-నువ్వు ఇప్పటి వరకూ కట్టిన ఇళ్లు ఎన్నో చెప్పే దమ్ముందా?
-సెంటు స్థలాల కోసం భూముల తీసుకున్న బీసీ,ఎస్సి,ఎస్టీ రైతులకు రూ.800 బకాయిలు పెట్టాడు
-అప్పుడు బాబాయ్ కి గుండెపోటు అన్నారు.. .ఇప్పుడు తల్లికి గుండెపోటు అంటున్నారు
-తల్లి, తండ్రి లేని పిల్లల్ని జగన్ ఇబ్బంది పెడుతున్నాడు
-ఆళ్లగడ్డ బహిరంగ సభలో నారా లోకేష్
అహోబిలం లక్ష్మి నరసింహ స్వామి, నవ నర్సింహులు కొలువైన ఆధ్యాత్మిక కేంద్రం ఆళ్లగడ్డ.
బ్రిటిషు వారికి వ్యతిరేకంగా పోరాడిన మొట్టమొదటి సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి.
కరువుతో ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పుడు అందరికి అన్నం పెట్టిన దానకర్ణుడు బుడ్డా వెంగళరెడ్డి.
ఆళ్లగడ్డ శిల్పకళకు ప్రపంచం మొత్తం డిమాండ్ ఉంది.
ఆళ్లగడ్డను అమ్మలా భావించి అభివృద్ధి చేసారు శోభా నాగిరెడ్డి, భూమా నాగిరెడ్డి.
ఆళ్లగడ్డ ఆడపులి అఖిల ప్రియ మీ తరపున పోరాడుతుంది.
ఎంతో చరిత్ర ఉన్న ఆళ్లగడ్డలో పాదయాత్ర చెయ్యడం నా అదృష్టం.
యువగళం…మనగళం…ప్రజాబలం.
లోకేష్ ది యువదళం…జగన్ ది సైకో సైన్యం.
టిడిపి ఘన చరిత్ర ఉన్న పార్టీ… వైసిపి గజ దొంగల పార్టీ.
మన బాబు గారు పరిగెత్తే యువకుడు. జగన్ కొబ్బరికాయ కొట్టడానికి వంగలేని ముసలోడు.
బాబు గారిది ప్రజా బలం… జగన్ ది ధన బలం.
చంద్రబాబు గారికి ప్రజల పై నమ్మకం…జగన్ కి రూ.2 వేల నోటు పై నమ్మకం.
రూ.2 వేల నోటు కేంద్రం రద్దు చెయ్యగానే తాడేపల్లి ప్యాలస్ షేక్ అయ్యింది.
చంద్రబాబు గారిది స్వర్ణాంధ్రప్రదేశ్… జగన్ ది అంధకారప్రదేశ్.
24 గంటలు విద్యుత్ ఇవ్వలేని చెత్త ప్రభుత్వం జగన్ ది.
పాదయాత్ర మొదలు పెట్టిన మొదటి రోజే చెప్పా సాగనిస్తే పాదయాత్ర..అడ్డుకుంటే దండయాత్ర.
అంబేద్కర్ గారి రాజ్యాంగం చేతిలో పట్టుకొని నేను పాదయాత్ర చేసాను. జగన్ రాజారెడ్డి రాజ్యాంగంతో అడ్డుకోవాలని ప్రయత్నించాడు.
నన్ను అడ్డుకోవడం చేతగాక జిఓ.1 తీసుకొచ్చాడు. నేను ఆ రోజే చెప్పా ఏ1 జిఓ.1 మడిచి ఎక్కడ పెట్టుకుంటావో పెట్టుకో అని.
జిఓ.1 పోయింది. ఇప్పుడు ఎం పీకుతావ్ జగన్?
పీకేది ఏమి లేక నన్ను అడ్డుకోమని పిల్ల సైకోలను పంపుతున్నాడు.
పిల్ల సైకోలకు స్వీట్ వార్నింగ్ ఇస్తున్నా. పిల్ల సైకోస్ బీ కేర్ ఫుల్. మీ కాళ్ళు విరిగితే మీ వాడు పరామర్శకు కూడా రాడు.
జగన్ చేసేవి అన్ని దొంగ పనులే. అందుకే దొంగబ్బాయ్ జగన్ అని ముద్దు పేరు పెట్టా.
