– మాజీ మంత్రి దగ్గుబాటి, మోత్కుపల్లి, మంద కృష్ణ మాదిగ నివాళి
– సాయిబాబా అంతిమయాత్రలో పార్టీ కార్యకర్తల హాజరు
హైదరాబాద్: అఖిలభారత ఎన్టీఆర్ అభిమాన సంఘాల అధ్యక్షుడు, టీడీపీ సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు పిన్నమనేని సాయిబాబా అంతిమయాత్ర అభిమానులు, అనుచరుల అశ్రునయనాల నడుమ ఘనంగా జరిగింది. అంతిమయాత్రలో నందమూరి రామకృష్ణ స్వయంగా సాయిబాబా పాడె మోయటం విశేషం. ఎన్టీఆర్ కుటుంబానికి దివంగత సాయిబాబా అత్యంత విధేయుడన్న విషయం తెలిసిందే.
తొలుత బేగంపేటలోని సాయిబాబా నివాసానికి వెళ్లిన మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు, మోత్కుపల్లి నర్శింహులు దివంగత సాయిబాబా భౌతిక కాయానికి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారిద్దరూ ఎన్టీఆర్ జమానా నుంచి, సాయిబాబాతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. టీడీపీ చీలిపోయిన సందర్భంలో దగ్గుబాటి, మోత్కుపల్లితో కలసి సాయిబాబా కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే. నాడు నిర్వహించిన ఉద్యమంలో సాయిబాబా ఆగ్రభాగాన నిలిచి ఎన్టీఆర్ కోసం పోరాడారు.
నందమూరి రామకృష్ణ మాట్లాడుతూ.. నందమూరి కుటుంబానికి అత్యంత విధేయుడు, విశ్వాసపాత్రుడయిన సాయిబాబా మరణం తమ కుటుంబాన్ని కలచివేసిందని నివాళి అర్పించారు. ఎన్టీఆర్ అభిమానులకు, టీడీపీ కార్యకర్తలకు సాయి స్పూర్తిప్రదాత అని కొనియాడారు.
అనంతరం సాయిబాబా భౌతిక కాయాన్ని టీడీపీ నగర కార్యాలయంలో కార్యకర్తల సందర్శనార్ధం ఉంచారు. అక్కడ నుంచి అంబర్‌పేట వరకూ ఆయన అంతిమయాత్ర సాగింది. ఈ యాత్రలో వందలాది మంది కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు పాల్గొని సాయికి జోహార్లు అర్పించారు.
టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు బక్కని నర్శింహులు, అరవిందకుమార్ గౌడ్, క్రమశిక్షణ కమిటి సభ్యులు బంటు వెంకటేశ్వర్లు, శ్రీపతి సతీష్, శ్రీశైలం దేవస్థానం బోర్డు సభ్యులు కాశీనాథ్, ఏపి గ్రంధాలయ సంస్థ చైర్మన్ జి.కోటేశ్వర్ రావు, మాజీ మంత్రి కృష్ణ యాదవ్. ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ.
మండూరి సాంబశివరావు, నైషధం సత్యనారాయణమూర్తి , ఎం.ఎన్ శ్రీనివాస్, బి.ఎన్ రెడ్డి, జిగ్నేష్ జోషి, గ్రేటర్ హైదరాబాద్ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లెల కిశోర్, సంధ్య పోగు రాజశేఖర్, షేక్ ఆరిఫ్, అజ్మీర రాజు నాయక్, కట్ట రాములు, నల్లగండ్ల రాజు, జలమోని రవీందర్, అవ్వారు మోహన్ రావు, పలస బాలరాజ్ గౌడ్, పెద్దోజు రవీంద్ర చారి, చంద్రశేఖర్ గౌడ్, శ్రీపతి మహేందర్, అద్దంకి ఆనంద్, ఖాతా విజయ్ కుమార్, తడక వినోద్ కుమార్,చంద్రమోహన్, పద్మజ, జాన్సీ, ప్రమీల, శశిరేఖ, బివై శ్రీకాంత్, జగదీష్ గౌడ్, జోగిందర్ సింగ్, శక్తి ప్రేమ్, సుక్రవేది మరియు దివ్యాంగుల నాయకులు కొల్లి నాగేశ్వర్ రావు, రామ్ చందర్, శ్రీనివాస్ తదితరులు నివాళులు అర్పించారు.