• ఏపీ ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి దోపిడీ, అవినీతి, అప్పుల దెబ్బకు రోడ్లపాలు కావడం ఖాయం
• తినడానికి తిండిలేక, ఉపాధికరువై, పాలకులు చేసిన తప్పిదాలకు శ్రీలంకప్రజలు ఎలాగైతే రోడ్లపాలయ్యారో, ఏపీప్రజలుకూడా జగన్ రెడ్డి అప్పులు, అవినీతికి బలైపోతున్నారు.
• ముఖ్యమంత్రి ఢిల్లీపర్యటనలన్నీ తనపై ఉన్న కేసులు, బాబాయ్ హత్యకేసు, ఇతరత్రా వ్యక్తిగత వ్యవహారాలు చక్కబెట్టుకోవడానికేనని ప్రజలందదరికీ తెలుసు
– టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, మాజీమంత్రి నక్కా ఆనంద్ బాబు
రాష్ట్రప్రజలందరికీ శుభకృతనామసంవత్సరంలో రాజపూజ్యం, ఆదాయం బాగాఉంటాయని పండితులు, జ్యోతిష్యులు చెప్పారని, కానీ జగన్మోహన్ రెడ్డిపాలనలో ప్రజలంతా అవమానా లు, అప్పులతో ఈఏడాది తీవ్రమైన ఇబ్బందులుఎదుర్కొంటున్నారని, శ్రీలంకలోఉన్న దారు ణమైన పరిస్థితిలే త్వరలో ఏపీప్రజలు ఎదుర్కోబోతున్నారని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, మాజీమంత్రివర్యులు నక్కా ఆనంద్ బాబు అభిప్రాయపడ్డారు.మంగళవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడా రు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే…
శ్రీలంకకంటే దారుణంగా అక్కడిప్రభుత్వం కంటే మూర్ఖంగా ఈ ముఖ్యమంత్రి ఆర్థికక్రమశిక్షణ పాటించకుండా రాష్ట్రఅప్పులను కొండల్లా పెంచుకుంటూపోతున్నాడు. ఏదేశం అప్పులిస్తే.. ఆ దేశంనుంచి విచ్చలవిడిగా అప్పులుతెచ్చిన శ్రీలంకప్రభుత్వం, చివరకు వాటిని తీర్చలేక, ఆదాయమార్గాలు పెంచుకోలేక దివాళాతీసి, అంతిమంగా ఆదేశప్రజలనే బలితీసుకునేస్థాయి కి దిగజారింది.
అదేవిధంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, తనఖజానా నింపుకోవడాని కి.. తన అవినీతికోసం రాష్ట్రప్రజలను కూడా తాకట్టుపెట్టిమరీ అప్పులుతెచ్చేస్థాయికి వచ్చేశా డు. శ్రీలంకతోఏపీని పోలస్తుంటే ఇక్కడిమంత్రులంతా తెగబాధపడుతున్నారు. కానీ వాస్తవా లు ఆలోచించే జ్ఞానం, ఇంగితం వారికి లేకపోవడం నిజంగా బాధాకరం.
రాష్ట్రంలో అన్నిరకాల నిత్యావసరధరలు ప్రజలకు అందుబాటులోలేని విధంగా… అనూహ్యంగా పెరిగిపోతున్నాయి. ఈప్రభుత్వం, ముఖ్యమంత్రేమో ధరలుపెంచిప్రజలను దోచుకుంటున్నదిచాలక, వారిపై అద నంగా వివిధరకాల పన్నులభారాన్ని మోపుతూ, మరింతగా వారిజీవితాలను నాశనంచేస్తు న్నారు. శ్రీలంకలో ప్రజలు ఆఖరికి తాగునీరు కూడా కొనుక్కునే దుస్థితికి వచ్చారు. ఆదేశం లో 12నుంచి 16గంటలవరకు విద్యుత్ కోతలు అమలుచేస్తున్నారు.
అదేవిధంగా ఏపీలో కూడా 8నుంచి 10గంటలవరకు అప్రకటిత విద్యుత్ కోతలు అమలుచేస్తున్నారు. దానికితోడు జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక 7సార్లు విద్యుత్ ఛార్జీలుపెంచాడు. శ్రీలంక దేశానికి ఆదాయంతగ్గింది… అప్పులు పెరిగాయి. అదేవిధంగా ఏపీకి కూడా ఆదాయం వచ్చే మార్గాలు మూసుకుపోయాయి.. ప్రభుత్వమేమో అప్పులు అప్పులు అంటూ అందరిచుట్టూ తిరుగుతోంది. ఆదేశంలో పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు ఎవరూ ముందుకు రావడం లేదు…
అలానే ఏపీవైపు కన్నెత్తిచూడటానికి పారిశ్రామికవేత్తలు బెంబేలెత్తుతున్నారు. రాష్ట్రయువతఉపాధి, ఉద్యోగాలు లేక మత్తుపదార్థాలకు, జగన్ బ్రాండ్ మద్యానికి బానిసలై పోతున్నారు. రాష్ట్రచరిత్రలో ఇప్పుడున్నటువంటి దరిద్రపుపాలన ఎప్పుడూచూడలేదని ప్రజలంతా అనుకుంటున్నారు. అదేవిధంగా శ్రీలంకప్రజలుకూడా తమదేశంలో ఎన్నడూ ఇలాంటి దారుణాలు చూడలేదని వాపోతున్నారు.
