ఒక అర్ధ నగ్నమైన ఆలోచన
మేల్కొలిపింది నన్ను;
వస్త్రాలంకృతమైన ప్రపంచంలో నిద్రలేచాను నేను.
విధానాలూ, అలవాట్లూ,
పద్ధతులూ, ఆచారాలూ,
నియమాలూ, నిషేధాలూ
నన్ను గట్టిగా పట్టుకున్నాయి;
నేనూ వాటిని కౌగిలించుకున్నాను.
దాహాన్ని తీఱ్చే తెమ్మర
నన్ను పలకరించినప్పుడు నాకు తెలిసొచ్చింది
నేను లుప్తమయ్యానని.
నాకే తెలియడంలేదు
నేనెవర్ని?
నేనెందుకు ఉన్నాను?
ఎప్పుడో పడిపోయాను;
నేను నాలో పడి ఉన్నాను.
నా కోసమే నేనుండాలని
నా అంతట నేను నాలో పడ్డాను.
నేను లేవాలి,
నాకు స్వేచ్ఛ రావాలి.
నిరీక్షిస్తున్నా
ఒక నగ్నమైన అలోచనకోసం.
– రోచిష్మాన్
9444012279