చిన్నప్పటినుంచి కేశినేని నాని దుందుడుకు స్వభావం కలిగి ఉండేవారు . నాని విజయవాడ ఆంధ్ర లయోలా కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతుండగా ఎంతో పేరు ప్రఖ్యాతలు కలిగిన ఒక ప్రొఫెసర్ పై దురుసు ప్రవర్తన అప్పట్లో పెద్ద సంచలనమే అయ్యింది. నాని ఇంటర్మీడియట్ మధ్యలోనే చదువుకు స్వస్తి చెప్పేశారు. కేశినేని చిన్ని తమిళనాడు AMACE అరుళ్మిగు మీనాక్షి అమ్మన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ . కాంచీపురం నందు మెకానికల్ విభాగంలో ఇంజనీరింగ్ పట్టభద్రులు అయ్యారు .
చదువు పూర్తయ్యాక అమెరికా వెళ్లి స్థిరపడాలా కుటుంబ వ్యాపారం చూసుకోవాలా అనే మీమాంసలో చిన్ని అమెరికా ఆలోచనకు స్వస్థ చెప్పి కుటుంబ వ్యాపారం కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్నారు . కేశినేని బ్రదర్స్ వ్యాపారాన్ని కొత్త పుంతలు తొక్కించారు .
వ్యాపార విజయ రహస్యాన్ని అన్నదమ్ములు ఒడిసి పట్టుకున్నారు. ఇద్దరూ కలిసి పనిచేసినప్పుడు వీరి రంగంలో వీరికి వీరే సాటి. కుటుంబం ఉమ్మడిగా కలిసి ఉన్నప్పుడే కేశినేని నాని దంపతులు రత్నాలాంటి ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చారు. పెద్ద పాప హైమా, చిన్న పాప శ్వేత.
శ్వేతకు బాబాయ్ చిన్ని, చిన్నమ్మ జానకి అంటే ప్రాణం. దానికి ప్రధాన కారణం కేశినేని జానకి శ్వేతను తనకు పుట్టిన బిడ్డ గాని భావించేవారు. ఆ ప్రేమ ఎంతలా అంటే చిన్ని దంపతులకు మొదటి సంతానంగా వెంకట్ చౌదరి జన్మించారు. రెండో సంతానం ఆడపిల్ల స్నిగ్ధ చౌదరిని వద్దు అనుకునే అంత స్థాయిలో..! శ్వేత ఉండగా మనకు ఆడపిల్ల ఎందుకు అని జానకి దంపతులు అన్నారంటే ..! కూతురు శ్వేతపై జానకిది అంతులేని అమ్మ ప్రేమ .
శ్వేత తన తల్లిదండ్రుల కంటే ఎక్కువ చనువుగా బాబాయ్ చిన్నమ్మతోనే ఉండేది అని వారి కుటుంబ సన్నిహితులు చెబుతారు.ఉమ్మడి కుటుంబంలో శ్వేత పడకగది చిన్నమ్మ జానకి తోనే. అన్నదమ్ముల మధ్య మనస్పర్ధలు వచ్చి రెండు కుటుంబాల మధ్య మాటలు లేని సమయంలో శ్వేత స్కూలు నుంచి తన తల్లిదండ్రులకు తెలియకుండా చిన్నమ్మ జానకి వద్దకు తరచూ వచ్చి వెళుతూ ఉండేవారు.
కేశినేని బ్రదర్స్ ఉమ్మడి వ్యాపారం నుండి విడిపోదాం అనుకున్నప్పుడు నాని చిన్నితో నీకు వ్యాపారం కావాలా?లేదా నాకు వదిలేసి డబ్బు తీసుకుంటావా ? అంటే తాత వెంకయ్య తర్వాత కుటుంబ పెద్దగా అన్న సంస్థ కోసం కృషి చేశారు.కుటుంబ లెగసి కేశినేని బ్రాండ్ అన్నకే వదిలిపెట్టటం అన్నకు గౌరవం ఇచ్చినట్లు అవుతుంది అని భావించి వ్యాపార ఎదుగుదలలో తన పాత్ర ఉన్నప్పటికీ వైదొలగటానికి మొగ్గు చూపారు చిన్ని .
నాడు ఒక కోటి రూపాయలు చిన్నికి ఇచ్చే ఒప్పందం జరిగింది ఆ తరువాత ఆ కోటి చిన్నికి చేరటానికి పలుమార్లు ఇబ్బందికర పరిస్థితులు తలెత్తయి అని సన్నిహితులు చెబుతుంటారు.ఆ తరువాత కొంతకాలానికి తెలుగుదేశం క్రియాశీలక రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్న కేశినేని నాని.ఎన్నికల్లో అన్న విజయానికి తమ్ముడు కృషి చేశారు. సహజంగా అన్నదమ్ముల మధ్య గొడవలు ఆస్తుల దగ్గర వస్తుంటాయి . కేశినేని బ్రదర్స్ వివాదం ఆస్తులు కారణం కానేకాదు. ఆస్తులు పంపకం అయిపోయాక ఇరువురి మధ్య సన్నిహిత సంబంధాలు కొనసాగాయి.
