Suryaa.co.in

Andhra Pradesh

జగన్ రెడ్డి కొవ్వు కరిగించాల్సిన బాధ్యత ప్రజలదే

-జగన్ రెడ్డి బలుపు అణిచేందుకు ప్రజలు సిద్ధం
-తమ్మినేని నియోజకవర్గం మొత్తాన్ని ఊడ్చేశాడు
-ఉద్యోగుల బదిలీలకు రేట్ ఫిక్స్ చేశాడు
-నాగావళి, వంశధార నదుల్లోని ఇసుక మొత్తం ఊడ్చేస్తున్నాడు
-గంజాయి, డ్రగ్స్ జగన్ రెడ్డి బ్రాండ్.. ఐటీ, డీఎస్సీ, ఏపీపీఎస్సీ ఉద్యోగాలు నా బ్రాండ్
-రాష్ట్రాన్ని తిరిగి నిలబెట్టాలనే లక్ష్యంతోనే కూటమిగా వస్తున్నాం
-మద్య నిషేధం పేరుతో ఓట్లేయించుకుని మద్యం వ్యాపారం మొదలు పెట్టాడు
-19 రోజులు కూటమి కోసం పని చేయండి.. మీ భవిష్యత్తుకు నాదీ గ్యారెంటీ
-9 గ్యారెంటీలతో రాష్ట్రాభివృద్ధికి ప్రణాళికలు రూపొందించా
-వంశధార నుండి పెన్నా వరకు అనుసంధానించి ప్రతి ఎకరాకు నీరిస్తా
-బిర్యానీ.. క్వార్టర్ బాటిల్.. నోటు ఇచ్చినా జగన్ సభలకు జనం లేరు
-బుల్లెట్ కూన దెబ్బకు స్లీపింగ్ సీతారాం పని అయిపోయిది
-ఆముదాలవలస బుల్లెట్ కూన రవిని, ఉత్తరాంద్ర ముద్దుబిడ్డ రాముని మరోసారి గెలిపించుకోండి
-ఆముదాలవలస ప్రజాగళం సభలో నారా చంద్రబాబు నాయుడు

ఆముదాలవలస : కనుచూపు మేరలో కిక్కిరిసిన జనాన్ని చూస్తుంటే రేపు ఎన్నికల్లో తమ్మినేనికి చూపించబోయే సినిమా ఇక్కడే కనిపిస్తోంది. ప్రజాగళానికి ఆముదాలవలస కదిలొచ్చింది. యుద్ధానికి సిద్ధమా అని అడుగుతున్నా. ఇక్కడి డమ్మాబుష్ నేత పని అయిపోయింది. ఈ తమ్మినేని ఎన్ని డ్రామాలాడుతాడో ఆడనీ. ఇంకా 19 రోజులే. మనం కొట్టే దెబ్బకు, ప్రజా తీర్పుకు ఒడిశాకు పారిపోవడం తధ్యం. ఎక్కడకు పోయినా పట్టుకొస్తా. చేసిన పాపాలు, తప్పులకు ప్రజా కోర్టులో శిక్షించడం తధ్యం. ఇలాంటి వ్యక్తి స్పీకర్‌గా ఉండే అర్హత ఉందా? ముఖ్యమంత్రి చెప్పే పనులకు గంగిరెద్దులా తలూపడం తప్ప చేసిందేమైనా ఉందా?

సైకో మాటలకు తలూపి స్పీకర్ స్థానాన్ని అప్రతిష్టపాలు చేశాడు. తమ్మినేని నియోజకవర్గం మొత్తాన్ని ఊడ్చేశాడు. ఏ పని చేయాలన్నా వారి ఇంట్లో వారికి బంగారు కానుకలు సమర్పించాల్సిందే. నాగావళి, వంశధార నదుల్లోని ఇసుక మొత్తం ఊడ్చేస్తున్నాడు. ఇక్కడి వారికి ఇసుక దొరకదు. కానీ కావాల్సినంత విశాఖకు తరలిస్తున్నాడు. ఉద్యోగుల బదిలీలకు రేట్ ఫిక్స్ చేశాడు. చెప్పేవన్నీ నీతులు.. చేసేవన్నీ బూతులు. ఇలాంటి దుర్మార్గ, నీచ నాయకుడిని ఎప్పుడూ చూడలేదు.

