– టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు
కోడెల శివప్రసాదరావు ద్వితీయవర్థంతి సందర్భంగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దివంగతనేత చిత్రపటానికి పూలమాలవేసి, నివాళులు అర్పించారు. కార్యక్రమంలో చంద్రబాబునాయుడు మాట్లాడారు.ఆ వివరాలు ఆయన మాటల్లోనే …
కోడెల శివప్రసాదరావుగారి మరణం, ముమ్మాటికీ ప్రభుత్వహత్యే. ఆయన మరణాన్నితలుచుకుంటే, ఇప్పటికీ మనసుకుదుటపడే పరిస్థితిలేదు. ప్రభుత్వం వేధించి, వెంటపడబట్టే, ఒకప్పుడు పల్నాటిపులిగా పిలువబడిన కోడెల శివప్రసా దరావు , మనోనిబ్బరం కోల్పోయి, ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇంతటి దారుణం చరిత్రలో ఎప్పుడూ జరిగి ఉండదు. చిరకాలంపాటు రాజకీయాల్లో కొనసాగిన కోడెల , శాసనసభ్యుడిగా, మంత్రిగా, స్పీకర్ గా కొనసాగి, ఆయా పదవులకు వన్నెతెచ్చి, ప్రజలతో శభాష్ అనిపించుకున్నారు. పల్నాడు ప్రాంతంలో నమ్మినసిద్ధాంతంకోసం, పార్టీకోసం రాజకీయంగా పోరాడినవ్యక్తి కోడెల శివప్రసాదరావు . కోడెల గారిపై ఈ ప్రభుత్వం ఎన్నితప్పుడు ఆరోపణలు చేసిందో లెక్కేలేదు, చివరకు ఫర్నీచర్ తీసు కెళ్లారనే నీచమైన ఆరోపణలుకూడా చేశారు. స్పీకర్ గా ఉన్న సమయంలో ఆయన వినియోగించిన ఫర్నీచర్ తీసుకెళ్లమని,స్వయంగా ఆయనే ప్రభుత్వానికి లేఖరాశారు. కానీ ఆలేఖను దాచిపెట్టిన ప్రభుత్వం, పత్రికల్లో ఆయన గురించి చెడుగా కథనాలు రాయించిందిగాక, విపరీతంగా వేధించారు. పరువుకోసం బతికిన కోడెలగారు, ఆ వేధింపులు తట్టుకో లేకే చివరకు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ దారుణాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.
చరిత్ర ఉన్నంతవరకు ప్రజలగుండెల్లో ప్రభుత్వం చేసిన దారుణం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డిని కూడా హెచ్చరిస్తున్నాం. ప్రభుత్వం చేస్తున్న దాడులు, వేధింపులతో రాష్ట్రంలో నిత్యం ఏదోఒకమూల బలవంతంగా తనువు చాలిస్తున్నావారు ఎందరో ఉంటున్నారు.
నంద్యాలలో అబ్దుల్ సలాం భార్యాపిల్లలతో సహా రైలుకిందపడి చనిపో యాడు. ప్రభుత్వం ఎంతలా వేధిస్తే, పిల్లలను తాళ్లతో కట్టేసిపట్టాలపై పడేసిమరీ, భార్యాభర్తలు ఆత్మహత్యచేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ నేరాంధ్రప్రదేశ్ గా మారిపోయింది. అనేక నివేదికలు ఈ వాస్తవాలను చెబుతున్నాయి. పోయినసంవత్సరం కంటే ఈ సంవత్సరం రాష్ట్రంలో 63 శాతం నేరాలు పెరిగాయి. భారతదేశంలోనే ఎంతో ప్రశాంతంగా ఉండే ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి పుణ్యమా అని, నేరాంధ్రప్రదేశ్ గా మారింది.
ప్రజలెవరూ ప్రశాంతంగా నిద్రకూడా పోలేకపోతున్నారు. పింఛన్, రేషన్ కోల్పోయినవారికి బాధఉంటుంది. కానీప్రభుత్వాన్ని వారేమీ అనకూడదు. పంటలువేసి నట్టేటమునిగిన రైతులకు తెలుస్తుంది, బాధేమిటో. ఎంత నష్టపోయినా తనకుఅన్యాయంచేసిన ప్రభుత్వాన్ని ఏమీఅనకూడదు, నోరు తెరిచి ప్రశ్నించకూడదు. ఏదైనా అంటేక్రూరంగా హింసించి, చంపుతారు. ఈ ప్రభుత్వంలో చాలామంది, తమవేదన రోదన చెప్పుకోలేక నరకయాతన అనుభవిస్తున్నారు.
