• దళిత నాయకుడిని, నియోజకవర్గ ఇన్ ఛార్జ్ ను అనే గౌరవం లేకుండా, తన మాట వినలేదన్న అక్కసుతో దూషించాడు
• ప్రోటోకాల్ పాటించలేదంటున్న నానీ, నా విషయంలో ఎన్నిసార్లు ప్రోటోకాల్ పాటించాడు?
• జగన్ పచ్చి నెత్తురు తాగే దుర్మార్గుడు అన్న నానీ, నేడు అదే వ్యక్తితో చేతులుకలిపి తానేమిటో నిరూపించుకున్నాడు
– తిరువూరు టీడీపీ ఇన్ ఛార్జ్ శావల దేవదత్
తిరువూరులో జరిగిన రా..కదిలిరా బహిరంగసభను అప్రతిష్ఠ పాలుచేసి, తెలుగుదేశానికి.. చంద్రబాబునాయుడికి చెడ్డపేరు తీసుకురావాలన్న దురుద్దేశంతోనే కేశినేని నాని, సభానిర్వహణకోసం టీడీపీ ముందస్తుగా నిర్ణయించిన సన్నాహక సమావేశంలో తనఅనుచరులతో వీరంగం వేశారని, ఆయన చర్యతో టీడీపీ-జనసేన పార్టీల పరువు, ప్రతిష్టలు మంటగలిశాయని తిరువూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ ఛార్జ్ శావల దేవదత్ చెప్పారు.
మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే…
” తిరువూరులో 7వ తేదీన జరిగిన రా…కదలిరా బహిరంగసభ నిర్వహణ కోసం 3వ తేదీన నిర్వహించిన పార్టీ సమావేశానికి ఎన్టీఆర్ జిల్లా పార్టీ అధ్యక్షులు నెట్టెం రఘురామ్ ఎంపీ హోదాలో కేశినేని నానీని ఆహ్వానించారు. సభ సజావుగా జరగకూడదన్న దురుద్దేశంతో ఉన్ననానీ, సమావేశాన్ని దురాలోచనతో, ముందస్తు ప్రణాళికతో అడ్డుకునే ప్రయత్నం చేశాడు. వైసీపీ శక్తులతో చేతులు కలిపి పథకం ప్రకారం సమావేశానికి అంతరాయం కలిగించారు.
తన అభిమానుల్ని రెచ్చగొట్టి ప్లెక్సీల ముద్రణలో ప్రోటోకాల్ పాటించలేదని, తన ఫోటోసరిగాలేదని చెప్పి, వాటిని చించే యించారు. నాతో సహా, నాయకులంతా పార్టీ నిర్ణయాలకు కట్టుబడ్డామన్న అక్కసుతోనే నానీ తిరువూరు నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలోలో వీరంగం వేశారు. తాను ఆయనకు ఎంత నచ్చచెప్పడానికి ప్రయత్నించినా వినిపించుకోలేదు. నన్ను ఏకవచనంతో సంబోధిస్తూ తూలనాడాడు. ఎంపీగా ఉండి వీధి రౌడీలా ప్రవర్తించిన నానీ తీరు దారుణాతి దారుణం. గతంలో నందిగామలో కూడా నానీ అలానే ప్రవర్తించారు.
దళిత నాయకుడిని, నియోజకవర్గ ఇన్ ఛార్జ్ అయిన నా విషయంలో నానీ ఎన్నిసార్లు ప్రోటోకాల్ పాటించారు
తిరువూరు నియోజకవర్గ కార్యాలయంలో నానీ , ఆయన అనుచరులు చేసింది మొత్తం సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. దళితుడినైన నాకు కనీస గౌరవం మర్యాద ఇవ్వకుండా నానీ నన్ను ఏకవచనంతో సంబోధించడం నిజం కాదా? తన విషయంలో ప్రోటోకాల్ పాటించలేదంటున్న నానీ, తిరువూరు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ అయిన నా విషయంలో ఎన్నిసార్లు ప్రోటోకాల్ పాటించాడో, కార్యక్రమాలు, బహిరంగసభల్లో నాకు ఎంత ప్రాథాన్యత ఇచ్చారో చెప్పాలి. తిరువూరు ఇన్ ఛార్జ్ గా నన్ను ప్రతిపాదించింది నానీనే. అలాంటి వ్యక్తి ఒక గ్రామ రాజకీయాల్లో తాను ఆశించింది నేను చేయలేదన్న అక్కసుతోనే నాపై ఆయన కక్ష పెంచుకున్నారు.