రాష్ట్రంలో 40 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్నాను. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా, 15 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాను. కానీ, ఇలాంటి పనికిమాలిన దద్దమ్మ ముఖ్యమంత్రిని ఎప్పుడూ చూడలేదు. అవినీతి తప్ప అభివృద్ధి చేతకాని పాలన ఇప్పుడే చూశాను. ఆముదాలవలస బుల్లెట్ మన కూన రవికుమార్. అతనికి ప్రజల్లో ఉన్న స్పందన ఇక్కడకు వచ్చిన జనాన్ని చూస్తేనే అర్ధమైపోయింది. ప్రజలు ఎంత కసిగా ఉన్నారంటే.. ఎప్పుడు ఎన్నికలొస్తాయా.. కసి తీర్చుకుందామా అని ఎదురు చూస్తున్నట్లుంది మిమ్మల్ని చూస్తుంటే. సైకో బస్సు వేసుకుని వస్తున్నాడు. ధైర్యం ఉంటే.. ఆముదాలవలసలో నాలా ఇలాంటి ఒక సభ పెట్టు. ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పు. అప్పుడు ఓట్లు అడుగు.

బిర్యానీ పెట్టి, హాఫ్ బాటిల్ ఇచ్చి, రూ.500 ఇచ్చి జనాన్ని తెచ్చుకుంటే ఓట్లు పడవని తెలుసుకోవాలి. ఈ సైకో ఉత్తరాంధ్రకు ఏం చేశాడని ఇక్కడకు వస్తున్నాడో సమాధానం చెప్పాలి. ఒక్క ఎకరాకు నీరిచ్చాడా? ఒక్క గ్రామానికి తాగునీరిచ్చాడా? మహేంద్రతనయ ఆఫ్ షోర్ ప్రాజెక్టుకు రూ.550 కోట్లు ఇచ్చి సగానికి పైగా పనులు పూర్తి చేస్తే.. జగన్ రెడ్డి రూపాయి ఖర్చు చేయకుండా ఎక్కడి గొంగలి అక్కడే అన్నట్లు తయారు చేశాడు.

టీడీపీ మళ్లీ అధికారంలోకి వచ్చి ఉంటే వంశధార నాగావళి అనుసంధానం పూర్తయ్యేది. ఆముదాలవలసలో ప్రతి ఎకరానికి నీరిచ్చే అవకాశం ఉండేది. గతంలో ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టులపై రూ.2000 కోట్లకు పైగా ఖర్చు చేశాను. మిస్టర్ జగన్ రెడ్డీ.. ఉత్తరాంధ్ర ప్రాజెక్టులపై ఎంత ఖర్చు చేశావో సమాధానం చెప్పు. ఒక్క రోడ్డేశావా? ఒక్క పరిశ్రమ తెచ్చావా? ఒక్క కాలేజీ పెట్టావా? బటన్ నొక్కి రూ.10 ఇచ్చి రూ.100 నొక్కేస్తున్న దొంగ, గజదొంగ ఈ జగన్ రెడ్డి.

జగన్ రెడ్డి అరాచకం ఏ స్థాయిలో ఉందంటే.. గుంటూరుకు చెందిన కోవూరు లక్ష్మి అనే మహిళ మహిళలపై జరుగుతున్న అరాచకాలపై పోరాడింది. ప్రధాని, రాష్ట్రపతి, సుప్రీంకోర్టు జడ్జిని కలిసేందుకు ఢిల్లీ వెళ్లినా ఫలితం లేకపోవడంతో బొటనవేలు నరుక్కుని నిరసన తెలిపింది. నా బొటన వేలు పోయినా బాధపడలేదు. కానీ, నా ఆడబిడ్డలకు జరిగిన అన్యాయంపై ఇంకా ఆవేదన చెందుతోంది. ఇలాంటి పాలకులు మళ్లీ అధికారంలోకి వస్తే.. మన ధన మాన ప్రాణాలకు రక్షణ ఉంటుందా? బయటకు రాగలమా? ఒక విధ్వంసకారుడు, ఒక అహంకారి, ఒక సైకోని కలిపితే జగన్ రెడ్డి.

