ఆటో హారన్ కు డబ్బులిచ్చి ఇంజిన్ కొట్టేస్తున్న జగన్ రెడ్డి

– బటన్ నొక్కి రోడ్లు బాగు చేస్తారనుకుంటే.. రోడ్లను చెరువుల్ని చేశారు
– తల్లినీ చెల్లిని తరిమేసినంత సులువుకాదు రాష్ట్రాన్ని పాలించడమంటే
– TNTUC రాష్ట్ర అధ్యక్షులు గొట్టుముక్కల రఘురామ రాజు

వాహన మిత్ర పేరుతో సీఎం జగన్ రెడ్డి ఆటో, ట్యాక్సీ, క్యాబ్ డ్రైవర్లకు హారన్ కొనేందుకు సరిపడా డబ్బులు చేతిలో పెట్టి వెనక నుండి ఇంజిన్ కొట్టేస్తున్నారు. రూ.10వేలు ఇచ్చి అందరి జీవితాలు ఉద్దరించేశాను అన్నట్లు జగన్ రెడ్డి చేస్తున్న ప్రచారం సిగ్గుచేటు అని TNTUC రాష్ట్ర అధ్యక్షులు గొట్టుముక్కల రఘురామరాజు అన్నారు. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ..

వాహన మిత్ర సభలో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఆర్భాటం చూస్తే ఆశ్చర్యం కలుగుతోంది. రాష్ట్రంలోని ఆటో, ట్యాక్సీ, క్యాబ్ డ్రైవర్లను, వారి కుటుంబాలను ఆదుకుంటున్నా అనడం సిగ్గుచేటు. రాష్ట్రంలో 10 లక్షల మందికి పైగా రిజిస్టర్డ్ డ్రైవర్లున్నారు. ఇదే విషయాన్ని ప్రభుత్వం ఆర్టీఐ ద్వారా ఇచ్చిన సమాచారంలోనూ పేర్కొంది. కానీ.. నేడు వాహన మిత్ర 2.61 లక్షల మందికి మాత్రమే ఇవ్వడమంటే 8 లక్షల మందిని మోసం చేయడం కాదా.? 100 మందిలో 10 మందికి ఇచ్చి అందరినీ ఉద్దరించినట్లు కటింగ్ ఇవ్వడం అత్యంత హేయం. నడిరోడ్డుపై ఆర్టీఓ అధికారుల్ని పెట్టి ఆటోలకు వాహన మిత్ర స్టిక్కర్లు అతికించడం నిజం కాదా.?

ప్రతిపక్ష నేతగా ఊరూరా తిరిగి అందరికీ పథకం అందిస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక అడ్డగోలు నిబంధనలు, దిక్కుమాలిన షరతులతో కోతలు విధిస్తున్నారు. ఆటో నడిపే వాడికి 100 గజాల ఇల్లు ఉంటే పథకం ఇవ్వరా.? ఒకే ఇంట్లో ఇద్దరు ఆటో నడుపుతూ బతికితే ఒకరికే ఇస్తారా.? ఒకరికి ఇస్తే ఇద్దరికీ ఇచ్చినట్లు ఎలా అవుతుంది జగన్ రెడ్డీ అని ప్రశ్నించారు.

జరిమానాల విషయంలో జగన్ రెడ్డి అడ్డగోలుగా పచ్చి అబద్దాలు మాట్లాడారన్నారు. చంద్రబాబు నాయుడు హయాంలో లైసెన్సు లేకుండా వాహనం నడిపితే రూ.150 ఉన్న జరిమానా ప్రస్తుతం రూ.300 చేశారు. రెండో సారి దొరికితే రూ.600 లాక్కుంటున్నారు. గతంలో మినిమం ఛలానా రూ.135 ఉండేది. ఇప్పుడు వెయ్యి వసూల్ చేస్తున్నారు. సంవత్సరానికి సగటున ప్రతి డ్రైవర్ పై 10-15 జరిమానాలుంటాయి. అంటే ఏడాదికి రూ.15000 లాగేస్తున్నారు.

