Suryaa.co.in

Telangana

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్యే కవిత, భర్త అనిల్ పేరు

– హైదరాబాద్ లో కవిత మూడు ఆస్తులు కొనుగోలు
– కవిత తో పాటు భర్త అనిల్ కుమార్ పేరును ప్రస్తావించిన ఈడి
– కవిత కు ఫీనిక్స్ కు చెందిన శ్రీహరి సహకరించారన్నఈడి
– ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, వైసిపి ఎంపీ మాగుంట శ్రీనివాసులు అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ రెడ్డిపై ఈడీ అభియోగాలు
– మాగుంట శ్రీనివాస్ రెడ్డి, రాఘవపై కీలక అభియోగాలు మోపిన దర్యాప్తు సంస్థ
– కీలక ప్రాంతంలో వ్యాపారం కోసం మాగుంట పెద్ద ఎత్తున లాబీయింగ్

ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి ఈడీ అధికారులు తాజాగా మూడో ఛార్జ్ షీట్ ను దాఖలు చేశారు. ఈ ఛార్జ్ షీట్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అలాగే ఆయన భర్త అనిల్ పేర్లను చేర్చారు. ఈ మేరకు కవితపై కీలక అభియోగాలు మోపారు. ప్రముఖంగా సౌత్ గ్రూప్ కు సంబంధించిన కీలక విషయాలను ఈడీ ఈ ఛార్జ్ షీట్ లో పొందుపరిచింది. ఎమ్మెల్సీ కవిత ఆమె భర్తతో పాటు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, వైసిపి ఎంపీ మాగుంట శ్రీనివాసులు అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ రెడ్డిపై ఈడీ అభియోగాలు మోపింది.