పవన్ కళ్యాణ్ గురించి జగన్ రెడ్డి ఏదేదో వాగుతున్నాడు. నెత్తిన రూపాయి పెడితే దమ్మిడీకి కూడా అమ్ముడుపోని వ్యక్తి జగన్ రెడ్డి. ఒళ్లంతా కొవ్వెక్కిపోయిన జగన్ రెడ్డి కొవ్వు కరిగించాల్సిన బాధ్యత ప్రజలంతా తీసుకోవాలి. జగన్ రెడ్డి బలుపు మొత్తాన్ని తీర్చే బాధ్యత ప్రజలు తీసుకోవాలి. ఒక్క ఛాన్స్ అన్నాడు. ముద్దులు పెట్టాడు. నెత్తిన చెయ్యి పెట్టాడు. అధికారంలోకి వచ్చిన రోజు నుండి పిడిగుద్దులు గుద్దుతున్నాడు. ప్రతి ఒక్కరి జీవితాలను చిధిమేశాడు.

కూటమి నాయకులంతా కలిసి వస్తున్నది ప్రజల కోసం. రాష్ట్ర భవిష్యత్తు కోసం. యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడం కోసం. ఆడబిడ్డలకు రక్షణ కల్పించడం కోసం. ప్రజలు గెలవాలి. రాష్ట్రం నిలదొక్కుకోవాలనే లక్ష్యంతో కలిసి వచ్చాం. ఐదేళ్లలో 13 లక్షల కోట్లు అప్పు చేసిన దుర్మార్గుడు ఈ జగన్ రెడ్డి. నేను రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేశానో హైదరాబాద్‌ని చూస్తే అర్ధమవుతుంది. ఈ రోజు హైదరాబాద్ ఈ స్థాయిలో నిలబెట్టిందెవరు? అదే విధానంతో అమరావతి నిర్మాణంతో ఉద్యోగాలు, ఉపాధి, ఆదాయం సృష్టించాలనుకున్నాను. పోలవరంతో వ్యవసాయాన్ని పండగ చేయాలనుకున్నాను. దేశంలో ఎక్కువ రైతు అప్పులున్న రాష్ట్రాల్లో ఏపీ అగ్రస్థానం, రైతు ఆత్మహత్యలు, కౌలు రైతుల ఆత్మహత్యల్లోనూ తొలి మూడు స్థానాల్లో ఉన్నామంటే ఈ దుర్మార్గుడు వ్యవసాయాన్ని ఎంతలా దిగజార్చాడో అర్ధం చేసుకోండి.

కూటమి అధికారంలోకి రాగానే.. రైతు రాజుగా మార్చేలా ప్రణాళికలు రూపొందిస్తాను. ప్రతి ఎకరాకు సాగునీరు ఇస్తా. గిట్టుబాటు ధరలు, పంటల బీమా అమలు చేస్తాం. ధాన్యం కొనుగోలును సరళతరం చేస్తాను. హార్టీకల్చర్, డ్రిప్, స్ప్రింక్లర్ ఇరిగేషన్ వ్యవస్థను పునరుద్దరిస్తాను. సోలార్ వ్యవసాయ బోర్లు మోటార్లు బిగిస్తాను. గతంలో సేంద్రీయ వ్యవసాయంతో సాగుఖర్చు తగ్గించి రైతుని ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటాను. రైతుకు ఆదాయం పెంచుతాను.

జగన్ రెడ్డి బాదుడు నుండి ప్రజలకు ఉపశమనం కలిగించేలా చర్యలు తీసుకుంటా. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఏకంగా 9 సార్లు విద్యుత్ ఛార్జీలు బాదాడు. నేను విద్యుత్ మిగులు ఉండేలా తయారు చేస్తే, కమిషన్ల కోసం కరెంటు కొనడం మొదలెట్టాడు. సోలార్ విద్యుత్‌కు ప్రాధాన్యమిస్తాను. చెత్త పన్ను వేసిన చెత్త ముఖ్యమంత్రి ఈ జగన్ రెడ్డి. పెట్రోల్ డీజిల్ ధరలపై పన్నులు నియంత్రిస్తాను.