లక్ష కోట్ల ప్రజాధనం దొబ్బి ఇప్పుడు ఏమి తెలియని అమాయకుడిలా నేను పేదవాడిని అంటున్నాడు.
లక్ష కోట్లు ఆస్తి ఉన్నవాడు పేదవాడా? లక్ష రూపాయల చెప్పులు వేసుకునే వాడు పేదవాడా? వెయ్యి రూపాయల వాటర్ బాటిల్ తాగేవాడు పేదవాడా?
బెంగుళూరులో ప్యాలస్, హైదరాబాద్ లో ప్యాలస్, తాడేపల్లి లో ప్యాలస్, ఇడుపులపాయలో ప్యాలస్, ఇప్పుడు వైజాగ్ లో మరో ప్యాలస్ కడుతున్నాడు. ఇన్ని ప్యాలస్ లు ఉన్నవాడు పేదవాడా?
సిమెంట్ కంపెనీలు, పవర్ ప్లాంట్లు, సొంత టివి, ఛానల్ ఉన్నవాడు పేదవాడా?
దొంగబ్బాయ్ జగన్ పేదవాడు కాదు…పేదల రక్తం తాగే రాక్షసుడు.
దొంగబ్బాయ్ జగన్ చెప్పే కబుర్లు విని కరుడు కట్టిన దొంగలు కూడా షాక్ కి గురవుతున్నారు.
సెంటు స్థలాల గురించి గొప్పలు చెబుతున్నాడు దొంగబ్బాయ్ జగన్.
సెంటు స్థలాల పేరుతో 7 వేల కోట్ల ప్రజాధనం లూటీ చేసిన గజ దొంగలు మీరు.
సెంటు స్థలాలు సంసారానికి పనికి రావు అని వైసిపి ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అన్నప్పుడు దొంగబ్బాయ్ జగన్ ఎక్కడ పడుకున్నాడు.
ఎన్నికల ముందు ఫ్రీ గా ఇళ్లు కట్టిస్తాం అని చెప్పి మోసం చేసాడు దొంగబ్బాయ్ జగన్.
మొన్న ఒక మహిళ ధర్మవరం ఎమ్మెల్యే కేటుగాడుని నిలదీసింది.
ఎన్నికల ముందు ఇళ్లు మీరే కట్టి ఇస్తాను అన్నారు. ఇప్పుడు మీరే కట్టుకోండి అంటే ఎలా? అప్పు తీర్చడానికి మా జీవితం సరిపోదు అంది ఆ మహిళ.
కేటుగాడికి కోపం వచ్చింది. కడితే అప్పు చేసి ఇళ్లు కట్టు లేకపోతే పట్టా వెనక్కి తీసుకుంటాం అని ఆ మహిళని తిట్టాడు.
నేను దొంగబ్బాయ్ జగన్ కి ఛాలెంజ్ చేస్తున్నా నువ్వు ఇప్పటి వరకూ కట్టిన ఇళ్లు ఎన్నో చెప్పే దమ్ముందా?
సెంటు స్థలాల కోసం భూముల తీసుకున్న బీసీ,ఎస్సి,ఎస్టీ రైతులకు రూ.800 బకాయిలు పెట్టాడు.
దొంగబ్బాయ్ జగన్ కి రిబ్బన్ కట్టింగ్ పిచ్చి పట్టింది.
బందరు కి మళ్లీ లడ్డు పట్టుకెళ్ళాడు. ఎన్నికల ముందు అప్పులు తెచ్చుకోవడానికి మరోసారి బందరు పోర్టుకి శంకుస్థాపన చేసాడు.
చంద్రబాబు గారి హయాంలో ఒక కంపెనీకి పనులు అప్పజెప్పారు. అధికారంలోకి వచ్చిన వెంటనే వాళ్ళని తరిమేసాడు.
నాలుగేళ్లు ప్యాలస్ లో నిద్రపోయి ఇప్పుడు బందరు పోర్టు కల నెరవేరింది అంటూ బిల్డప్ ఇస్తున్నాడు.
కడప స్టీల్ ఫ్యాక్టరీకి రెండు సార్లు శంకుస్థాపన చేసాడు.
అదానీ డేటా సెంటర్ కి రెండోసారి శంకుస్థాపన చేసాడు.
భోగాపురం విమానాశ్రయం కి మళ్లీ శంకుస్థాపన చేసాడు.