తెరపైకి పలు కొత్త కీలక అంశాలు…
మద్యం వ్యాపారంతో పాటు ఆర్థిక లావాదేవీలకు సంబంధించి కీలక అభియోగాలు మోపిన ఈడి
మాగుంట శ్రీనివాస్ రెడ్డి, రాఘవ, కవిత, శరత్ చంద్రారెడ్డిలతో కూడిన సౌత్ గ్రూప్ 100 కోట్ల ముడుపులు హవాలా రూపంలోనే ఇచ్చారన్న దర్యాప్తు సంస్థ.ముడుపులు ఇచ్చి అనుకూలంగా మద్యం విధానం వుండేలా చూసుకుని హోల్ సేల్, రిటైల్ వ్యాపారంలో సౌత్ గ్రూప్ భారీగా లబ్ది పొందిందని దర్యాప్తు సంస్థ అభియోగాలు
హవాలా రూపంలో నగదు బదిలీ, ముడుపులు చెల్లింపుతో పాటు భూముల కొనుగోళ్ళ వ్యవహారాలను ప్రస్తావించిన ఈడి
ముఖ్యమైన వాట్సాప్, సిగ్నల్, ఈ మెయిల్, కాల్ డేటా, హోటల్ రికార్డ్స్ ను జత చేసిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు
అరుణ్ రామచంద్రన్ పిళ్ళై, బుచ్చిబాబు, మాగుంట రాఘవ తాజాగా వెల్లడించిన కీలక సమాచారాన్ని ఛార్జ్ షీటులో పొందుపరిచిన ఈడి అధికారులు
ఛార్జిషీటులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మనిష్ సిసోడియా, వైఎస్ ఆర్ సీపీ ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి, ఆయన కుమారుడు రాఘవ, బీఆర్ ఎస్ ఎంఎల్ సి కవితపై పలు కొత్త సంచలన అంశాలు
తాజా ఛార్జ్ షీటులో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ పేరును ప్రస్తావించిన ఈడి
ఢిల్లీ లిక్కర్ వ్యాపారంలో బినామీలతో మాగుంట శ్రీనివాస్ రెడ్డి, కవిత బిజినెస్ చేశారని ఆరోపణలు
ప్రేమ్ రాహుల్ మాగుంట బినామీ అని, అరుణ్ రామచంద్రన్ పిల్ళై కవితకు బినామీ అని పేర్కొన్న ఈడి
ఇండో స్పిరిట్ కంపెనీలో మాగుంట, కవిత ప్రతినిధులుగా ప్రేమ్ రాహుల్, అరుణ్ రామచంద్రన్ పిళ్ళై
ఇండో స్పిరిట్ కంపెనీలో తన తరఫున వాటాదారుడిగా అరుణ్ పిళ్ళైకు పెట్టుబడి డబ్బులను కవితనే సమకూర్చారని అభియోగాలు
ఢిల్లీ లిక్కర్ వ్యాపారంలో ఇండో స్పిరిట్ కంపెనీ దాదాపు 192 కోట్లు లాభాలు ఆర్జించిందన్న ఈడి
వచ్చిన లాభాలను వేరే చోట్ల ఇతర మార్గాల రూపంలో పెట్టబడులు పెట్టారన్న ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్
ముడుపులు ఇచ్చి అక్రమంగా లబ్ది పొందడం, అక్రమ లబ్ది ద్వారా ఆర్థిక వ్యవహారాలు చట్ట విరుద్ధమన్న దర్యాప్తు సంస్థ
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియాలతో కవితకు మధ్య ఒప్పందం కుదిరిందని అభియోగాలు
మాగుంట శ్రీనివాస్ రెడ్డి, కవిత పలుమార్లు సమావేశమై ఢిల్లీ లిక్కర్ బిజినెస్ గురించి చర్చించారన్న ఈడి
మాగుంట శ్రీనివాస్ రెడ్డి, రాఘవపై కీలక అభియోగాలు మోపిన దర్యాప్తు సంస్థ
ఢిల్లీ మద్య వ్యాపారంలో భారీగా బిజినెస్ చేసేందుకు మాగుంట శ్రీనివాస్ రెడ్డి ప్రయత్నాలు చేశారని ఛార్జ్ షీటులో పేర్కొన్న ఈడి
అరవింద్ కేజ్రీవాల్ తో మాగుంట శ్రీనివాస్ రెడ్డి పలుమార్లు భేటీ అయినట్లు వెల్లడించిన ఈడి
లిక్కర్ స్కామ్ నిందితులు, పాత్రధారాలు, సూత్రధారులతో మాగుంట శ్రీనివాస్ రెడ్డి నడిపిన వ్యవహారాలకు సంబంధించి కీలక ఆధారాలను ప్రస్తావించిన ఈడి
కీలక ప్రాంతంలో వ్యాపారం కోసం మాగుంట పెద్ద ఎత్తున లాబీయింగ్ చేశారని ఈడి అభియోగాలు
ఢిల్లీలోని మాగుంట అధికారిక నివాసం, హోటళ్ళు, ఇతర ప్రాంతాల్లో జరిగిన సమావేశాల ప్రస్తావన
కవితపై తాజాగా సంచలన అభియోగాలు మోపిన ఈడి అధికారులు
లిక్కర్ స్కామ్ లో ముడుపుల డబ్బులు కవిత ఇచ్చారని అభియోగాలు
ఢిల్లీ లిక్కర్ వ్యాపారంలో వచ్చిన లాభాలతో కవిత అరుణ్ పిళ్ళై ద్వారా హైదరాబాద్ లో భూములు కొన్నారని ఆరోపణలు
భూముల కొనుగోలుకు పిళ్ళై బ్యాంకు అకౌంట్ల ద్వారానే నగదు లావాదేవీలు జరిగాయన్న ఈడి
