటీ సీఈఓ చేసిన నిర్వాకంపై జగన్ ప్రభుత్వం చోద్యం చూస్తున్నదని, నాగసాయి ఈ సొసైటీలో తన సీఈవో పదవిని అడ్డుపెట్టుకొని ఏకఛత్రాధిపత్యం తో బ్రాహ్మణ సొమ్మును దోచుకుతింటున్న ఈ సొసైటీ సీఈఓ పై తక్షణమే జగన్ ప్రభుత్వం చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని శ్రీధర్ డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీలో వశిష్ట, అరుంధతి గ్రూప్ రుణాలు బినామీ పేర్లతో చాలామంది రుణాలు పొందడం జరిగింది. ఈ అవినీతి డబ్బులను సీఈవో ఇంతవరకు ఎందుకు వసూలు చేయలేదు, ఆ బినామీ దరఖాస్తుదారుల పై చట్ట ప్రకారం ఎందుకు చర్యలు తీసుకోలేదు, అలానే అర్చక పురోహిత మిత్ర పేరుతో గ్రూప్ రుణాలు అందజేసిన దానిలో కూడా బినామీ పేర్లతో పెద్ద ఎత్తున అవినీతి జరిగినది మార్ట్ గేజ్ రుణాలను దరఖాస్తు చేసుకున్న వారిని కమిషన్ల కోసం స్థానిక మేనేజర్లు సీఈవో ముప్పతిప్పలు పెట్టి సరిగా రుణాలు కూడా ఇవ్వట్లేదు.
13 జిల్లాల్లో 16 బ్రాంచ్ లు ఓపెన్ చేసి స్థానిక బ్రాంచ్ మేనేజర్లను దూషిస్తూ అవమానపరుస్తున్నాడు, దానితో చాలామంది ఉద్యోగం వదిలి వెళ్ళిపోవడం జరుగుతున్నది, గత ప్రభుత్వంలో సొసైటీకి చట్ట ప్రకారం ఎన్నికల నిర్వహించకుండా చాలామందిని మేనేజింగ్ కమిటీ సభ్యులుగా తన సొంత పెత్తనంతో నియమించడం జరిగింది. ఈ ప్రభుత్వ హయాంలో విజయవాడ నగరంలోని ఒక కార్పొరేటర్ కు విద్యా రుణం పేరుతో రాజకీయ ఒత్తిడులకు తలొగ్గి ఒక్క రోజులోనే 42 లక్షలు రూ/-లు ఇచ్చేస్తూ ఎలా అనుమతులు ఇచ్చారని, దీనిపైన కూడా అవినీతి నిరోధక శాఖ, కో ఆపరేటివ్ శాఖ సమగ్ర విచారణ జరపాలి.
కో ఆపరేటివ్ శాఖలో అసిస్టెంట్ రిజిస్టర్ గా ఉంటూ అక్కడ ప్రభుత్వ జీతం తీసుకుంటూ ఇక్కడ బ్రాహ్మణ కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీలో మరల నెలకు 1 లక్ష రూపాయలు /- పైన ఎలా జీతం తీసుకుంటున్నాడని, ఈ రెండు జీతాలు కాక బ్రాహ్మణ కార్పొరేషన్ మేనేజర్ గా హానరోరియం జీతం కూడా ఒకే వ్యక్తి ఎలా తీసుకుంటున్నాడని, ఇది ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధం కాదా అని శ్రీధర్ ప్రశ్నించారు.
ఇతని రెండు మూడు జీతాల తతంగంపై జగన్ ప్రభుత్వం సమగ్రంగా విచారణ నిర్వహించాలని, అక్రమంగా బ్రాహ్మణ సొసైటీ డబ్బులను దోచుకున్న సీఈఓ పై చర్యలు తీసుకొని, ఆ జీతాల తాలూకా మొత్తాలను తిరిగి సొసైటీకి చెల్లించేలా చర్యలు చేపట్టాలని శ్రీధర్ డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సొసైటీలో మార్ట్ గేజ్ లోన్ పేరుతో ఒక్కరికే కోటి రూపాయల లోన్ ఎలా ఇవ్వడం జరిగింది? దీని రికవరీలు జరుగుతున్నాయా? లేదా?
ఈ సొసైటీ నుండి మార్ట్ గేజ్ లొన్స్, ఇతర పధకాల నుండి లొన్స్ తీసుకొన్న వారు రికవరీలు సరిగ్గా చేయకపొతే వారిపై క్రెడిట్ సొసైటీ వారు చర్యలు తీసుకున్నారా?లేదా? సరిగ్గా రికవరీలు చేయకపోతే లీగల్ గా చర్యలు సీఈఓ ఎందుకు తీసుకోవడం లేదని, వారికి లోన్స్ ఇవ్వడం వరకు మాత్రమే మా పని, రికవరీలు చేయడం మా పని కాదు అనే రీతిలో వ్యవహరిస్తున్నారు. రికవరీలు కట్టని వారికి నోటీసులు ఇచ్చే అధికారం కూడా మా పని కాదు అనే ధీమాతొ వారు ఎందుకు వున్నారొ అర్థంకావడం లేదని, ప్రతి జిల్లాలో సొసైటీ బ్రాంచ్ లో రికవరి టీమ్ ను కాని, రికవరీ కొసం తగినంత సిబ్బందిని సీఈఓ ఎందుకు నియమించక లేకపోతున్నారని శ్రీధర్ ప్రశ్నించారు.