నాని మనిషి మంచివారే అని పలువురు సన్నిహితులు చెబుతూ ఉంటారు. బంధువులు మాత్రం అయినవారికి ఆకుల్లో పరాయి వారికి కంచాల్లో వడ్డిస్తారు అని వ్యాఖ్యానిస్తూ ఉంటారు. చిన్ని అంటే నానికి అసూయ , ఈర్ష , ఈర్ష నుంచి పగ పుట్టింది అని బంధువు ఒకరు వ్యాఖ్యానించారు. చిన్ని ఎదుగుదలను నాని ఓర్వలేని తనమే అన్ని అనర్థాలకు కారణం అని మరొకరు వ్యాఖ్యానించారు.
చిన్ని తెలివైనవారు, చురుకైన వారు నలుగురితో చిన్ని మంచివాడు అనిపించుకోవటం నానికి నచ్చదని చిన్నిని ఎవరైనా పొగిడితే నాని తట్టుకోలేరని కుటుంబ సన్నిహితులు వ్యాఖ్యానించారు. నాని పెద్ద కుమార్తె హైమ వివాహం నాడు పూజారి తాంబూలం అందుకోవడం కోసం వేదిక మీదకు రక్తసంబంధీకులను పిలవగా చిన్ని దంపతులు వేదిక పైకి రావడానికి కుర్చీలోంచి లెగుస్తుండగా చిన్నిని వేదిక మీదకు రావద్దు అని పరాయి వ్యక్తితో చెప్పించడం చిన్నిని అత్యంత కలత పెట్టించిన అంశం .
నాటి కార్యక్రమంలో రక్త సంబంధం కంటే నానికి ఉపయోగపడతారనే వారికే స్థానం దక్కిందని అని బంధువు ఒకరు వ్యాఖ్యానించారు. గోదావరి జిల్లాల నుంచి కృష్ణ , గుంటూరు , ఖమ్మం , హైదరాబాద్ నుంచి హాజరైన అతిధుల మధ్య చిన్నికి జరిగిన ఘోర అవమానంగా బంధువులు వ్యాఖ్యానిస్తూ ఉంటారు . అంత జరిగినా శ్వేతపై బాబాయి ప్రేమ ఇసుమంతైన తగ్గలేదు.
విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ అభ్యర్థిగా కేశినేని శ్వేత ఎన్నికల బరిలో నిలబడ్డారు శ్వేత తన బాబాయ్ చిన్నికి ఫోన్ చేశారు బాబాయ్ నువ్వు నా సెంటిమెంట్ నేను నామినేషన్ వేసేటప్పుడు నువ్వు నా ప్రక్కన నిలబడాలని కూతురు శ్వేత కోరింది ఆ ఒక్క ఫోన్ కాల్ గతంలో చిన్ని అనుభవించిన అవమానాలు అన్ని మరిచిపోయి పట్టరాని సంతోషంతో హైదరాబాదు నుంచి విజయవాడకు వచ్చి శ్వేత కోరినట్టే నామినేషన్ ఘట్టంలో చిన్ని పాల్గొన్నారు .
నా కూతురు ఎన్నికల్లో నిలబడింది ఖర్చు అంతా నేనే భరిస్తాను అంతేకాదు తను మేయర్ అవ్వటానికి TDP అభ్యర్థుల ఖర్చు కూడా నేనే భరిస్తాను అని స్నేహితుల వద్ద చిన్ని వ్యాఖ్యానించారు. కుటుంబ సభ్యులందరూ భయపడే సింహం నానికి విషయం తెలిసింది.వాడిని ఎవరు రమ్మన్నారు ?ఎందుకొచ్చాడు ?తక్షణం విజయవాడ నుంచి వెళ్ళిపోమని చెప్పండి. అని నాని హుకుం జారీ చేశారు.
నాని పెద్ద కుమార్తె హైమ బాబాయ్ చిన్నికి ఫోన్ చేసి బాబాయ్ మీరు ఇన్వాల్వ్ అవ్వటం నాన్నకు ఇష్టం లేదు , మీరు వెళ్లిపోండి గొడవలు వద్దు అని చెబితే అంతులేని వేదంతో మారుమారు మాట మాట్లాడకుండా హైదరాబాద్ పయనం అయ్యారు . ఆ తర్వాత కొంతకాలానికి శ్వేత వివాహం జరిగింది కనీసం నాని ఇంటి నుంచి ఒక్క ఫోన్ కాల్ ఆహ్వానం కూడా చిన్ని కుటుంబానికి అందలేదు.
