జగన్మోహన్ రెడ్డికి నేనంటే భయం… అందుకే నా రాకను అడ్డుకున్నారు

– ప్రధానమంత్రి హాజరు అయినప్పుడు, ఆ సభకు నన్ను ఆహ్వానించకుండా అడ్డుకున్నారు
-అమరావతి సభకు తాటికొండ ఎమ్మెల్యే శ్రీదేవిని ఆహ్వానించకపోవడం సిగ్గుచేటు
-ఒక ఎమ్మెల్యేను ఆహ్వానించాలన్న బుద్ధి జిల్లా కలెక్టర్ కు లేదా?
-శ్రీదేవి అంటే కూడా జగన్మోహన్ రెడ్డికి భయమేనా?
-సిగ్గు ఉంటే దళిత నేతలు కూడా ఈ విషయమై ముఖ్యమంత్రిని నిలదీయాలి
-పేదలకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నది గుండు సున్నా
-భూమి ప్రభుత్వానిది కాదు… అమరావతి పేద రైతులది
-ఇండ్ల నిర్మాణానికి1,80,000 ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం… టైటిల్ డీడ్ లేకుండా ఏ బ్యాంకు అప్పు ఇవ్వదు
-ఇసుక ప్రభుత్వ ఆస్తి… అంటే రాష్ట్ర ప్రజలందరి ఆస్తి
-తొమ్మిది లక్షల రూపాయల విలువ చేసి ఆస్తిని ఇచ్చానని చెబుతున్న జగన్మోహన్ రెడ్డి పేదలకు ఇచ్చింది శూన్యం
-మూడేళ్ల నుంచి ఎవరికైనా ఇండ్లు కట్టించారా?
-ఇప్పుడు అమరావతిలో లబ్ధిదారులకు ఇండ్లు కట్టించి ఇస్తారట…
-30 లక్షల మందికి ఇదే అబద్ధాన్ని గత మూడేళ్ల నుంచి చెబుతూ వస్తున్న జగన్మోహన్ రెడ్డి సర్కార్
-అమరావతి సభ కు స్థానిక ఎమ్మెల్యే శ్రీదేవిని ఎందుకు ఆహ్వానించలేదు?
-ఒక దళిత ప్రజా ప్రతినిధికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చే గౌరవం ఇదేనా??
-పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ఎవరూ వ్యతిరేకం కాదు… కానీ నిర్దేశించిన జోన్ లో మాత్రమే ఇవ్వండి
-కే ఏ పాల్ ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డికి మెండుగా ఉండాలి… ఇక జగన్మోహన్ రెడ్డి కోసం బ్రదర్ అనిల్ ప్రార్థనలు ప్రచారం చేయరు
-గుండెపోటు అని అంటే నేరం మీద వేస్తారా అని ప్రశ్నించిన అవినాష్ తరపు న్యాయవాది
చెప్పాలంటే అవినాష్ ను ఈ కేసులో కోలుకో లేకుండా ఆయన న్యాయవాదే ఆయన్ని ఇరికించారనేది నా భావన
-నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు

పేద ప్రజలకు లక్షల రూపాయల ఆస్తిని పంచుతున్నానని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటన హాస్యాస్పదంగా ఉంది. పేద ప్రజలకు ఆయన ఇస్తున్నది గుండు సున్నా. అమరావతిలో పేదలకు ఇస్తానని చెబుతున్న స్థలం రాష్ట్ర ప్రభుత్వానిది కాదు. రాజధాని నిర్మాణం కోసం పేద రైతులు ఇచ్చిన భూములవి. పేద రైతులు ఇచ్చిన భూములను సుప్రీం కోర్టు తీర్పు భిన్నంగా పేద ప్రజలకు పంచుతానని పేర్కొనడం విడ్డూరంగా ఉందని నరసాపురం ఎంపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రఘురామకృష్ణం రాజు విమర్శించారు.

శుక్రవారం రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఆయన తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… అమరావతిలో పేదలకు ఇస్తానని చెబుతున్న ఇళ్ల స్థలాలలో, ఇంటి నిర్మాణానికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం 1,80,000 ఇచ్చే ప్రసక్తే లేదు.