మద్య నిషేధం పేరుతో జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక మద్యం ప్రియుల బలహీనతను అర్ధం చేసుకుని.. దోచుకుంటున్నాడు. రూ.60 ఉన్న క్వార్టర్ రూ.200 చేసి పీక్కుతింటున్నాడు. ఈ మద్యం తాగి వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. డబ్బుల కక్కుర్తి కోసం మహిళల మాంగళ్యాలు తెంచండి. మద్యం మొత్తాన్ని గుప్పిట్లో పెట్టుకుని తయారీ, డిస్ట్రిబ్యూషన్, అమ్మకం మొత్తం తన చేతుల్లో పెట్టుకుని ఖజానా నింపుకుంటున్నాడు. చిన్న చిన్న షాపుల్లో కూడా డిజిటల్ పేమెంట్లు ఉన్నాయి. కానీ, మద్యం షాపుల్లో మాత్రం క్యాష్ పేమెంట్లు చేస్తూ.. ఆ సొమ్మును తాడేపల్లికి తరలిస్తున్నాడు. మద్యం పేరుతో ప్రజల నుండి పీల్చిన ప్రతి రూపాయిని కక్కిస్తాను.

ప్రజల ఆస్తిని, సచివాలయాన్ని కూడా తాకట్టు పెట్టిన ముఖ్యమంత్రిని ఎక్కడైనా చూశారా? ప్రభుత్వ ఆస్తుల్ని తాకట్టు పెట్టినోడిని వదిలేద్దామా? మద్య నిషేధం చేశాకే ఓట్లు అడుగుతాని చెప్పిన వ్యక్తి ఇప్పుడు ఓట్ల కోసం వస్తున్నాడు. ప్రశ్నించండి. మద్య నిషేధం చేయకుండా ఏ మొహం పెట్టుకుని వచ్చావని నిలదీయండి. జగన్ రెడ్డి చేసిన పనికి.. మరో పాతికేళ్లపాటు మద్య నిషేధం సాధ్యం కాదు. ఎవడిచ్చాడు ఆ హక్కు? రూ.13 లక్షల కోట్ల అప్పు చేశాడు. ఒక్కో కుటుంబంపై రూ.10 లక్షలకు పైగా అప్పుంది. రేపు ఓడిపోయాక ఎటు పోతాడో అతనికే తెలియదు. కానీ, దాన్ని కట్టాల్సింది మనమే. మనకి 175 సీట్లు గెలుస్తున్నాం. వైనాట్ పులివెందుల నినాదంతో ముందుకు వెళ్తున్నాం. పులివెందులలో ఏమని ఓటు అడుగుతావని ప్రశ్నిస్తున్నా. గొడ్డలి చూపించి ఓట్లు అడుగుతావా అని నిలదీస్తున్నా.

యువతకు ఉద్యోగాలిచ్చానని జగన్ రెడ్డి చెబుతున్నాడు. మటన్ కొట్టు దగ్గర, ఫిష్ మార్టులో ఉద్యోగాలు చూపిస్తున్నాడు. నేనుంటే ఐటీ ఉద్యోగాలు. టీచర్ ఉద్యోగాలొస్తాయి. నేను అధికారంలోకి వస్తే.. పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయి. నేను ముఖ్యమంత్రి ఎప్పుడవుతానా.. ఎప్పుడు ఉద్యోగాలొస్తాయా అని ఎదురు చూస్తున్నారు. జాబురావాలంటే బాబు రావాలి. గంజాయి కావాలంటే జగన్ రెడ్డి రావాలి. గంజాయి జగన్ రెడ్డి బ్రాండ్. మన బ్రాండ్ ఉద్యోగాలు. అందుకే హామీ ఇస్తున్నా.. అధికారంలోకి రాగానే తొలి సంతకం మెగా డీఎస్సీపై పెడతా. నేనేం చేశానని ఈ తిక్కలోడు అడుగుతున్నాడు.

14 ఏళ్లు ముఖ్యమంత్రిగా 8 డీఎస్సీలు నిర్వహించా. ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఏం చేశావో చెప్పు. నేను ఈ రోజు హామీ ఇస్తున్నా.. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత నాది. ఉద్యోగం వచ్చే వరకు నెలకు రూ.3000 చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తా. మరోవైపు.. ఎమ్ఎన్సీల్లో ఉద్యోగాలు పొందేలా చొరవ తీసుకుంటాను. వర్క్ ఫ్రం హోం సదుపాయంతో వర్క్ స్టేషన్లు ఏర్పాటు చేస్తాను. ఫస్ట్ టైం ఓటర్స్.. మీ భవిష్యత్తు కోసం ఓటు వేయండి. తుపాను మాదిరిగా యువతలో ఉత్సాహం రావాలి. సరిగ్గా 19 రోజులు కూటమి కోసం పని చేయండి. యువత ప్రపంచంలోనే శక్తివంతమైన యువతగా తీర్చిదిద్దే బాధ్యత తీసుకుంటాను.