నిన్ననే నెల్లూరులో చూశాం. ఒక అమ్మాయి మొత్తుకుంటున్నా, ఏడుస్తున్నా వినకుండా కర్రతో చావగొడతారా? ఆఫ్ఘనిస్తాన్ లో కూడా ఇంతటి దారుణాలు జరగవు. మానవమృగాలు క్రూరంగా ప్రవర్తిస్తున్నా, ఆడబిడ్డలను హింసిస్తున్నా, ఈ ముఖ్యమంత్రి నోరుతెరవడు. ముఖ్యమంత్రి నివాసంపక్కనే ఒక దారుణం జరిగింది. కాబోయే భార్యాభర్తలు బయటకువెళితే, యువకుడిని కట్టేసిన దుర్మార్గులు, అతని ఎదుటేయువతిపై సామూహిక మానభంగానికి ఒడిగట్టారు. ఆ ఘటనలో నిందితులను ఇంతవరకు పట్టుకోలేకపోయారు. ముఖ్యమంత్రి, మంత్రులకు సిగ్గుందాఅసలు, నిందితులను పట్టుకోలేరా?
గుంటూరుజిల్లా సత్తైనపల్లివద్ద భార్యాభర్తలు పెళ్లికి వెళ్లి తిరిగివెళుతుంటే, భర్తఎదుటే భార్యపై సామూహికఅత్యాచారానికి పాల్పడ్డారు. కావలిలో ఇల్లుఅద్దెకిస్తే, ఇంటిని వైసీపీనేతలు వ్యభిచారగృహంగా మార్చారు. ఇంటి యజమానురాలు నిలదీసిం దని, ఆమెను చంపేస్తామని బెదిరిస్తున్నారు. చివరకు ఆమెతనకు ప్రాణభయం ఉందని బోరుమనే పరిస్థితికి వచ్చింది. ఇలాంటి ఘటనలు అనునిత్యం జరుగుతూనే ఉన్నాయి. ఈ విధమైన దారుణాలపై ప్రజలంతా మౌనంగా ఉంటే కుదరదు. ఎవరికివారు మనకెందుకులే అని పట్టించుకోకుంటే, కోడెల శివప్రసాద రావు గారిలా ఎందరో బలికావాల్సి వస్తుంది.
కోడెల శివప్రసాదరావుగారిలో నిత్యం ఏదోఒకటి చేయాలనే తపన ఉండేది. స్వర్గీయ నందమూరి తారకరామారావు గారు బసవతారకం ఆసుపత్రి ఏర్పాటు చేస్తే, దాన్ని అభివృద్ధిచేయడానికి కోడెలగారు ఎంతో కృషిచేశారు. కోటప్ప కొండక్షేత్రం అభివృద్ధివెనుక శివప్రసాదరావుగారి కృషి, పట్టుదల ఉన్నాయి. శ్మశానాలను ఎక్కడికక్కడ ఆధునీకరించడం, బాలికలు, యువతులు, మహిళలకు మరుగుదొడ్ల నిర్మాణం వంటివెన్నో చేశారు. అలాంటి వ్యక్తి నేడు మనమధ్యన లేకపోవడం నిజంగా చాలాచాలా బాధాకరం. ఆయన ఆశయాలు మనముందున్నాయి… వాటినిసాధిస్తేనే కోడెలగారి ఆత్మకుశాంతి కలుగుతుంది. ఆయనఆత్మకు శాంతికలగాలని మనస్ఫూర్తిగా భగవంతుడుని ప్రార్థిస్తూ, మరొక్కసారి ఆయన్ని స్మరించుకుంటున్నాను.
కార్యక్రమంలో టీడీపీ శాసనసభ్యులు మంతెన రామరాజు, గద్దె రామ్మోహన్ రావు, ఏలూరు సాంబశివరావు, శాసనమండలి సభ్యులు బీ.టీ.నాయుడు, పరుచూరి అశోక్ బాబు, టీటీడీ మాజీఛైర్మన్ పుట్టాసుధాకర్ యాదవ్, మాజీఎమ్మెల్సీ టీ.డీ.జనార్ధన్, దారపనేని నరేంద్ర, పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.