కర్నూలు విమానాశ్రయం నిర్మించి బాబు గారు ప్రారంభిస్తే జగన్ వెళ్లి మళ్లీ ప్రారంభించి నేనే కట్టాను అంటున్నాడు.
బాబాయ్ ని లేపేసిన కేసులో దొంగబ్బాయిలు అడ్డంగా దొరికిపోయారు.
కడప లో అన్ని ఆసుపత్రులు ఉంటే కర్నూలు కి తెచ్చి డ్రామా మొదలు పెట్టారు.
దొరికిపోయిన దొంగలు గుండెపోటు డ్రామా మొదలు పెట్టారు.
అప్పుడు బాబాయ్ కి గుండెపోటు అన్నారు. ఇప్పుడు తల్లి కి గుండెపోటు అంటున్నారు.
వీళ్ల స్వార్ధ రాజకీయం కోసం ఆ తల్లిని ఎం చేస్తారో అని భయం వేస్తుంది. ఆ తల్లిని ఏదైనా చేసి ఆ నెపం నా పై నెడతారు.
ఆ తల్లిని దేవుడు కాపాడాలని కోరుకుంటున్నాను.
అవినాష్ స్టోరీ కి ఎండ్ కార్డ్ పడింది. త్వరలోనే బాబాయ్ మర్డర్ కేసులో మాస్టర్ మైండ్స్ కూడా జైలుకి పోవడం ఖాయం.
దొంగబ్బాయ్ జగన్ కట్టింగ్ అండ్ ఫిట్టింగ్ మాస్టర్. ఫిట్టింగ్ ఎలా ఉంటుందో చెబుతా.
దొంగబ్బాయ్ జగన్ కి రెండు బటన్స్ ఉంటాయి. ఒకటి బ్లూ బటన్. రెండోవది రెడ్ బటన్.
బ్లూ బటన్ నొక్కగానే మీ అకౌంట్ లో 10 రూపాయలు పడుతుంది. రెడ్ బటన్ నొక్కగానే మీ అకౌంట్ నుండి 100 రూపాయలు పోతుంది.
అది ఎలాగో మీకు చెబుతా. విద్యుత్ ఛార్జీలు 8 సార్లు బాదుడే బాదుడు, ఆర్టీసీ బస్ ఛార్జీలు 3 సార్లు బాదుడే బాదుడు, ఇంటి పన్ను బాదుడే బాదుడు, చెత్త పన్ను బాదుడే బాదుడు. పెట్రోల్, డీజిల్ ధరలు బాదుడే బాదుడు, నిత్యావసర సరుకుల ధరలు బాదుడే బాదుడు. మీకు ఇంకో ప్రమాదం కూడా ఉంది త్వరలోనే వాలంటీర్ వాసు మీ ఇంటికి వస్తాడు. మీరు పీల్చే గాలిపై కూడా పన్నేస్తాడు. దొంగబ్బాయ్ జగన్ కి దమ్ముంటే ఇంటికి స్టిక్కర్ కాదు కరెంట్ బిల్లుకి, బస్సు టికెట్ మీద, పెట్రోల్, డీజిల్ బిల్లు మీద, చెత్త పన్ను మీద, ఇంటి పన్ను మీదా స్టిక్కర్ వెయ్యాలి.
దొంగబ్బాయ్ జగన్ కట్టింగ్ మాస్టర్. అది ఎలాగో చెబుతాను.
అన్న క్యాంటిన్ కట్, పండుగ కానుక కట్, పెళ్లి కానుక కట్, చంద్రన్న భీమా కట్, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కట్, ఫీజు రీయింబర్స్మెంట్ కట్, 6 లక్షల పెన్షన్లు కట్, డ్రిప్ ఇరిగేషన్ కట్.
100 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసిన మొదటి సీఎం ఈ దొంగబ్బాయ్ జగన్.
దొంగబ్బాయ్ జగన్ యువత ఎప్పటికీ పేదరికంలో ఉండాలని కోరుకుంటున్నాడు.
జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు, 2.30 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు, ప్రతి ఏటా 6,500 పోలీసు ఉద్యోగాలు ఇవ్వలేదు, గ్రూప్2 లేదు, డిఎస్సి లేదు. ఉన్న అంబేద్కర్ స్టడీ సర్కిల్స్, బీసీ స్టడీ సర్కిల్స్ మూసేసాడు. జిఓ77 తీసుకొచ్చి ఉన్నత విద్య చదువుతున్న వారికీ ఫీజు రీయింబర్స్మెంట్ పధకం రద్దు చేసాడు.
టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఏడాది నోటిఫికేషన్ ఇస్తాం. అన్ని జిల్లాల్లో స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేస్తాం.
దొంగబ్బాయ్ జగన్ మహిళల పసుపు, కుంకుమ చెరిపేస్తున్నాడు.
సంపూర్ణ మద్యపాన నిషేధం హామీ ఎం అయ్యింది? సొంత జే బ్రాండ్లు అమ్ముకొని వేల కోట్లు సంపాదిస్తున్నాడు. 45 ఏళ్లకే బీసీ, ఎస్సి, ఎస్టీ మహిళలకు పెన్షన్ అన్నాడు. పెన్షన్ దేవుడెరుగు పాపం మహిళలు దాచుకున్న అభయహస్తం డబ్బులు 2500 కోట్లు కొట్టేసాడు. ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మ ఒడి ఇస్తా అని మోసం చేసాడు.
అధికారంలోకి వచ్చాకా పన్నుల భారం తగ్గిస్తాం. నిత్యావసర సరుకుల ధరలు తగ్గిస్తాం.
దొంగబ్బాయ్ జగన్ రైతులు లేని రాజ్యం తెస్తున్నాడు.
దొంగబ్బాయ్ జగన్ పరిపాలనలో పురుగుల మందులు పనిచేయవు. జగన్ బ్రాండ్లు ప్రెసిడెంట్ మెడల్, గోల్డ్ మెడల్, ఆంధ్రా గోల్డ్ కొడితే మాత్రం పురుగులు చస్తాయి.
రైతుల్ని ఆదుకోకపోగా ఇప్పుడు మీటర్లు పెడుతున్నాడు.
రాయలసీమ లో 1000 అడుగుల వరకూ బోర్లు వేస్తే కానీ నీళ్లు రావు…,మరి కరెంట్ బిల్లు ఎంత వస్తుందో ఆలోచించండి.
మీటర్లు రాయలసీమ రైతులకు ఉరితాళ్లు.
దొంగబ్బాయ్ జగన్ ఉద్యోగస్తులను కూడా వేధించాడు.
వారంలో సీపీఎస్ రద్దు చేస్తా అని 200 వారాలు దాటినా సీపీఎస్ రద్దు చెయ్యలేదు.
పోలీసులకు 4 సరెండర్స్, 8 టిఎ, డీఏలు పెండింగ్ పెట్టాడు. ఆఖరికి జిపిఎఫ్ డబ్బులు కూడా లేపేశారు. మెడికల్ బిల్లులు కూడా ఇవ్వడం లేదు.
పోలీసులు దాచుకున్న జిపిఎఫ్ డబ్బు సైతం కొట్టేసాడు. నేను ప్రతి రోజూ మాట్లాడుతుంటే భయపడి కొంత బకాయి తీర్చాడు. ఇంకా రావాల్సింది చాలా ఉంది.ఆఖరికి పెన్షనర్లకు పెన్షన్ ఇవ్వలేని చెత్త ప్రభుత్వం ఇది.
మైనారిటీలను మోసం చేసాడు దొంగబ్బాయ్ జగన్.
దుల్హన్, రంజాన్ తోఫా వంటి పథకాలు రద్దు చేశాడు.
మసీదు, ఈద్గా, ఖబర్ స్తాన్ ల అభివృద్ధి కోసం ఒక్క రూపాయి కేటాయించలేదు.
ఆత్మహత్య చేసుకోవడం మైనార్టీలు మహా పాపంగా భావిస్తారు.
దొంగబ్బాయ్ జగన్ సీఎం అయ్యాక నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. కేవలం వైసీపీ నాయకుల వేధింపుల వల్లే వాళ్లు ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పటి వరకూ దోషులకు శిక్షపడలేదు.
నంద్యాల లో ఆర్టీఓ వేధింపులు తట్టుకోలేక కరిముల్లా ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు.ముగ్గురు పిల్లలతో కరిముల్లా భార్య పడుతున్న బాధలు జగన్ కి కనపడవు. ఇప్పటి వరకూ దోషులకు శిక్ష పడలేదు.