నాగావళి వంశధార గోదావరి కృష్ణా పెన్నా నదుల్ని అనుసంధానిస్తే.. రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు నీరిచ్చే అవకాశం ఉంటుంది. అది నా కల. అది అసాధ్యం కాదు. నీటి సమస్య పరిష్కరిస్తే మనల్ని మించే రాష్ట్రం ఎక్కడా ఉండదు. చదువులు చెప్పాల్సిన టీచర్లను మద్యం షాపుల ముందు కాపలా పెట్టాడు. మనం ఉపాధ్యాయులందరికీ గురువు స్థానం ఇవ్వాలని నేను చూశాను. ఉద్యోగుల్ని, ఉపాధ్యాయుల్ని బెదిరిస్తున్నాడు. జగన్ రెడ్డికి ఉద్యోగస్తులు ఓటేస్తే.. ఇకపై రివర్స్ పీఆర్సీతో జీతాలు తగ్గించే పరిస్థితి వస్తుంది. ఐదేళ్లు మిమ్మల్ని ఎలా చిత్రహింసలు పెట్టాడో గుర్తుందా? టీచర్లు, అంగన్వాడీ టీచర్లను వేధించాడు.

సూపర్ సిక్స్ తీసుకొచ్చాను. ఆస్తిలో సమాన హక్కు కల్పించిన పార్టీ తెలుగుదేశం. కానీ, జగన్ రెడ్డి చెల్లెలికి ఆస్తిలో హక్కివ్వకుండా బయటకు గెంటేశాడు. తిరిగి వేధింపులకు గురి చేస్తున్నాడు. ఎంత పేదవాడైనా.. తన చెల్లి లేదా అక్క కోసం అండగా నిలుస్తాడు. కానీ, ఈ దుర్మార్గుడు చెల్లికి ఆస్తిలో వాటా ఇవ్వకుండా వేధిస్తున్నాడు. గతంలో డ్వాక్రాతో ఆర్ధిక స్వాతంత్ర్యం కల్పించాను. దీపం పథకం, పసుపు కుంకుమ లాంటి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టాం.

తల్లికి వందనంతో బడికి వెళ్లే ప్రతి బిడ్డకు రూ.15 వేలు చొప్పున అందించి మెరుగైన విద్య అందించే బాధ్యత నాది. ఆడబిడ్డ నిధితో ప్రతి మహిళకూ నెలకు రూ.1500 చొప్పున అందిస్తా. ఆ సొమ్ముతో స్వయం ఉపాధి పొందే మార్గం చూపిస్తా. ఏటా మూడు వంట గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తాను. ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పిస్తాను. చంద్రన్నే మా డ్రైవర్ అని గుర్తుంచుకోండి. రాబోయే రోజుల్లో భవిష్యత్ మహిళలదే. ప్రపంచానికి మన తెలుగు మహిళల సత్తా చాటి చెప్పే బాధ్యత తీసుకుంటాను.

పింఛన్లు ప్రారంభించిందే ఎన్టీఆర్. రూ.200 ఉన్న పెన్షన్ రూ.2000 చేసింది నేనే. మళ్లీ అధికారంలోకి వస్తే రూ.4000 ఇస్తా. ఏప్రిల్ నుండే అమలు చేస్తానని ప్రకటిస్తున్నా. మూడు నెలల వరకు పెన్షన్ మొత్తాన్ని ఒకేసారి తీసుకునేలా, రాష్ట్రంలో ఎక్కడైనా తీసుకునే సదుపాయం కల్పిస్తా. దివ్యాంగులకు నెలకు రూ.6000 చొప్పున పెన్షన్ ఇస్తున్నా.

అధికారంలోకి రాగానే.. రాష్ట్రంలోని రోడ్లపై సమీక్షించి పనులు ప్రారంభిస్తాను. శ్రీకాకుళం-ఆముదాలవలస రోడ్డు పూర్తి చేసి చూపిస్తాను. మన ఆలోచన ముఖ్యం. సంపద సృష్టించాలంటే ఆలోచన కావాలి. ఆలోచన సరైనది ఉంటే అభివృద్ధి ఆటోమేటిగ్గా జరుగుతుంది.

