-వైసీపీ సర్కారుపై మాజీ మంత్రి నక్కా వ్యంగ్యాస్త్రాలు
-అమరావతి లో పేదలకు సెంటు పట్టాల పై మాజీ మంత్రి, పోలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనంద్ బాబు
రాజమండ్రి: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమరావతిలో పెదలకు పట్టాలు అని హడావుడి చేస్తున్నాడు ఇది చూస్తుంటే చాలా హాస్యాస్పదంగా ఉంది! గుంటూరు -మంగళగిరి- విజయవాడ లో ఉన్నటువంటి పేదలకు అమరావతిలో పట్టాలిస్తానంటున్నాడు నిన్నటి వరకు వీళ్ళ మంత్రులు అమరావతిని, స్మశానము ఎడారితో పోల్చారు. అక్కడ ఉన్న కట్టడాలు గ్రాఫిక్స్ అని చెప్పి చెప్పారు. ఎడారిలో ఈరోజు పేదలకు పట్టాలు అంటూ హడావిడి చేస్తున్నాడు. పేదల గురించి వైసీపీ వాళ్లు మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది తాడేపల్లి ముఖ్యమంత్రి నివాసం వద్ద ఉంటున్న పేదలను బలవంతంగా ఖాళీ చేయించిన చరిత్ర జగన్మోహన్ రెడ్డిది.
ఇడుపులపాయలో దళితుల అసైన్డ్ భూములు వేల ఎకరాలు వీళ్ళ కబ్జాలో ఉన్నది ప్రజలందరికీ తెలిసిందే ఇటువంటి వ్యక్తులు పేదల గురించి మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా ఉంది. కోర్టు చాలా క్లియర్ గా చెప్పింది. మీరు ఇచ్చే పట్టాలు కోర్టు తీర్పుకు లోబడి ఉండాలి. తర్వాత జడ్జిమెంట్ తేడా వస్తే అని చెప్పారు. ఇవన్నీ తెలిసి కూడా ఎవరిని మోసం చేద్దాం అని చెప్పేసి 50,000 పట్టాలు 60 వేలు పట్టాలు ఇస్తున్నామని చెప్పుకుంటున్నారు.
పట్టా తీసుకునే వాళ్ళు ఏం చేయాల మాకు పట్టా ఉంది అని చెప్పేసి సంతోష పడాల? బ్యాంకు లోన్ ఇవ్వు కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వదు రాష్ట్ర ప్రభుత్వం ఇల్లు కట్టదు.రేపు కోర్టు తీర్పు వ్యతిరేకంగా వస్తే ఈ బాధలను ఏం చేస్తారు? పేదలకు రాజధాని రైతులు మధ్య గొడవలు పడటం తప్ప వేరే అంశం లేదు ఇది పేదలకు కీడు ద్రోహం చేసే ఆలోచన తప్ప వేరే ఏమీ లేదు.
కేంద్ర ప్రభుత్వం నగరాన్ని అభివృద్ధి చేసే విషయంలో ప్రపోజల్ పంపించమంటే అమరావతిని వదిలేసి ముఖ్యమంత్రి నియోజకవర్గంలోని ఒక నగరానికి ఇచ్చాడంటే అమరావతి పై వీళ్ళ చిత్తశుద్ధి ఏమిటో తెలుసుకోవచ్చు.
అమరావతి రాజధాని ఆశించేయడానికి కంకణం కట్టుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఓట్ల కోసం డ్రామాలాడుతున్నాడు ప్రజలు సమయం కోసం ఎదురుచూస్తున్నారు నిన్ను తరిమికొట్టి రోజులు దగ్గరలో ఉన్నాయి.