గతంలో ఆటో, క్యాబ్, ట్యాక్సీ పర్మినెంట్ రెన్యువల్ రూ.2000 ఉంటే. ఇప్పుడు రూ.10వేలు చేశారు. డ్రైవింగ్ లైసెన్సు రెన్యువల్ గతంలో రూ.1500 ఉంటే ఇప్పుడు రూ.5వేలు చేశారు. ఇదేనా ఆటో డ్రైవర్లను ఉద్దరించడం.? అడ్డగోలుగా జరిమానాలు పెంచుతూ మీరిచ్చిన జీవో నెం.21 సంగతి ఏంటి అని ప్రశ్నించారు. అడ్డగోలుగా జరిమానాలు పెంచి.. చంద్రబాబు నాయుడిపై నిందలు వేస్తే ఊరుకునేది లేదు. బటన్ నొక్కి బ్యాంకు ఖాతాల్లో డబ్బులు వేస్తున్న జగన్ రెడ్డి.. రోడ్ల మీద పోలీసుల్ని పెట్టించి జరిమానాల రూపంలో ఆ మొత్తాన్ని లాక్కోవడం వాస్తవం కాదా.?

ప్రతిపక్షంలో ఉండగా.. పెట్రోల్ డీజిల్ ధరల గురించి జగన్ రెడ్డి నానా రాద్దాంతం చేశారు. ఇప్పుడు ఏపీలోని పెట్రోల్, డీజిల్ ధరలు దేశంలోనే అధికంగా ఉన్నాయి. ఇప్పుడెందుకు నోరెత్తడం లేదు.? పెరిగిన డీజిల్ ధరలతో ఒక్కో ఆటో డ్రైవర్ నుండి రోజుకు సగటున రూ.50 చొప్పున అనుకున్నా నెలకు రూ.1500, ఏడాదికి రూ.18000 లాక్కుంటున్నారు. ఇదేనా సంక్షేమం.? ఇదేనా ఆటో కార్మికుల్ని ఉద్దరించడం.? ఆటో హారన్ కొనేందుకు సరిపడా డబ్బులు చేతిలో పెట్టి.. వెనక నుండి ఇంజిన్ కొట్టేస్తున్నారని ఎద్దేవా చేశారు.

రోడ్డు మరమ్మతుల పేరుతో పెట్రోల్, డీజిల్ పై వసూలు చేస్తున్న రోడ్ సెస్ డబ్బు ఏమవుతోంది.? కొత్త ఆటోలు, కార్లు కూడా ఈ రోడ్లపై నడిపితే ఆరు నెలలకే షెడ్డుకు చేరుతున్నాయి. జులై 15 నాటికి రోడ్లన్నీ అద్దంగా మార్చేస్తానన్న జగన్ రెడ్డి.. బటన్ నొక్కి బాగు చేస్తారేమో అని ఎదురు చూశాం. కానీ ఆ రోడ్లన్నింటినీ చెరువుల్లా మారుస్తారని అనుకోలేదన్నారు.

జగన్ రెడ్డి వీరుడు సూరుడు అంటూ పేటీఎం కూలీలతో భజన చేయించుకోవడం తప్ప.. కార్మికులను ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదు. బటన్ నొక్కుడు కాదు.. ముందు నీ అరికాళ్లలో ఉన్న మెదడు బటన్ నొక్కి ప్రజల సమస్యలు పరిష్కరించాలని సవాల్ విసిరారు. బటన్ నొక్కి బాబాయిని వేసేశారు. బటన్ నొక్కి తల్లిని చెల్లిని తరిమేశారు. ఇప్పుడు బటన్ నొక్కి ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు.

అధికారంలోకి వచ్చీ రాగానే ఇసుక ఆపేసి భవన నిర్మాణ రంగాన్ని నాశనం చేశారు. మద్యం పాలసీ పేరుతో కల్తీ మద్యం, అధిక ధరలకు అమ్ముతూ కార్మికుల్ని, కర్షకుల్ని దోచుకుంటున్నారు. గతంలో ఎన్నడూ లేనంతటి దుర్భర పరిస్థితుల్ని కార్మికులు నేడు ఎదుర్కొంటున్నారు. కార్మిక లోకానికి జగన్ రెడ్డి చేసిన మోసానికి ఎప్పుడు ప్రతీకారం తీర్చుకుందామా అని ప్రతి కార్మికుడూ ఎదురు చూస్తున్నాడు. వచ్చే ఎన్నికల్లో జగన్ రెడ్డిని తన్ని తరిమేయడం తధ్యం.

Leave a Reply