రేషన్ షాపుల్లో గతంలో 8 రకాల సరుకులు, పండుగ కానుకలు అందించాం. కానీ నేడు బియ్యం తప్ప ఇంకేమైనా వస్తున్నాయా? అది కూడా కేంద్రం ఇచ్చే బియ్యాన్ని మాత్రమే ఇస్తున్నాడు. కేంద్రం ఇళ్ల కోసం ఇచ్చే రూ.1.50 లక్షలు, నరేగా రూ.30 వేల సొమ్మును ఇస్తూ తన ఘనతగా చెబుతున్నాడు. అన్న క్యాంటీన్లు, చంద్రన్న బీమా, విదేశీ విద్య లాంటి పథకాలు ఎందుకు రద్దు చేశావో సమాధానం చెప్పమని ప్రశ్నిస్తున్నాం. ఇప్పుడు ఇళ్ల పట్టాలు వచ్చిన వారి ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేస్తాను. అందరికీ 2 సెంట్ల స్థలం ఇచ్చి ఇల్లు కట్టించే బాధ్యత నాది. టిడ్కో ఇళ్లు పేదలకు అందించే బాధ్యత నాది.

జగన్ రెడ్డి చేతుల్లో నష్టపోయిన రాష్ట్రాన్ని ప్రతి ఒక్కరూ ఏకమై కాపాడుకోవాలి. రాష్ట్రం ఏస్థాయి సంక్షోభంలో ఉందో అర్ధం చేసుకోవాలి. బటన్ నొక్కడం గొప్ప కాదు. అమ్మమ్మ నానమ్మలు కూడా బటన్ నొక్కగలరు. కానీ, సంపద సృష్టించి, ఆదాయం సృష్టించి, ఉద్యోగాలివ్వడం నా బ్రాండ్. ఉత్తుత్తి బటన్లు నొక్కడం జగన్ రెడ్డి బ్రాండ్. ఏదో ఇస్తున్నా అంటున్నాడు. ప్రజలు ఇచ్చిన పన్నుల్లోంచి రూ.10 ఇచ్చి అదేదో తన తాత ఆస్తిలో నుండి ఇస్తున్నట్లు చెబుతున్నాడు.

నాగావళిపై వంతెన, వంశధారపై పురుషోత్తపురం వద్ద వంతెన, ఆముదాలవలసలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీ నిర్మిస్తాను. నారాయణపురం రీ మోడ్రనైజేషన్ పనులు పునరుద్దరిస్తా. నాగావళి నుండి పొందూరు మండలానికి తాగునీటి కోసం రూ.42 కోట్లు ఇచ్చాం, బూర్జ మండలానికి రూ.48 కోట్లు, ఆమదాలవలసకు రూ.40 కోట్లు కేటాయించాను. కానీ, జగన్ రెడ్డి ఆ పనులన్నీ నిలిపేశాడు. అధికారంలోకి రాగానే పునరుద్దరిస్తాను. వంశధార-నాగావళి అనుసంధానం, వంశధార ఫేజ్-2 పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటాను.

ఆముదాలవలస బుల్లెట్ కూన రవి ఒకవైపు.. ఉత్తరాంద్ర ముద్దుబిడ్డ ఎర్రన్న వారసుడు మరోవైపున్నారు. ఈ ఇద్దరినీ అప్పగిస్తున్నా. వీరిద్దరినీ మరోసారి చట్ట సభలకు పంపించేందుకు సిద్ధం కావాలని కోరుతున్నా. మీ స్పందన చూస్తే.. అటువైపు వ్యక్తికి గుండె వణకాలి. ప్రజాగళం సభల్ని చూస్తుంటే.. జనం జగన్ రెడ్డిపై ఎంత కసితో ఉన్నారో కళ్లకు కనిపిస్తోంది.

కొండనైనా బద్దలు చేస్తాననే ధైర్యం కలుగుతోంది. నాకు పదవి కాదు.. ప్రజల జీవితాలు ముఖ్యం. వారి జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా పని చేస్తా. దేశంలో, ప్రపంచంలో తెలుగువారిని అగ్రస్థానంలో నిలపాలన్నదే నా ఆకాంక్ష. ప్రతి క్షణం నా ఆలోచన రాష్ట్రఅ భ్యున్నతి కోసమే. కూటమిని గెలిపించండి. ప్రజాస్వామ్యాన్ని, ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలని కోరుతున్నాను

LEAVE A RESPONSE