శ్రీలంకకు, ఏపీకి ఇలా అనేకఅంశాల్లో పోలికలున్నాయి. శ్రీలంకపాలకులు ముందుచూపులేకుండా దేశాన్ని, ప్రజలను అప్పులపా లుచేయబట్టే… ఆ దేశాధ్యక్షుడి భవనాన్ని ఏకంగా ప్రజలే చుట్టుముట్టారు. అంతకంటే దారుణమైన పరిస్థితులు ఏపీలోకూడా ఉన్నాయి. రాష్ట్రంలోనియువత, మహిళలు, ఉద్యోగులు, దళితులు, బీసీలు, మైనారిటీలుకూడా జగన్మోహన్ రెడ్డి ఇంటిని ముట్టడించడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి తన ఇంటిచుట్టూ కాపలాపెట్టుకొ ని 144 సెక్షన్ విధించి, ఎవరూదరిదాపుల్లోకి రాకుండాచేస్తున్నాడు.
జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన పిచ్చి ఇసుకపాలసీతో ఇప్పటికీ 30లక్షలమందివరకు భవన నిర్మాణ..అనుబంధరంగాల కార్మికులుఅర్థాకలితో అలమటిస్తున్నారు. ఈరాష్ట్రంలో ఉపాధి, ఉద్యోగాలు లేక కార్మికులు, యువత ఇతరరాష్ట్రాలకు వలసపోతుంటే, శ్రీలంకప్రజలుకూడా తమదేశంవిడిచి ఇతరదేశాలకు పొట్టకూటికోసం వలసలుపోతున్నారు.
ప్రతినెలా అప్పులు తెస్తే తప్ప , ఈ ప్రభుత్వం నడవని దుస్థితికిచేరింది. ప్రతి మంగళవారం సెక్యూరిటీల వేలానికి వెళ్లి అప్పులుతెచ్చే ఏకైకరాష్ట్రంగా ఏపీ దేశంలోనే కొత్తరికార్డు సృష్టించింది. కేంద్రవిద్యుత్ సంస్థ లనుంచి కూడా అప్పులుతెచ్చిన జగన్మోహన్ రెడ్డి, వాటిని సకాలంలోచెల్లించలేక ఏపీ మారి టైమ్ బోర్డునితాకట్టుపెట్టేశాడు. మద్యంఅమ్మకాలపై వచ్చే ఆదాయాన్నితాకట్టుపెట్టిమరీ ముఖ్యమంత్రి అప్పులుతెచ్చాడు. మద్యంఅమ్మితే తప్ప తాను సంక్షేమపథకాలు అమలు చేయలేనని నిస్సిగ్గుగా జగన్మోహన్ రెడ్డే చెప్పడం దురదృష్టకరం.
విద్యుత్ కోతలు, విధ్వంసపుపాలనతో రాష్ట్రాన్ని సర్వనాశనంచేసిన జగన్మోహన్ రెడ్డి, ఎప్పుడు ముఖ్యమంత్రి స్థానంనుంచి దిగిపోతాడా అని ప్రజలంతా వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. శ్రీలంకలో కంటే ఘోరమైన పరిస్థితుల్ని ఏపీలో తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి, నేడుతగుదునమ్మా అంటూ ఢిల్లీ పోతున్నాడు. ఎందుకు పోతున్నాడో ఎవరికీ తెలియదు. కానీ ముఖ్యమంత్రి సొంత మీడియామాత్రం ఏపీ సమస్యల పరిష్కారానికే ఆయన ఢిల్లీ వెళ్తున్నాడని ఊదరగొడుతున్నాయి.
గతంలోనే ముఖ్యమంత్రిని కేంద్రప్రభుత్వం అనేకసార్లు తలంటింది. శ్రీలంకలో కంటే దారుణమైన పరిస్థితులు ఏపీకి రాబోతున్నాయని ఎప్పుడో కేంద్రప్రభుత్వం, ఢిల్లీపెద్దలు ముఖ్యమంత్రిని హెచ్చరించారు. కానీ వారిమాటలను జగన్ రెడ్డి ఎప్పుడూ ఖాతరు చేయలేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి ఢిల్లీవెళ్తున్నదికూడా తనపై ఉన్న కేసులు, బాబాయ్ హత్యకేసు, ఇతరత్రా వ్యక్తిగత వ్యవహారాలను చక్కబెట్టుకోవడానికేనని తాము ఘంటా పథంగా చెప్పగలం.
ముఖ్యమంత్రి స్థానంలో ఉండి మూర్ఖంగావ్యవహరిస్తూ, ప్రజలతో ఆడుకుం టున్న జగన్మోహన్ రెడ్డికి బుద్దిచెప్పడానికి ఇప్పటికైనా ప్రజలంతా ఏకంకావాలని, పూర్తిగా శ్రీలంకదేశంలా ఏపీకూడా దేశచిత్రపటంనుంచి కనుమరుగు కాకముందే తెలుగు ప్రజలంతా ఏకమై జగన్మోహన్ రెడ్డిని రాష్ట్రం నుంచి తరిమికొట్టాలని ఈసందర్భంగాపిలుపు ఇస్తున్నాము.