ఇబ్రహీం అనే ముస్లిం నేతను నరసరావుపేటలో దారుణంగా నరికి చంపేశారు.
పలమనేరులో మిస్బా అనే పదో తరగతి చెల్లిని వైసీపీ నాయకుడు సునీల్ టీసీ ఇప్పించి, బలవంతంగా వేధించడంతో, చదువుకు దూరం చేయడంతో ఆత్మహత్య చేసుకుంది.
కర్నూలు లో హాజీరాని అత్యాచారం చేసి చంపేశారు. ఆమె తల్లి బేగంబీ కి కనీసం పోస్టుమార్టం రిపోర్ట్ ఇవ్వకుండా ప్రభుత్వం వేధించింది. ఇప్పటికీ ఆ తల్లికి న్యాయం జరగలేదు.
ఈ కుటుంబాలకు న్యాయం చెయ్యాలి అని పోరాటం చేసింది టీడీపీ.
టీడీపీ హయాంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసాం. హజ్ యాత్రకు సహాయం చేసాం. ఆనాడు బీజేపీ తో పొత్తు ఉన్నా మైనార్టీల పై ఒక్క దాడి జరగలేదు, ఒక్క సంక్షేమ కార్యక్రమం ఆపలేదు.
టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే గతంలో అమలు చేసిని అన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తాం.
టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే మైనార్టీల సంక్షేమం కోసం ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తాం.
దొంగబ్బాయ్ జగన్ దళిత ద్రోహి.
డాక్టర్ సుధాకర్ దగ్గర మొదలైంది. ఇప్పుడు డాక్టర్ అచ్చెన్న వరకూ వచ్చింది.
ఇసుక అక్రమాలను ప్రశ్నించినందుకు వరప్రసాద్ కి గుండు కొట్టించారు, మాస్క్ పెట్టుకోలేదని కిరణ్ ని కొట్టి చంపారు, జగన్ లిక్కర్ స్కామ్ పై పోరాడినందుకు ఓం ప్రతాప్ కి చంపేసారు. పెద్దిరెడ్డి అవినీతి పై పోరాడినందుకు జడ్జ్ రామకృష్ణ ని హింసించారు.
ఒక్క కేసులో అయినా దళితుల పై దాడి చేసిన వారికీ శిక్ష పడిందా?
సుబ్రహ్మణ్యం అనే దళిత యువకుడిని చంపేసిన ఎమ్మెల్సీ అనంతబాబు కి సన్మానం చేసి ఉరేగించారు.
వైసిపి పాలనలో దళితులను చంపడానికి జగన్ స్పెషల్ లైసెన్స్ ఇచ్చారు.
దళితులకు ఇవ్వాల్సిన 27 సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేసాడు జగన్. టిడిపి గెలిచిన వెంటనే దళితుల 27 సంక్షేమ కార్యక్రమాలు తిరిగి ప్రారంభిస్తాం.
బీసీలకు బ్యాక్ బోన్ విరిచాడు దొంగబ్బాయ్ జగన్.
పేరుకే బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసారు. నిధులు కేటాయించలేదు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో 10 శాతం రిజర్వేషన్ కట్ చేసి 16,500 మందిని పదవులకు దూరం చేసాడు.
బీసీలను అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 26 వేల అక్రమ కేసులు బీసీల పై పెట్టాడు. అందుకే బీసీల భద్రత కోసం ప్రత్యేక బీసీ రక్షణ చట్టం తీసుకొస్తాం.
బీసీలకు శాశ్వత కుల ధృవ పత్రాలు అందిస్తాం.
బీసీలమని ఆరు నెలలకోసారి కుల ధృవపత్రాలు తీసుకోవాల్సిన దుస్థితి లేకుండా చేస్తాం.
మొబైల్ లో ఒక్క బటన్ నొక్కగానే ఇంటికి బిసి కుల ధృవ పత్రాలు వచ్చే ఎర్పాటు చేస్తాం.
అవి శాశ్వత కుల ధృవ పత్రాలు గా ఉపయోగపడేలా చట్టం లో మార్పులు తీసుకొస్తాం.
దామాషా ప్రకారం బీసీ ఉపకులాలకు నిధులు, రుణాలు ఇస్తాం.
