Suryaa.co.in

Andhra Pradesh

ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్న నందమూరి రామకృష్ణ

రాష్ట్రంలో అరాచక పాలన పోయి.. ప్రజాస్వామ్య పాలన సాధించుకునేందుకు అమ్మ ఆశీస్సులు కావాలని నందమూరి తారకరామారావు గారి కుమారులు నందమూరి రామకృష్ణ ఆకాంక్షించారు. ఈ మేరకు విజయవాడ ఇంద్రకీలాద్రిపైనున్న దుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం వేద పండితుల ఆశీర్వాదాలు పొందారు. విభజన అనంతరం ఎంతో కష్టబడి పునాదుల నుండి నిర్మించుకుంటున్న రాష్ట్రాన్ని జగన్ రెడ్డి గెలిచాక సర్వ నాశనం చేశాడని అన్నారు. చంద్రబాబు పాలనలోనే రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమ బాటలో పరుగులు పెడుతుందన్నారు. జూన్ 4 తర్వాత మళ్లీ దర్శించుకుంటానని తెలిపారు. నందమూరి రామకృష్ణతో తెలుగుదేశం పార్టీ బీసీ సాధికార సమితి ప్రధాన కార్యదర్శి వీరంకి వెంకట గురుమూర్తి, వీరమాచినేని శివప్రసాద్, వల్లూరు కిరణ్ , తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE