-దుమ్ముంటే అక్రమ మైనింగ్ పై జ్యుడీషియరీ ఎంక్వైరీ వేయాలి
-కొండల్ని, గుట్టల్ని మాయం చేస్తూ ఎదురుదాడి చేస్తున్నారు
-వైసీపీ అజెండా దోచుకో దాచుకో అన్న విధంగా ఉంది
-నక్కా ఆనంద్ బాబు
రాష్ట్రంలో కొండల్ని, గుట్టల్ని మాయం చేస్తున్న జగన్ రెడ్డి అండ్ కో వ్యవహారం బట్టబయలు కావడంతో టీడీపీపై ఎదురుదాడి చేస్తున్నారు. దోపిడీకి సిగ్గుపడాల్సింది పోయి సమర్థించుకుంటున్నారు. మసిపూసి మారేడుకాయ చేసేందుకు యత్నిస్తున్నారు. ఉన్నమాట అంటే ఉలిక్కి పడుతున్నారు. వైసీపీ దొంగల చేతిలో కొండలన్నీ కరిగిపోతున్నాయి.
అభివృద్ధి మాత్రం శూన్యం. వైసీపీ అజెండా దోచుకో దాచుకో అన్న విధంగా ఉంది. ప్రజాధనాన్ని, ప్రకృతిని లూటీ చేస్తున్నారు. వైసీపీ బకాసురులు రాష్ట్రవ్యాప్తంగా కొండలు, గుట్టలు, చెరువులు, వాగులు, వంకలు, ఇసుక, అటవీభూములను పిండిచేస్తున్నారు. దోపిడీకేది అనర్హం కాదన్నట్లుగా ఉంది. 150 నియోజకవర్గాల్లో యథేచ్ఛగా అక్రమ మైనింగ్ జరుగుతోంది.
హైకోర్టులో సైతం అక్రమాలపై వ్యాజ్యాలు నమోదయ్యాయి. ఎన్ని మొట్టికాయలు పడ్డా నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నారు. విశాఖ చారిత్రక రిషికొండ ప్రాంతం కనుమరుగైంది. గతంలో పాత ఫోటోలు అంటూ మాయ చేస్తున్నారు. మన్యం ప్రాంతంలో వైవీ సుబ్బారెడ్డి 15వేల కోట్ల బాక్సైట్ కుంభకోణం, బమిడికలొద్దిలో లాటరైట్ ముసుగులో బాక్సైట్ దోపిడీ చేస్తున్నారు. భారతి సిమెంట్స్ కోసం వందలాది లారీలు లాటరైట్ తరలిస్తున్నారు. ఇసుకను మేం ఉచితంగా ఇస్తే.. నేడు ట్రాక్టర్ 7వేలకు చేరింది.
అది కూడా అందుబాటులో లేదు. దీంతో 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జగన్ రెడ్డి ఇసుకను కూడా తినేస్తున్నారు. శేఖర్ రెడ్డి అనే బినామీని అడ్డుపెట్టుకుని లూటీ చేస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు మట్టి, గ్రావెల్ ను ఏదీ వదిలిపెట్టడం లేదు. ప్రశ్నించిన టీడీపీ నేతలపై అక్రమ కేసులు నమోదు చేసి ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ప్రకాశంలో గ్రానైట్ అక్రమాలు జరుగుతున్నాయి. వే బిల్లులు లేకుండా తరలిస్తున్నారు.
ఈ అక్రమ సంపాదనంతా తాడేపల్లి ప్యాలెస్ కు చేరుతోంది. ప్రకృతిని అంతా నాశనం చేస్తున్నారు. రేపు భవిష్యత్ తరాలు ఏ విధంగా జీవనం సాగించాలి? ఇన్ని చేస్తూ.. చంద్రబాబు వాస్తవాలు చెబితే.. ఓర్చుకోలేక ఎదురుదాడి చేస్తున్నారు. మేం ఇంతకంటే ఎక్కువ తిట్టగలం. ప్రజలు సమయం కూడా ఎదురుచూస్తున్నారు. ఏవిధంగా బుద్ధి చెప్పాలో చెబుతారు. గాలి జనార్థన్ రెడ్డి అంశాన్ని మనం చూశాం. ఓబులాపురంలో ఐరెన్ ఓర్ పెద్దఎత్తున అక్రమంగా తరలించారు. నేడు ఏపీలో నియోజకవర్గానికో గాలి జనార్థన్ రెడ్డి తయారయ్యారు. దుమ్ముంటే వీటన్నింటిపై జ్యుడీషియరీ ఎంక్వైరీ వేయాలి.