రెడ్డి సోదరులు కూడా ఆలోచించండి. మీరు కోట్లు ఖర్చు చేసి జగన్ ని గెలిపించుకున్నారు.
మీకు ఇప్పుడు వైసిపి లో కనీస గౌరవం దక్కుతుందా. ఒక్క టిడిపి లోనే అందరికి గౌరవం దక్కుతుంది.
ఆళ్లగడ్డను అద్భుతంగా అభివృద్ధి చేస్తాడని మీరు 2019 ఎన్నికల్లో గంగుల బ్రిజేంద్ర రెడ్డి అలియాస్ గంగుల నాని ని మీరు భారీ మెజారిటీ తో గెలిపించారు. అతనో చేతగాని ఎమ్మెల్యే.
ఆళ్లగడ్డను అడ్డంగా దోచుకోవడం తప్ప చేసింది ఏమైనా ఉందా? అందుకే ఆయన పేరు మార్చాను. ఆయన గంగుల నాని కాదు లూటీ నాని.
లూటీ నాని గారి స్వయంగా ఇంటినే సెటిల్మెంట్ డెన్ గా మార్చేసుకున్నాడు.
ఆళ్లగడ్డ లో ఐ ట్యాక్స్ అంటే అందరికి బాగా తెలుసు. మహిళల్ని మనం గౌరవించాలని పేరు చెప్పడం లేదు. కానీ ఐ ట్యాక్స్ తో మీరు పడుతున్న ఇబ్బందులు అన్ని నాకు తెలుసు.
ఇసుక, ఎర్రమట్టి, కాంట్రాక్టులు, లిక్కర్ దందా, అక్రమ బియ్యం రవాణా…ఇలా ప్రతి దాంట్లో లూటీ చేస్తూ లూటీ నాని దాదాపు 200 ఎకరాలు కొన్నాడని వైసిపి నాయకులు, కార్యకర్తలే మాట్లాడుకుంటున్నారు.
లూటీ నాని అనుచరుడు రాఘవేంద్రారెడ్డి రామతీర్ధం కొండలను తవ్వేసి ఎర్రమట్టి అక్రమ రవాణా చేస్తున్నాడు.
ఆళ్లగడ్డలో ఇసుక డిపో పెట్టారు. 8 వేల టన్నుల ఇసుకను దోచేసారు.
లూటీ నాని అనుచరులు ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్నారు.
సిరువెళ్ల మండలంలో లూటీ నాని, ఆయన అనుచరులు భూకబ్జాలు, ల్యాండ్ సెటిల్మెంట్స్ కి పాల్పడుతున్నారు. ఇటీవల రైతులు పురుగుమందు డబ్బాలతో ఆందోళనకు దిగారు. బోయలకుంట్ల గ్రామంలో ఓ బ్రాహ్మణుడి భూమిని ని లాక్కొని రైతు భరోసా కేంద్రం కట్టారు.
లూటీ నాని, అనుచరులు కలిసి ఆళ్లగడ్డను అక్రమ బియ్యం రవాణాకు అడ్డాగా మార్చేసారు.
లూటీ నాని, అనుచరులు కలిసి మున్సిపాలిటీ సెస్ పేరుతో ప్రజల్ని దోపిడీ చేస్తున్నారు.
ఆఖరికి దేవుడ్ని కూడా వదలలేదు లూటీ నాని అహోబిలం లక్ష్మి నరసింహ స్వామి ఆలయం దందా చేస్తున్నారు.
అహోబిలం లక్ష్మి నరసింహ స్వామి ఆలయంలో పెత్తనం చెయ్యాలని వైసిపి ప్రభుత్వం ప్రయత్నిస్తే సుప్రీం కోర్టు మొట్టికాయలు వేసింది.
సిరువెళ్లలో పేరుకే దళిత సర్పంచి.. అక్కడ పెత్తనం అంతా ఎమ్మెల్యే అనుచరులదే. వారి వేధింపులకు ప్రజలు భయపడిపోతున్నారు.
లూటీ నాని అభివృద్ధి చెయ్యడు వేరే వాళ్ళు చేసినవి ఉంచడు. ఆళ్లగడ్డలో దివంగత భూమా నాగిరెడ్డి ప్రయాణికుల కోసం బస్ షెల్టర్ కడితే.. ఆయనకు పేరు వస్తుందని డ్రైనేజీ నిర్మాణం పేరుతో బస్ షెల్టర్ కూల్చారు.
