Suryaa.co.in

Andhra Pradesh

విడతలవారీ విద్యాదీవెనతో విద్యార్థుల ముఖాల్లో సంతోషం లేకుండా పోయింది

– 5లక్షల18వేలమంది విద్యార్థులను ఫీజు రీయింబర్స్ మెంట్ కు దూరంచేసిన జగన్ రెడ్డి, రూ.20కోట్ల సొమ్ముని తనప్రచారఆర్భాటానికి తగలేశాడు.
• చంద్రబాబుప్రభుత్వం 16లక్షలమంది విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ ఒకేసారి ఇస్తే ఈ ముఖ్యమంత్రేమో విద్యార్థుల సంఖ్య తగ్గించి, 10లక్షలమందికి దఫదఫాలుగా ఫీజు రీయింబర్స్ మెంట్ ఇస్తున్నాడు.
• ముఖ్యమంత్రి, ఆయనఎమ్మెల్యేలు ప్రజల్లోకివెళ్లినా…వెళ్లకపోయినా 2024లో చంద్రబాబు ముఖ్యమంత్రికావడం ఖాయం.
– టీడీపీ అధికార ప్రతినిధి నాగుల్ మీరా

విద్యాదీవెన పథకం ప్రారంభ సందర్భంగా జగన్ ముఖంలో కనిపించినచిరునవ్వు, రాష్ట్రంలో ఏవిద్యార్థి ముఖంలోనూ కనిపించలేదని, రాష్ట్రంలో దాదాపు 5లక్షలపైగా విద్యార్థులను జగన్ రెడ్డి ఫీజు రీయింబర్స్ మెంట్ కు దూరం చేశాడని టీడీపీ రాష్ట్రఅధికారప్రతినిధి నాగుల్ మీరా స్పష్టంచేశారు. బుధవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.ఆ వివరాలు ఆయన మాటల్లోనే ..

జగన్మోహన్ రెడ్డి వంచనకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు బలి అవుతున్నారు. నాణ్యమైన విద్యాబోధనలో చంద్రబాబు గారి హయాంలో రాష్ట్రం 3వ స్థానంలో ఉంటే, ఇప్పుడు 19వస్థానానికి చేరింది. చంద్రబాబునాయుడు అమలుచేసిన నూతనవిద్యావిధానంతో తెలుగు విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా విద్యా, ఉద్యోగ రంగాల్లో ఉన్నతస్థానాలకు వెళ్లారు. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చాక రాష్ట్ర విద్యావ్యవస్థను విచ్ఛిన్నంచేసి, నిరుద్యోగులను చేపలు, మాంసం అమ్ముకోమంటున్నాడు.

ఇంజనీరింగ్ విద్యార్థులకు సంవత్సరానికి రూ.35వేలఫీజు ఉంటే, జగన్ రెడ్డి నాలుగువిడతల్లో కేవలం రూ.8వేలు మాత్రమే ఇచ్చిచేతులు దులుపుకుంటున్నారు. పాలిటెక్నిక్ విద్యార్థులు సంవత్సరానికి రూ.10వేలు కట్టాల్సిఉంటే, ముఖ్యమంత్రి రూ.2,500లను నాలుగుసార్లుగా ఇస్తున్నాడు. విద్యార్థులకు ఇస్తున్నది గోరంత అయితే, ప్రచారానికి కొండంతసొమ్ముని దుర్వినియోగంచేస్తున్నారు.

చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 16 లక్షల మందికి ఫీజు రీయింబర్స్ మెంట్ ఇస్తే జగన్ రెడ్డి నేడు దాన్ని 10లక్షల82వేల మందికి మాత్రమే ఇస్తూ, దాదాపు 5లక్షల 15 వేలమంది విద్యార్థులను ఫీజురీయింబర్స్ మెంట్ కు శాశ్వతంగా దూరంచేశారు తన అసమర్థ విద్యావిధానంతో జగన్ రెడ్డి ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనారిటీవర్గాల్లోని పేద పిల్లలకు తీరని అన్యాయం చేశాడు. విద్యార్థలకు సాయంచేయకుండా, ముఖ్యమంత్రి తన మెహర్బానీకోసం పత్రికా ప్రకటనలకోసం రూ.20 కోట్లు దుర్వినియోగంచేశాడు. అదే సొమ్ముని ఫీజురీయింబర్స్ మెంట్ రూపంలో ఇచ్చిఉంటే, మరోపదివేల మంది విద్యార్థులకు న్యాయంజరిగేది.

ఎన్నికలకు ముందు రాష్ట్రంలో ఎంతమంది పిల్లలు ఉంటే, అందరికీ అమ్మఒడి ఇస్తానన్న జగన్ రెడ్డి ఆమాటకు కూడా కట్టుబడలేదు.84 లక్షలమంది విద్యార్థులు రాష్ట్రంలోఉంటే, జగన్మోహన్ రెడ్డి కేవలం 44లక్షల మందికే అమ్మఒడి ఇస్తున్నాడు. చీప్ లిక్కర్ ను రూ..270లకు అమ్ముతూ రూ.22వేలకోట్లను మందుబాబులనుంచి గుంజుకుంటున్న జగన్ రెడ్డి, పన్నులరూపంలో అదనంగా రూ.20వేలకోట్లు వసూలుచేస్తున్నాడు. రూ.42వేలకోట్లవరకు ప్రజలనుంచిఏటా దోచుకుంటున్న జగన్ రెడ్డి విద్యార్థులకుమాత్రం అరకొరగా అమ్మఒడి కింద కేవలం రూ.6వేలకోట్లే ఇస్తున్నాడు. చంద్రబాబునాయుడు హయాంలో నాణ్యమైన విద్యను అందించే రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో నిలిచింది.