కేశినేని చిన్ని శ్రీమతి జానకి ప్రయాణించే కారుకు ఎంపీ స్టిక్కర్ ఉందని తన స్టిక్కర్ ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు ఫలానా నెంబర్ కారుకు అంటించుకుని దుర్వినియోగం చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసి , ఎఫ్ఐఆర్ కట్టించారు నాని. హైదరాబాద్ పోలీసులపై ఒత్తిడి కూడా తెచ్చారు. జానకి ప్రయాణిస్తున్న కారును తెలంగాణ పోలీసులు అడ్డుకున్నారు. తీరా చూస్తే అది కేశినేని నాని ఎంపీ స్టిక్కర్ కాదు.నేటి తెలంగాణ ముఖ్యమంత్రి నాటి ఎంపీ రేవంత్ రెడ్డి స్టిక్కర్ కావటం గమనార్హం. రేవంత్ రెడ్డి , చిన్ని సన్నిహితులు కారణంగా ఆ ఎంపీ స్టిక్కర్ కదా ముగిసింది .
ఈ సంఘటన చిన్నిలో వేదనతోపాటు కోపాన్ని పెంచింది అని సన్నిహితులు చెబుతారు . చిన్ని పడి లేచిన కెరటం . రెండుసార్లు పూర్తిగా దెబ్బతిని ఆర్థిక కష్టాలు విలయతాండవం చేసినా.. నాని నుండి గాని ఇతర బంధువుల నుండి గాని ఎటువంటి సాయం అందలేదు . తనను నమ్మిన తన స్నేహితుల తోడ్పాటుతో వ్యాపారంలో అద్భుత ప్రగతి సాధించారు కేసినేని చిన్ని. నాడు కేశినేని వెంకయ్య నుండి స్ఫూర్తి పొంది విజయవాడ పార్లమెంట్ పరిధిలో పలు సేవా కార్యక్రమాలకి కేశినేని చిన్ని శ్రీకారం చుట్టారు.
తెలుగుదేశం పార్టీ విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిగా రెండుసార్లు కేశినేని నానికి అవకాశం కల్పించింది . రెండుసార్లు చంద్రబాబుతో నాని చెప్పిన విధంగా పార్లమెంటు పరిధిలో తెలుగుదేశం అభ్యర్థులకు చేయాల్సిన ఆర్థిక సాయం చేస్తానన్నది చేయకపోవడం పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టింది . టిడిపి అధిష్ణానంతో అత్యంత సన్నిహితంగా ఉండే ఒకరు ఇలా వ్యాఖ్యనించారు.
కేశినేని నాని రాష్ట్రంలో అందరికంటే అదృష్టవంతులు పైసా ఖర్చు లేకుండా రెండు సార్లు పార్లమెంట్ సభ్యలు అయ్యారన్నారు . నాటి నాని రుణాన్ని నేడు TDP పార్టీకి కేశినేని చిన్ని చక్ర వడ్డీతో తీరుస్తున్నారు అని మరొకరు వ్యాఖ్యానించారు. టిడిపి అధిష్టానం నాని పై గుర్రుగా ఉండటానికి ప్రధాన కారణం నాని నోటి దురుసు మాత్రమే కారణం . పలు ప్రైవేటు సంభాషణలో అకారణంగా అధిష్టానాన్ని బండబూతులు తిట్టటం పార్టీ అధినాయకుల్ని ఆశ్చర్యానికి గురిచేసింది .
ముక్కుసూటితనం అనే లక్షణం ముసుగులో బరితెగించి వ్యాఖ్యలు చేసేవారు అని , ఒక వ్యక్తి ఆ వ్యాఖ్యలు రహస్యంగా రికార్డు చేసి టిడిపి అధిష్టానానికి పంపించారని అప్పట్లో వార్తలు వచ్చాయి. వైసిపి MLAలను పొగడటం ! వారితో కార్యక్రమాలు నిర్వహించడం, వల్లభనేని వంశీతో అత్యంత సన్నిహితంగా మెలగడం టిడిపి అధిష్టానానికి మింగుడు పడని అంశం .
అయినప్పటికి కేశినేని శ్వేతకు స్వయంగా లోకేష్ హామీ ఇచ్చారు నేను నీకు అన్నను నీ భవిష్యత్తు నాకు వదిలిపెట్టు నిన్ను ఉన్నత స్థానంలో కూర్చో పెట్టే బాధ్యత నాది అని స్వయంగా లోకేష్ శ్వేతకు హామి ఇచ్చిన మాట నిజమేనని నాని కుటుంబ సన్నిహితులు తెలియజేసారు. కేశినేని శ్వేత రాజకీయ జీవితం తండ్రి నాని స్వయంగా కాలరాస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు.
తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి విధేయుడుగా ఉండటమే నాకు తెలిసిన దేశభక్తి అని నిత్యం నినదించే గళం కేసినేని చిన్ని అని సన్నిహితులు చెబుతున్నారు .
-శుభాకర్ మేడసాని
జర్నలిస్ట్