• అన్నదాతలను ఆదుకోలేని అసమర్థ ముఖ్యమంత్రికి నీటితీరువా వసూళ్లు చేసే హక్కు ఎక్కడిది?
• గిట్టుబాటుధరలేక, తెగుళ్లవల్ల, పెట్టుబడులు అధికమై పంటలుకోల్పోయి రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.
• పట్టించుకోవాల్సిన ప్రభుత్వం, అధికారయంత్రాంగం అన్నదాతల వైపు కన్నెత్తైనా చూడటంలేదు.
• వ్యవసాయమంత్రి ఆర్భాటపు ప్రకటనలకే పరిమితయ్యారు.
• అసలే అప్పులపాలై దిక్కుతోచని స్థితిలోఉన్న రైతులనుంచి రూ.650కోట్ల నీటితీరువా వసూళ్లకు పాల్పడటం దుర్మార్గం.
– టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి
జగన్మోహన్ రెడ్డి అవలంభిస్తున్న రైతువ్యతిరేకవిధానాలు రాష్ట్ర రైతాంగానికిశాపంగా మారాయని, వాటిఫలితంగానే అన్నదాతల ఆత్మహత్యల్లో ఏపీ దేశంలోనే రెండోస్థానానికి చేరిందని, ఈఏడాది అకాలవర్షాలు, తెగుళ్లతో వాణిజ్యపంటలు దెబ్బతిన్నాయని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. గురువారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.ఆ వివరాలు ఆయన మాటల్లోనే …
గిట్టుబాటుధరలేక, తెగుళ్లు, పెరిగిన ఎరువులధరలతో రాష్ట్రరైతాంగం తీవ్రంగా నష్టపోయింది. జగన్మోహన్ రెడ్డి అసమర్థత, ఆయన అవలంభిస్తున్న రైతువ్యతిరేకవిధానాలు రైతులకు శాపంగా మారాయి. వైసీపీప్రభుత్వం సకాలంలో పంటలబీమా ప్రీమియం కట్టకపోవడంతో పంటలు దెబ్బతిన్న రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఆవిధంగా నిండామునిగిన రైతులను ఆదుకోవా ల్సిన ప్రభుత్వం వారిని మరింత దోచుకోవడానికి సిద్ధమవ్వడం, రూ650కోట్ల నీటితీరువా వసూళ్లకు పాల్పడటం దుర్మార్గం.
ఈ ఏడాది దాదాపు 40లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతింటే రైతులు రూ.20వేలకోట్లవరకు ఉత్పత్తులు నష్టపోయారు. జగన్మోహన్ రెడ్డి అవలంభిస్తున్న రైతువ్యతిరేకవిధానాలవల్లే అన్నదాతల ఆత్మహత్యల్లో రాష్ట్రానికి అగ్రస్థానం. రైతుఆత్మహత్యల్లో దేశంలోనే రాష్ట్రం మూడోస్థానంలో ఉంటే, కౌలురైతుల ఆత్మహత్యల్లో రెండోస్థానంలో ఉంది. రబీ సీజన్ లో గంటలతరబడి ఆధార్ కార్డులు పట్టుకొని రైతులు యూరియాకోసం ఎదురు చూస్తున్నారు.
రాష్ట్రంలోని 6 జిల్లాల్లో యూరియా లేక రైతులు అవస్థలు పడుతున్నారు. రైతుభరోసా కేంద్రాలు, రైతు సహాకారకేంద్రాల్లో ఆర్భాటం, అరుపులు తప్ప, ఎరువులు దొరకడంలేదు. క్షేత్రస్థాయి లో రైతులబాధ వర్ణనాతీతంగా ఉంటే, అధికారులేమో అంతా బాగు న్నట్లు కల్లబొల్లి మాటలు చెబుతున్నారు. వైసీపీనేతల సిఫార్సులు ఉన్నవారికి బస్తాలకు బస్తాలు యూరియా ఇస్తున్న అధికారులు, సామాన్యరైతులకు మాత్రం ఒకటి, రెండుబస్తాలకు మించి ఇవ్వడంలేదు. రాష్ట్రానికి రావాల్సిన 56వేలటన్నుల యూరియా రానందునే ఇప్పుడురైతులు ఇబ్బందులు పడుతున్నారు.
ప్రైవేట్ వ్యాపారులేమో రూ.2వేలవిలువైన కాంప్లెక్స్ ఎరు వులు కొంటేనే యూరియా ఇస్తామని షరతులుపెడుతున్నారు. కేంద్రప్రభుత్వసబ్సిడీతో కలిపి బస్తా యూరియాను రూ.266కు అమ్మాల్సిఉంటే, రూ.350, రూ.400కు అమ్ముతున్నా, అధికార యంత్రాంగం పట్టించుకోవడంలేదు. మొన్న ఖరీఫ్ నుంచి ఇప్పటి రబీ వరకు అన్నిరకాల కాంప్లెక్స్ ఎరువులధరలను వ్యాపారులు విపరీతంగా పెంచేశారు. ఒక్కో బస్తాకు రూ.400నుంచి, రూ.500 వరకు అధికంగా వసూలుచేస్తున్నారు. ఇంతజరుగుతున్నా వ్యవ సాయమంత్రి, ముఖ్యమంత్రి కార్యాలయం ఆర్భాటపు ప్రకటనలు ఇస్తున్నారు తప్ప, క్షేత్రస్థాయిలోకి వెళ్లి వాస్తవాలు పరిశీలించడం లేదు.
తక్షణమే ఈ ప్రభుత్వం రైతులనుంచి రూ.650కోట్ల నీటితీరువా వసూళ్లకు పాల్పడటాన్ని మానుకోవాలని, అన్నదాత లకు తక్కువధరలకే యూరియా, ఇతర కాంప్లెక్స్ ఎరువులు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.ధాన్యంకొనుగోళ్లు అరకొరగా జరిపిన ప్రభుత్వం, రైస్ మిల్లర్లు దళారులతో కుమ్మక్కై, ఇప్పుడు కొన్నధాన్యాన్ని రైతులకు తిరిగి ఇస్తామని చెప్పడం సిగ్గుచేటు.
ధాన్యం తక్కువధరకు అమ్ముకోవ డం ద్వారా ఒక్కోరైతు క్వింటాకు రూ.600వరకు నష్టపోయాడనేది బహిరంగసత్యం. ప్రభుత్వం నిర్వహిస్తున్నఈక్రాప్ నమోదు వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. 21రోజుల్లో ధాన్యంకొనుగోళ్ల తాలూ కా డబ్బులు ఇస్తామని చెప్పినప్రభుత్వం, 2నెలలు అయినా ఇప్పటికీ అనేకప్రాంతాల్లో రైతులకు చెల్లించలేదు.