– ఉద్యోగాల భర్తీపై శ్వేతపత్రం విడుదల చేసే దమ్ము మీ ప్రభుత్వానికి ఉందా?
– మద్యం ధరలు పెంచి మహిళల పుస్తెలకు కన్నం వేసిన వ్యక్తి జగన్
– భాజపా రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు సవాల్
కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై సంధించిన ప్రశ్నలకు రాష్ట్ర ప్రభుత్వం చర్చకు సిద్దమా? అని భాజపా రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు సవాల్ విసిరారు. వైకాపా నాయకుల తీరు గుమ్మడికాయల దొంగెవరంటే భుజాలు తడుముకుంటున్నట్లుఉందని అన్నారు. బహిరంగ సభలో కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాగూర్ వాస్తవాలు మాట్లాడితే ఉలికిపాటు ఎందుకని ప్రశ్నించారు. కేంద్రమంత్రి అనురాగ్ ను విమర్శించిన మంత్రులు గుడివాడ, జోగి రమేష్ అరాచకాలు, దోపిడీ పై చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు.
మైనింగ్ కాంట్రాక్టర్ల వద్ద కమిషన్లు దండుకోవడం వాస్తవం కాదా అని గుడివాడ అమర్నాథ్ ను ప్రశ్నించారు. సొంత పార్టీ కార్యకర్తలనే దోచుకున్న ఘనత మీదే కదా జోగి రమేష్ గారూ! జగన్ తాబేదార్లుగా పేరుగాంచిన వున్న ఈ మంత్రులు అనురాగ్ గారిపై అనుచిత వ్యాఖ్యలు అసమంజసం. జగన్ మెప్పుకోసం వాస్తవాలు మాట్లాడితే, మింగుడు పడటం లేదా? అధికారంలో ఉన్నాం ఏం మాట్లాడినా చెల్లుతుందా?
మహిళల రక్షణకు పదే పదే గొంతు చించుకునే రోజక్క, సీఎం నివాసానికి కూతవేటు దూరంలో జరిగిన అత్యాచారం కు సంబంధించి ఒక్కరినీ అరెస్టు చేయలేదు. దీనిపై ఎందుకు మాట్లాడదు ? మద్యం ధరలు పెంచి మహిళల పుస్తెలకు కన్నం వేసిన వ్యక్తి జగన్ అని రమేష్ నాయుడు విమర్శించారు. జగన్ పాదయాత్రలో యువతకు ఇస్తానన్న 2.50 లక్షల ఉద్యోగాలు ఏమయ్యాయి. మెగా డిఎస్సి ఎప్పుడు ప్రకటిస్తారు? ప్రతి సంవత్సరం ప్రకటిస్తానన్న జాబ్ క్యాలెండర్ ప్రకటించారా?
గ్రామ వలంటీర్ ల వ్యవస్థ కాస్త మీపార్టీ కార్యకర్తలు గా వాడుకుంటున్న మాట వాస్తవం కాదా? ఉద్యోగాల భర్తీపై శ్వేతపత్రం విడుదల చేసే దమ్ము మీ ప్రభుత్వానికి ఉందా? ఇప్పటికే 2.40 లక్షల బ్యాక్‌లాగ్పోస్టుల భర్తీకి తావివ్వదు ఈ ప్రభుత్వం. రాయలసీమ లో ఒక్క ప్రాజెక్టు నిర్మించారా? ఎన్నోఏళ్లుగా రూపం దాల్చని గాలేరు-నగరి ప్రాజెక్ట్ పరిస్థితి ఏమిటో? అవినీతిలో పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తో పోటీ పడుతున్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. వైసీపీ మొత్తం అవినీతి మ యం అయ్యింది . ఇదే అవినీతి సొమ్ముతో మళ్ళీ ఎలక్షన్ లో గెలవాలని చూస్తున్నారు.