టైటిల్ డీడ్ లేని స్థలాలలో ఇంటి నిర్మాణాలకు కేంద్ర ప్రభుత్వ నిధులను కేటాయిస్తే, ఆ నిధులు దుర్వినియోగం అయ్యే అవకాశం ఉంది. ఇళ్ల స్థలాల కేటాయింపు లో ఎన్నో న్యాయపరమైన సమస్యలు ఉన్నాయని, ఇప్పటికే నేను కేంద్ర ప్రభుత్వానికి సుదీర్ఘమైన లేఖ రాశానని తెలిపారు. నన్ను అసురుడంటే అనుకోనివ్వండి. అసురుడు ఎవరో, సురుడు ఎవరో రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఒక రాక్షసుడు తనని ఏమన్నా కూడా తనకు వచ్చిన ఇబ్బంది లేదు.

పదివేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం వద్ద నుంచి పట్టుకు వచ్చానని జగన్మోహన్ రెడ్డి పదేపదే చెబుతున్నారు. పదివేల కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇచ్చిందో భవిష్యత్తులో తెలుస్తుంది. అమరావతిలో నిర్వహించిన అసురుల సభలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ నరకాసురుడు కూడా ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ని నమ్మరని పేర్కొన్నారు.

అసురుడు కాని వారిని, సురుడిని రాక్షసులు నమ్మినట్టు చరిత్రలోను లేదు. రాక్షసుడే, రాక్షసుడిని నమ్ముతాడు. తనకు తానే దేవుడిగా చెప్పుకుంటున్న ఈ అసురుడుని చూస్తే రావణబ్రహ్మే గుర్తుకు వస్తున్నారు. రావణబ్రహ్మ కూడా తనకు తానే దేవుడినని భావించి అహంకారంతో ఎలాంటి చావు చచ్చారో అందరికీ తెలుసునని రఘురామకృష్ణం రాజు పేర్కొన్నారు. ప్రతి పేదవాడికి 5 నుంచి 10 లక్షల విలువ చేసే భూమిని ఇస్తున్నానని జగన్మోహన్ రెడ్డి పేర్కొనడం హాస్యాస్పదంగా ఉంది.

1,80,000 రూపాయలను మీ అకౌంట్లో జమ చేస్తానని, పావలా వడ్డీకే 35 వేల రూపాయలు బ్యాంకుల ద్వారా రుణాన్ని ఇప్పిస్తానని, అమరావతిలో ఇంటి నిర్మాణం చేసుకునే పేదలకు ఇసుకను ఉచితంగా అందజేస్తామన్న జగన్మోహన్ రెడ్డి, కట్టించమంటే మీ ఇండ్లను చిరునవ్వుతో కట్టిస్తానని పేర్కొనడం చూస్తే ప్రజలు ఏమైనా అమాయకులని భావిస్తున్నారా? అని రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు. గత మూడేళ్లుగా ఇదే వెధవ డైలాగు చెబుతున్నారు. ఇప్పటికీ రాష్ట్రంలో ఎవరికైనా ఒక్క ఇంటిని కట్టించారా? అని నిలదీశారు.

రాష్ట్రంలో ఇండ్ల స్థలాల లబ్ధిదారులను ఇల్లు కట్టుకుంటారా?, లేకపోతే ఇంటి స్థలాన్ని రద్దు చేయమంటారా?? అని బెదిరింపులకు దిగింది నిజం కాదా అని ప్రశ్నించారు. అమరావతిలో పేదలకు ఇండ్ల స్థలాలను కేటాయించడానికి సుప్రీంకోర్టుకు వెళ్లి న్యాయపోరాటం చేసి రెడ్డి విజయం సాధించానని జగన్మోహన్ రెడ్డి పేర్కొనడం సిగ్గుచేటు. హైకోర్టు తుది తీర్పుకు లోబడి అమరావతిలో ఇండ్ల స్థలాలను కేటాయించాలని సుప్రీం కోర్టు తన తీర్పులో స్పష్టంగా వెల్లడించింది నిజం కాదా?

అమరావతిలో ఇండ్ల స్థలాలపై హక్కులను ఎవరు కూడా క్లైమ్ చేయడానికి వీలు లేదని పేర్కొనలేదా??. ఒకవేళ కోర్టు తీర్పు ప్రభుత్వానికి వ్యతిరేకమైతే, ప్రజా ధనమంతా గంగపాలె కదా?, ఇప్పటికే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చితికి పోయింది. ఈ నిర్ణయంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ సంక నాకి పోయే ప్రమాదం ఉందని రఘురామకృష్ణం రాజు మండిపడ్డారు.

ఒక్క రూపాయి షేర్ ను 100 రూపాయలకు విక్రయించి సిమెంటు ప్లాంట్ నిర్మించిన జగన్మోహన్ రెడ్డి
ఒక్క రూపాయ విలువ చేసే షేర్ ను 100 రూపాయలకు విక్రయించి సిమెంటు ప్లాంటును జగన్మోహన్ రెడ్డి నిర్మించుకున్నారు. 2004 కు ముందు జగన్మోహన్ రెడ్డి ఆస్తులు కేవలం కోటి 90 లక్షలు మాత్రమే. 2009 నాటికి సిమెంటు ప్లాంట్ నిర్మాణాన్ని పూర్తి చేశారు. తన కంపెనీ సిమెంటును అమరావతి లో ఇండ్ల నిర్మాణం చేసే పేదలకు విక్రయించి సొమ్ము చేసుకుని, రాష్ట్ర ప్రజలందరి ఆస్తి అయిన ఇసుక ను మాత్రం ఫ్రీగా ఇస్తానని ప్రకటించడం సిగ్గుచేటు.

అమరావతిలో ఇండ్ల నిర్మాణం కోసం నిర్మాణ సామాగ్రిని సరఫరా చేయమంటే తమ వారే సరఫరా చేస్తారని జగన్మోహన్ రెడ్డి పేర్కొనడం విడ్డూరంగా ఉంది. నిర్మాణ సామాగ్రి సరఫరా నెపం తో మా పార్టీ వారు ఎంత కమిషన్ నొక్కుతారో అందరికీ తెలిసిందే. టైటిల్ డీడ్ లేని ఇండ్ల స్థలాలకు రుణాలను మంజూరీ చేస్తే, అరగంటలో ఆ బ్యాంకు చైర్మన్ ను అరెస్టు చేయిస్తానని రఘురామకృష్ణంరాజు సవాల్ చేశారు. పట్టాభిషేకం అనే టైటిల్ తో సాక్షి దినపత్రికలో వార్తా కథనాలు రాసి ప్రజలను మోసగించాలని చూస్తున్నారు.

అమరావతిలో నిర్వహించిన సభలో జగన్మోహన్ రెడ్డి తన సిమెంట్ కంపెనీ ప్రమోషన్ చేసుకోవడం మినహా, ఈ సభ వల్ల పేదలకు ఒరిగిందేమీ లేదు. అమరావతిలో నిర్వహించిన సభకు తాటికొండ ఎమ్మెల్యే శ్రీదేవిని ఆహ్వానించకపోవడం సిగ్గుచేటు. గతంలో నరసాపురం నియోజకవర్గానికి ప్రధానమంత్రి హాజరు అయినప్పుడు, ఆ సభకు నన్ను ఆహ్వానించకుండా అడ్డుకున్నారు.

జగన్మోహన్ రెడ్డికి నేనంటే భయం… అందుకే నా రాకను అడ్డుకున్నారు. ప్రోటోకాల్ ప్రకారం ఒక ఎమ్మెల్యేను ప్రభుత్వ కార్యక్రమానికి ఆహ్వానించాలన్న బుద్ధి జిల్లా కలెక్టర్ కు లేదా?, శ్రీదేవి అంటే కూడా జగన్మోహన్ రెడ్డికి భయమేనా??. ప్రభుత్వ కార్యక్రమానికి హాజరుకావాలని ఆహ్వానం పంపితే , ఆమె హాజరు కావచ్చు కాకపోవచ్చు… ఆహ్వానం పంపడం అన్నది ప్రభుత్వ అధికారుల విధి అని గుర్తు చేశారు.

ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసే కొంతమంది మూర్ఖులు చెప్పిన మాటలు విని ఒక దళిత ప్రజా ప్రతినిధిని, ప్రభుత్వ కార్యక్రమానికి ఆహ్వానించరా? దళితులకు మీరు ఇచ్చే గౌరవం ఇదేనా? నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు, నా మైనార్టీలు అని పేర్కొనే జగన్మోహన్ రెడ్డి ఒక దళిత స్త్రీ కి ఇచ్చే గౌరవం ఇదేనా? దళిత జాతి తరపున తాను ఈ విషయాన్ని ప్రశ్నిస్తున్నాను. నిజంగా సిగ్గు ఉంటే దళిత నేతలు కూడా ఈ విషయమై ముఖ్యమంత్రిని నిలదీయాలి.

దళిత ప్రజా ప్రతినిధిని ప్రభుత్వ కార్యక్రమానికి ఆహ్వానించకుండా అవమానించడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. బటన్ నొక్కుడు కార్యక్రమంలో నొక్కుడే అధికమైంది. జులై 8వ తేదీ అమరావతి ప్రాంతంలో ఇండ్ల నిర్మాణాన్ని ప్రారంభిస్తారట… ఎలా ప్రారంభిస్తారో నేను కూడా చూస్తాను. కోర్టు తీర్పు వచ్చేవరకు అప్పు ఇవ్వకూడదని కేంద్ర ప్రభుత్వానికి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అమరావతి లో పేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వడాన్ని ఎవరు వ్యతిరేకించడం లేదు కానీ నిర్దేశించిన ప్రాంతంలో మాత్రమే ఇవ్వండి.

అంతేకానీ ఇతర జోన్లలో ఇండ్ల స్థలాలను కేటాయించి, అమరావతి నవ నగరాలను దెబ్బతీయాలని చూస్తే రాష్ట్ర ప్రజలు సహించరు. న్యాయస్థానాలలో న్యాయం జరగడం ఆలస్యం కావచ్చు. ఈ లోపు గానే అసెంబ్లీ ఎన్నికలు జరగవచ్చు. ఈ ప్రభుత్వం మార వచ్చు. అమరావతిలో ఇండ్ల నిర్మాణానికి జగన్మోహన్ రెడ్డి వద్ద దమ్మిడి కూడా లేదు.

ప్రెస్టేజ్ కి పోయి ఓ అయిదారువేల కోట్ల రూపాయలు అప్పులు చేసి ఇండ్ల నిర్మాణాన్ని చేపట్టాలని ఆయన భావిస్తుండవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ₹1,80,000 వేల కోట్ల రూపాయల బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. వాటికి తోడు అన్నట్లుగా మరో ఐదు ఆరు వేల కోట్ల రూపాయల అప్పులు చేసి, మంగళగిరిలో లోకేష్ ను ఓడించడానికి అమరావతిలో ఇండ్ల నిర్మాణానికి కృషి చేయవచ్చు. ఒక్క అమరావతి ప్రాంతంలో ఇండ్ల నిర్మాణాన్ని చేపడితే, మిగిలిన 174 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఓడిపోతే మన పార్టీ పరిస్థితి ఏమిటి?. భూమికి వెలకట్టడం జగన్మోహన్ రెడ్డి మానుకోవాలి. రైతుల శ్రమ నమ్మకాన్ని అభాసుపాలు చేసే విధంగా నేను ఇంత వేల ఉన్న భూమిని ఇచ్చాననడం తప్పు. రైతులు ధైర్యంగా తమ నిరసన కార్యక్రమాలను కొనసాగించాలి. రైతులకు ప్రజల ఆశీస్సులు ఉన్నాయి. ప్రకృతి ఇటువంటి దుర్మార్గులను పగబట్టి సరిచేస్తుంది. రాక్షసులను ధైర్యంగా ఎదుర్కొందామని రఘురామకృష్ణం రాజు పిలుపునిచ్చారు.

ఎర్ర గంగిరెడ్డి జైలులో ఉండాల్సిందే…
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడిగా అభియోగాలను ఎదుర్కొంటున్న ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు పై న్యాయస్థానం స్టే విధించింది. గతంలో తెలంగాణ హైకోర్టు ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు చేస్తూ, జూలై ఒకటవ తేదీన లక్ష రూపాయల పూచికత్తు తో తిరిగి బెయిలును మంజూరు చేసిన విషయం తెలిసిందే.

