మంత్రిగా నారా లోకేష్ ప్రమాణ స్వీకారం
నారా లోకేష్ తో గవర్నర్ అబ్దుల్ నజీర్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారానంతరం వేదికపై ఆశీనులైన అతిథులందరికీ నమస్కరించారు.. నారా లోకేశ్ తండ్రి చంద్రబాబుకు పాదాభివందనం చేసి ఆశీస్సులు అందుకున్నారు. ప్రధాని మోదీ, అమిత్ షాలకు కూడా లోకేశ్ పాదాభివందనం చేసేందుకు యత్నించగా, వారు వద్దని సున్నితంగా వారించారు. రెండో పర్యాయం మంత్రిగా బాధ్యతలు అందుకోబోతున్న లోకేశ్ కు ప్రధాని మోదీ, అమిత్ షా, గడ్కరీ, జేపీ నడ్డా శుభాకాంక్షలు తెలిపారు.