జగన్ ముఖ్యమంత్రి అయ్యాక నాణ్యమైనవిద్య లభించేలిస్ట్ లో రాష్ట్రం 19వ స్థానంలో ఉంది. చంద్రబాబుగారి హయాంలో ఉమ్మడిరాష్ట్రంలో ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలు ఎక్కువగా ఏర్పడ్డాయి. తద్వారాప్రపంచంలో తెలుగువిద్యార్థులు ఉన్నతచదువుల్లో అగ్రస్థానాలకు వెళ్లి, నేడు ఉన్నతస్థానాల్లోఉన్నారు. జీవోనెం 77 తీసుకొచ్చిన జగన్ రెడ్డి దానిద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణాల విద్యార్థులను ఫీజు రీయింబర్స్మెంట్ నుంచి తప్పించాడు. తమకు ఫీజు రీయింబర్స్ మెంట్ ఎందుకివ్వరని విద్యార్థులు ప్రశ్నించారన్న అక్కసుతో ఈ ముఖ్యమంత్రి వారిపై అత్యాచారం కేసులుపెట్టించాడు.

ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులు చంద్రబాబుగారి హాయాంలో తమకు నిర్విరామంగా అందాయి.. ఇప్పుడెందుకు అందవని అడగడమే విద్యార్థులు చేసిన తప్పు. ఫీజు రీయింబర్స్ మెంట్ నిధుల్ని ఈ ముఖ్యమంత్రి నాలుగువిడతల్లో ఇస్తుండటంతో, కళాశాలలయాజమాన్యాలు తమను ఇబ్బందిపెడుతున్నాయని విద్యార్థులు వాపోతున్నారు.

తనపిల్లలను లండన్ లో చదివించుకుంటున్న జగన్మోహన్ రెడ్డి ,పేదవిద్యార్థుల కోసం చంద్రబాబుగారు తీసుకొచ్చిన విదేశీవిద్య పథకాన్ని ఎందుకు తీసేశాఢో సమాధానంచెప్పాలి. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, డెన్మార్క్, ఫిలిప్పీన్స్, చైనా వంటిదేశాల్లో 4,528 మంది ఎస్సీ, ఎస్టీ,బీసీ, మైనారిటీ, కాపువిద్యార్థులు చదువుకునేలా చంద్రబాబుగారు గతంలో చేస్తే, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే వారికి ప్రభుత్వంనుంచి అందాల్సిన నిధుల్ని ఆపేశాడు.

మొత్తంగా విదేశీవిద్య పథకాన్నే ఎత్తేశాడు. ఈఅంశంపై మైనారిటీ విద్యార్థులకు న్యాయంచేయాలని తాము మైనారిటీ కమిషన్ కార్యాలయం వద్ద ఆందోళనచేసినా ప్రభుత్వం నుంచి స్పందనలేదు. విదేశాల్లో చదువుకోవడానికి వెళ్లిన విద్యార్థులకు ప్రభుత్వంనుంచి అందాల్సిన సాయం అందక, అక్కడి విద్యార్థుల భవిష్యత్ అగమ్యగోచరంగా మారింది. విద్యార్థుల్ని, విద్యారంగాన్ని నాశనంచేసిన జగన్ రెడ్డి నేడు ఏముఖంపెట్టుకొని విద్యార్థులకు ఏదోమేలు చేసినట్టు పత్రికల్లో ప్రకటనలు ఇచ్చుకుంటున్నాడు.

విద్యార్థులే కాదు.. ఈముఖ్యమంత్రి దెబ్బకు అన్నివర్గాలప్రజలు నిలువునా వంచనకు గురయ్యారు. జగన్మోహన్ రెడ్డి గతంలో చెప్పిందొకటి..ఇప్పుడు చేస్తున్నదొకటని ప్రజలకు అర్థమైంది. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక రాష్ట్రానికి ఒక్క పరిశ్రమఅయినా, ఒక్క ఐటీ కంపెనీఅయినా వచ్చిందా? ఏటా పదిలక్షలమంది విద్యార్థులు విద్యాభ్యాసం ముగించుకొని బయటకువస్తుంటే, ఈముఖ్యమంత్రేమో చేపలు అమ్ముకోండి.. మాంసం అమ్మండి అంటున్నాడు.

తిరుపతి వేంకటేశ్వరఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ విద్యార్థులంతా సాక్షిపేపర్ చదవాలని సర్క్యులర్ ఇవ్వడం దుర్మార్గం కాదా? అబద్ధాలు, అసత్యాల పునాదులమీద, అవినీతిసొమ్ముతో నిర్మించిన సాక్షిపత్రిక చదవాలని విద్యార్థులకు సర్క్యులర్ ఇస్తారా? ఈప్రభుత్వంఎంతటి అరాచకాలకు పాల్పడుతోందో ఇలాంటిఘటనలే చెబుతున్నాయి. ప్రజలుచేసేదిలేక. .. ఒక్కఛాన్స్ ఇచ్చాము కాబట్టి అనుభవించాలని ఊరుకుంటున్నారుకానీ, లేకపోతే ఈ ముఖ్యమంత్రికి, ఆయనపాలనకు కాలంచెల్లేది. ముఖ్యమంత్రి ప్రజల్లోకి వెళ్లినా, ఆయన ఎమ్మెల్యేలు వెళ్లినా..వెళ్లకపోయినా, 2024 ఎన్నికల్లో చంద్రబాబుతిరిగి ముఖ్యమంత్రి కావడం ఖాయమని స్పష్టం చేస్తున్నాం.

LEAVE A RESPONSE