బెయిల్ రద్దుచేసి, తిరిగి బెయిల్ మంజూరు చేయడం వెకిలిగా ఉందన్న వాదనలతో ఏకీభవిస్తూ న్యాయస్థానం స్టే విధించింది. అవినాష్ రెడ్డి తల్లి ఆరోగ్యం మెరుగుపడి హైదరాబాదులోని ప్రముఖ ఆసుపత్రికి ఆమెను తరలించారు. కడప, కర్నూలు కేంద్రంగా నడిచిన డ్రామాలు, హైదరాబాదులోని ప్రముఖ ఆసుపత్రి ఆవరణలో నడిచే అవకాశాలు లేవు.

కే ఏ పాల్ ఆశీర్వదించిన వెంటనే శ్రీలక్ష్మి కి ఆరోగ్యం కుదుటపడినట్లు సాక్షి దినపత్రికలో రాశారు. కే ఏ పాల్ ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డికి మెండుగా ఉండాలి. ఇక బ్రదర్ అనిల్ , జగన్మోహన్ రెడ్డి తరపున ప్రచారం, ప్రార్థనలు చేసే అవకాశాలు లేవు. కె ఏ పాల్ ఆయన స్వస్థత కోసం ప్రార్థనలు చేయాలని రఘురామకృష్ణంరాజు ఎద్దేవా చేశారు.

వివేక మీ కుటుంబ సభ్యుడు కాదా?
వైఎస్ వివేకానంద రెడ్డి వ్యక్తిత్వ హననానికి అవినాష్ రెడ్డి తరపు న్యాయవాది ఉమామహేశ్వరరావు తీవ్రంగానే ప్రయత్నించారు. ఎర్ర గంగిరెడ్డి కి భార్య లేకపోవడం వల్ల ఆయనతో భూతగాదాలు ఉన్నాయని చెప్పారు. ఇక సునీల్ యాదవ్ తల్లిని, శివశంకర్ రెడ్డి భార్యను వైఎస్ వివేకానంద రెడ్డి లైంగికంగా వేధించినట్లుగా పేర్కొనడం హాస్యాస్పదంగా ఉంది.

ఉమామహేశ్వరరావు వాదనలు వింటే ఆయన ఎవరి తరపున వాదిస్తున్నారో వారే వైఎస్ వివేకానంద రెడ్డిని హత్య చేసి ఉంటారని అనిపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి తరుచూ వైఎస్ కుటుంబం అని పేర్కొంటూ ఉంటారని, వైఎస్ వివేకానంద రెడ్డి వైఎస్ కుటుంబ సభ్యుడు కాదా? అని రఘు రామ కృష్ణంరాజు ప్రశ్నించారు.

వైఎస్ వివేకానంద రెడ్డి కనిపించే ప్రతి మహిళను లైంగికంగా వేధించే వాడే అయితే, ముస్లిం యువతీని రెండవ పెళ్లి ఎందుకు చేసుకుంటారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైవాహిక జీవితంలోని విడాకుల గురించి తరచూ జగన్మోహన్ రెడ్డి ప్రస్తావిస్తూ ఉంటారని, ఆయన కుటుంబంలో ఎన్ని విడాకులు జరిగాయో ప్రజలందరికీ తెలుసు. తన తల్లిని, భార్యను వైఎస్ వివేకానంద రెడ్డి లైంగికంగా వేధించారని సునీల్ యాదవ్, ఉమా శంకర్ రెడ్డి డబ్బులు పోగు చేసి కోటి రూపాయలను దస్తగిరి కి ఇచ్చి హత్య చేయించారా? అంటూ నిలదీశారు.

గుండెపోటు అంటే ఆ నేరం మీద వేస్తారా? అని ఉమామహేశ్వర్ రావు చేసిన వాదనలను పరిశీలిస్తే మళ్ళీ కోలుకో లేకుండా, ఈ కేసులో అవినాష్ రెడ్డిని ఆయనే ఇరికించినట్లుగా నాకు కనిపిస్తోందని రఘురామకృష్ణం రాజు తెలిపారు.

Leave a Reply