చంద్రబాబు దళితుల్ని ఎంత అభిమానిస్తున్నారో, ఎంతగా గౌరవిస్తున్నారో చూస్తూ కూడా నానీ దళిత నాయకుడినైన నాపై దురుసుగా వ్యవహరించడం సబబేనా? ఉన్నత చదువులు చదివి, రక్షణశాఖలోపనిచేసి, 17ఏళ్లపాటు వివిధ దేశాల్లో పనిచేసిన నాలాంటి వారు రాజకీయాల్లోకి రాకూడదు…మాట్లాడకూడదు అన్నట్టుగా నానీ దురుసుగా ప్రవర్తించారు. దళితులంటే నానీకి ఎందుకంత చిన్నచూపు? నానీ లాంటి వ్యక్తి కావాలని పార్టీకి చెడ్డపేరు తీసుకువస్తుంటే ఎన్నాళ్లు చూడాలి? పార్టీకి నష్టం జరుగుతుంది, చంద్రబాబునాయుడికి చెడ్డపేరు వస్తుందనే నానీ నాకు, నా అనుచరులకు చేసిన అవమానాల్ని భరించాను.
రెండేళ్ల నుంచే టీడీపీని వీడాలన్న ఆలోచనల్లో నానీ ఉన్నాడు. ఆ క్రమంలోనే టీడీపీ కార్యక్రమాలు సజావుగా జరక్కుండా అడ్డుకున్నాడు. ఆఖరికి చంద్రబాబు పాల్గొన్నబహిరంగసభలో కూడా అవాంతరాలు సృష్టించాడు. పచ్చినెత్తురు తాగే జగన్ అని అన్న నానీ, నేడు అదే వ్యక్తితో చేతులు కలిపి తానేమిటో నిరూపించుకున్నాడు. నానీ వ్యవహారశైలి శ్రుతిమిం చబట్టే తాను బయటకొచ్చి మీడియాతో మాట్లాడాల్సి వచ్చింది.
తనకు టీడీపీ టిక్కెట్ ఇవ్వరన్న అభద్రతాభావంతోనే నానీ వైసీపీలోకి వెళ్లాడు
తెలుగుదేశం పార్టీపై బురదజల్లి, చంద్రబాబుని దుర్భాషలాడాలని నానీ రెండేళ్లనుంచి చూస్తున్నాడు. ఆయన అనుకున్న ది చేయడానికి తిరువూరు సభను. సభనిర్వహణకోసం నిర్వహించిన సమావేశాన్ని వాడుకున్నాడు. తాను విజయవాడ కు కాపలాదారుడినని గతంలోప్రకటించి నానీ, నేడు దొంగలపార్టీలో ఎలా చేరాడో ప్రజలకు చెప్పాలి. అనేక కేసుల్లో జగన్ ముద్దాయని, ఆయన జగన్నాటకాలు ఆడుతున్నాడని మాట్లాడింది నిజం కాదా? చంద్రబాబునాయడు ఏ సందర్భంలో అయినా, ఎక్కడైనా నానీని అగౌరవపరిచింది లేదు. తనకు టిక్కెట్ ఇవ్వరేమో అన్న అభద్రతాభావంతో నానీ ముందుగా అవకాశవాదంతో వైసీపీతో సంప్రదించి, ఎంపీ టిక్కెట్ ఆశించే జగన్ రెడ్డి పక్కన చేరాడు.
కేశినేని నానీతో పాటు తామెవరం ఆయన వెంట వైసీపీలోకి వెళ్లమని టీడీపీ నేతలు, కార్యకర్తలు స్పష్టంగా చెబుతున్నారు. పార్టీ జెండా తీసేస్తే నానీ విలువేంటి అనేది ఇప్పటికే ఆయనకు అర్థమై ఉండాలి. దళిత నాయకుడైన స్వామిదాస్ కు టీడీపీ ఏం అన్యాయం చేసింది? 25 ఏళ్లుగా స్వామిదాస్ తిరువూరు నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహించారు. 5సార్లు ఎమ్మ్లెల్యేగా పోటిచేసిన స్వామిదాస్ రెండుసార్లు టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు.
కొత్తవారికి అవకాశమిస్తే నియోజకవర్గంలో టీడీపీ గెలిచే అవకాశముందని భావించి పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని స్వామిదాస్ కాదనడం ఎంతమాత్రం సరైంది కాదు. టీడీపీని, చంద్రబాబును ఉద్దేశించి స్వామిదాస్ చెప్పేవన్నీ అసత్యాలు.. అబద్ధాలే. ఎన్టీఆర్ జిల్లా టీడీపీశ్రేణులు, కార్యకర్తలు నానీ ప్రవర్తనను, వ్యాఖ్యల్ని నిశితంగా గమనిస్తున్నారు. సరైన సమయంలో నానీకి, స్వామిదాస్ కు తగిన బుద్ధిచెబుతారు.” అని దేవదత్ హెచ్చరించారు.