హైదరాబాద్ లో కవిత మూడు ఆస్తులు కొనుగోలు చేశారని ఆరోపణలు చేసిన ఈడి
తనకు వున్న రాజకీయ పలుకుబడి కారణంగా తక్కువ రేటుకు కవిత భూములు దక్కించుకున్నారని ఈడి అభియోగాలు
ఈడి ఛార్జిషీటులో కవిత తో పాటు భర్త అనిల్ కుమార్ పేరును ప్రస్తావించిన ఈడి
ఈడి ఛార్జిషీటులో హైదరాబాద్ కు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ ఫీనిక్స్ పేరు ప్రస్తావన
లిక్కర్ లాభాలతో భూములు కొనేందుకు కవిత కు ఫీనిక్స్ కు చెందిన శ్రీహరి సహకరించారన్నఈడి
భూముల కొనుగోలు సంబంధించిన విషయాలను పిళ్ళై, బుచ్చిబాబు లు తమ వాంగ్మూలాల్లో పేర్కొన్నారన్న ఈడి
ఈడి ఛార్జీషీటులో మాగుంట శ్రీనివాస్ రెడ్డి, రాఘవ, కవిత, శరత్ చంద్రారెడ్డి, అరుణ్ రామచంద్రన్ పిళ్ళై, బుచ్చిబాబు, అభిషేక్ బోయిన్ పల్లి తో పాటు పలువురు ఇతర తెలుగు వ్యక్తులు, సంస్థల ప్రస్తావన
కవిత భర్త ఆర్ అనిల్ కుమార్, కవిత సన్నిహితుడు శ్రుజన్ రెడ్డి, కవిత సన్నిహితుడు వి శ్రీనివాసరావు,ముత్తా గౌతమ్, ఫీనిక్స్ శ్రీహరి, తక్కళ్ళపల్లి లుపిన్ , బి వి నాగేశ్వర్ రావు , రవిశంకర్ చిట్టి, దండు రాజేష్ ,రవివర్మ రాజు, కెవిఎస్ పి రాజు, అనిల్ రాజు ,
సంస్థలు ఫీనిక్స్ గ్రూపు, ఎన్ గ్రోత్ క్యాపిటల్, క్రియేటివ్ డెవలపర్స్ , ఆంధ్ర ప్రభ పబ్లికేషన్స్, ఇండియా హెడ్
నిందితుల మధ్య జరిగిన లావాదేవీలకు సంబంధించిన వాట్సాప్ ఛాల్స్, ఈ మెయిల్స్ ను అభియోగ పత్రంలో జత చేసిన ఈడి అధికారులు
ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన రెండో అదనపు ఛార్జిషీటును పరిగణనలోకి తీసుకున్న రౌజ్ అవెన్యూ కోర్టు
వైఎస్ ఆర్ సీపీ ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి, ఆయన కుమారుడు రాఘవపై పై ఈడి సంచలన అభియోగాలు
ఛార్జిషీటులో మరోసారి బిఆర్ ఎస్ ఎంఎల్ సీ కవిత పేరు పలుమార్లు ప్రస్తావన
ఈ నెల ఆరున మాగుంట రాఘవ, ఆయన సంస్థలపై అభియోగపత్రం దాఖలు చేసిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్
ఢిల్లీ లిక్కర్ వ్యాపారం గురించి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాలతో పలుమార్లు సమావేశమైన మాగుంట శ్రీనివాస్ రెడ్డి
ఢిల్లీ లిక్కర్ వ్యాపారంలోకి మాగుంట రాకను స్వాగతించిన కేజ్రీవాల్
మద్యం విధానం రూపకల్పన, అమలు కు ముందు ,తరువాత పలుమార్లు విజయ్ నాయర్ తో కవిత సమావేశమయ్యారన్నఈడి
ఢిల్లీ లిక్కర్ హోల్ సేట్, రిటైల్ వ్యాపారం భారీ వాటా కోసం మాగుంట శ్రీనివాస్ రెడ్డి ప్రయత్నాలు చేశారన్న ఈడి
పైకి రాఘవ పేరు వున్నా అన్నీ వ్యవహారాలు తెరవెనుక నుండి నడిపింది మాగుంట శ్రీనివాస్ రెడ్డే
రిటైల్ జోన్స్ లో వ్యాపారంతో పాటు బినామీల పేరుతో హోల్ సేల్ బిజినెస్ లోనూ వాటా దక్కించుకున్న మాగుంట
సమీర్ మహేంద్రు ఇండో స్పిరిట్ గ్రూపు లో ప్రేమ్ రాహుల్ ద్వారా 32.5 వాటాదారుడు రాఘవ అన్న ఈడి
ఢిల్లీలోని మాగుటం శ్రీనివాస్ రెడ్డి నివాసంలో లిక్కర్ కుంభకోణం నిందితులు పలుమార్లు సమావేశమయ్యారు
హైదరాబాద్, ఢిల్లీ లోని పలు ప్రాంతాలు, హోటళ్ళలో జరిగిన సమావేశాల్లో మాగుంట శ్రీనివాస్ రెడ్డి, రాఘవ పాల్గొన్నారు
ఢిల్లీ లిక్కర్ వ్యాపారం గురించి మాగుంట శ్రీనివాస్ రెడ్డి, కవిత పలుమార్లు చర్చించినట్లు ఛార్జిషీటులో అభియోగాలు
మాగుంట అగ్రో ఫామ్మ్స్ పేరుతోనే కాకుండా పిక్చీ కంపెనీ పేరుతో ఎయిర్ పోర్టు జోన్ లో కూడా రాఘవ రిటైల్ వ్యాపారం చేశారు
ఫిక్చీ కంపెనీలో వై ఎస్ శశికళ ను ప్రధాన వాటాదారుగా చూపించిన రాఘవ
ఇండో స్పిరట్ కంపెనీలో రాఘవ తరఫున డమ్మీనని ప్రేమ్ రాహుల్ అంగీకరించార్న ఈడి

LEAVE A RESPONSE