క్రెడిట్ సొసైటీ మెయిన్ ఆఫీస్ లొ మాత్రమే ప్రైవేట్ ఆడిటర్ లతో తనకు అనుకూలంగా ఆడిట్ చేయిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలలొని 14 బ్రాహ్మణ క్రెడిట్ సొసైటీ బ్రాంచులలొ ఆడిట్ ఎందుకు జరిపించడం లేదని, 13 జిల్లాలలొని 14 క్రెడిట్ సొసైటీ బ్రాంచులలొ ఆడిట్ నిర్వహించడానికి CEO ఎందుకు చర్యలు తీసుకొవడం లేదని వాటిలో సీఈఓవాటా ఎంత అని శ్రీధర్ ప్రశ్నించారు.
జగన్ ప్రభుత్వం లో బ్రాహ్మణ కార్పొరేషన్ లో నామినేటెడ్ పదవులు పొందిన బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్,డైరెక్టర్లు గా పదవులు పొందిన బ్రాహ్మణ నాయకులు తమకు పదవులు పొందిన ఈ సంస్దలోనే కోట్ల రూపాయల ప్రభుత్వ ధనం, బ్రాహ్మణ ధనంలో ఇంత అవినీతి జరుగుతూవుంటే నిద్రపోతున్నారా పదవులు తీసుకొని అని బ్రాహ్మణ సమాజం చర్చ జరుపుతున్నారు. ఈ సొసైటీ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ లో అనుబంధ సంస్ధ అని తెలుసుకోలేకపోయారా, జగన్ ఇచ్చిన పదవులకు న్యాయం చేయలేనపుడు మీకా పదవులు ఎందుకు అని శ్రీధర్ ప్రశ్నించారు.
దీనిపై హైకోర్టు జడ్జి ఆధ్వర్యంలోనో లేక జగన్ ప్రభుత్వ ఆధ్వర్యంలోనో లేక జర్నలిస్టుల ఆధ్వర్యంలోనో ఒక కమిటి వేసి, AP బ్రాహ్మణ కో – ఆపరేటీవ్ క్రెడిట్ సొసైటీ యొక్క నిధులు దుర్వినియోగం పై ప్రభుత్వ ఆడిట్ AG సంస్దతో ఆడిట్ చేయించి ఆడిట్ రిపోర్ట్ ను హైకోర్టు కు గాని, రాష్ట్ర ప్రభుత్వానికి గానీ అందించాలని, సొసైటీలో ప్రభుత్వ బ్రాహ్మణ సొమ్మును దోచుకుతిన్న సీఈఓ తదితర దోషులను తక్షణమే శిక్షించాలని AP బ్రాహ్మణ కో- ఆపరేటివ్ క్రెడిట్ సొసైటి సభ్యుల రక్షణ వేదిక అధ్యక్షుడు శ్రీధర్ డిమాండ్ చేసారు… గత చంద్రన్న ప్రభుత్వంలో ఈ సొసైటీ సీఈఓ పై అనేక అవినీతి వ్యవహారాల పై అనేక ఆరోపణలు వస్తే, గత ప్రభుత్వం అతన్ని సొసైటీ నుండి తొలగిస్తూ అతను పనిచేసే శాఖకు సరెండర్ చేసింది.
అయినా అతను మళ్ళీ జగనన్న ప్రభుత్వంలో పైరవీలు చేసుకొని మళ్ళీ బ్రాహ్మణ సొసైటీకి సీఈవో గా వచ్చి, తన పదవిని అడ్డుపెట్టుకొని సొసైటీకి ఏకఛత్రాధిపత్యంగా ఒక నియంతలా వ్యవహరిస్తూ బ్రాహ్మణ సొమ్మును దోచుకుతింటున్న ఈ సొసైటీ సీఈఓ నాగ సాయి పై తక్షణమే “జగనన్న ప్రభుత్వం” చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని శ్రీధర్ డిమాండ్ చేశారు. దీనిపై ఆంధ్రప్రదేశ్ అవినీతి నిరోధక శాఖ, కో- ఆపరేటివ్ శాఖ, రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలని లేని పక్షంలో దీనిపై తప్పకుండా న్యాయ పోరాటం చేస్తామని శ్రీధర్ హెచ్చరించారు.