జగన్ పాలనలో నిధులు లేక అభివృద్ధి చేయలేకపోతున్నాం అని మున్సిపల్ ఛైర్మెన్ ప్రతి సమావేశంలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఆళ్లగడ్డను లూటీ చెయ్యడంలో ఉన్న శ్రద్ద నిధులు తేవడం పట్ల పెట్టలేదు లూటీ నాని.
జగన్ పాదయాత్రలో భాగంగా ఆళ్లగడ్డకు వచ్చినప్పుడు అనేక హామీలు ఇచ్చాడు.
నియోజకవర్గంలో తాగునీటి సమస్య లేకుండా చేస్తానని హామీ ఇచ్చాడు.
కేసి కెనాల్, తెలుగుగంగ నుండి చివరి ఆయకట్టు వరకూ రైతులకు నీరుఅందిస్తాం అని హామీ ఇచ్చాడు. ఇచ్చిన ఏ ఒక్క హామీ నిలబెట్టుకోలేదు.
ఆళ్లగడ్డను అభివృద్ధి చేసింది టిడిపి. నియోజకవర్గాన్ని 2వేల కోట్లతో అభివృద్ధి చేసాం.
సాగు, తాగునీటి ప్రాజెక్టులు, పేదలకు టిడ్కో ఇళ్లు, రోడ్ల విస్తరణ, గ్రామాల్లో సిసి రోడ్లు, స్కూల్ భవనాలు కట్టింది టిడిపి.
నియోజకవర్గంలో రోడ్లు లేక ప్రజలు నరకయాతన పడుతున్నారు. ఆఖరికి రోడ్డు బాగుచెయ్యాలి అని రుద్రవరం మండలంలో రైతులు కోర్టులో కేసు వేసారంటే ఎంత దారుణమో అర్ధం చేసుకోండి. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే నియోజకవర్గంలో రోడ్లు వేస్తాం.
ఆళ్లగడ్డ టౌన్ లో టిడిపి హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్లు నాలుగేళ్లు అయినా లబ్దిదారులకు పంపిణీ చెయ్యలేదు.
కడప జిల్లా దువ్వూరు వద్ద రాజోలి జలాశయం నిర్మాణం కోసం జగన్ శంకుస్థాపన చేసారు. దీని వలన ఆళ్లగడ్డ నియోజకవర్గం చాగలమర్రి మండలం రాజోలి, గుట్లూరు గ్రామాల్లో 600 ఎకరాలు ముంపుకు గురి అవుతున్నాయి. ఒక్క పైసా పరిహారం ఇవ్వలేదు, పనులు ప్రారంభించలేదు.
కుందూ విస్తరణ పనులు నిధులు లేక బిల్లులు ఇవ్వకపోవడంతో మధ్యలోనే వదిలేశారు. ఇప్పటికే తవ్విన మట్టిని వైసీపీ నాయకులు అక్రమంగా తరలించి సొమ్ము చేసుకున్నారు.
తొల్లవాగు రిజర్వాయరు నుంచి ఆళ్లగడ్డ పట్టణ సహా ఆళ్లగడ్డ, రుద్రవరం మండలాల్లో 41 గ్రామాలకు తాగునీరు అందించే రక్షిత మంచినీటి పథకానికి నిర్వహణ నిధులు లేక ఆళ్లగడ్డకు తప్పా ఒక్క గ్రామానికి తాగునీరు ఇవ్వడం లేదు.
సిరువెళ్లలో టీడీపీ హయాంలో రూ.2 కోట్లతో ప్రభుత్వ ఉర్దూ ఉన్నత పాఠశాల పక్కా భవనాల నిర్మాణం ప్రారంభిస్తే వైసీపీ వచ్చాక నాలుగేళ్లు అయినా పూర్తి చేయలేదు.
ఆళ్లగడ్డ నియోజకవర్గం ప్రధాన నీటి వనరు కేసీ కాలువ. సీసీ లైనింగ్ పనులు చేయకపోవడంతో చివరి ఆయకట్టుకు సాగునీరు అందడం లేదు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పూర్తి చేస్తాం.
అళ్లగడ్డలో శిల్పకళ మ్యూజియం రూ.2.13 కోట్లతో టీడీపీ ప్రభుత్వంలో చేపడితే ఈ ప్రభుత్వం ఆపేసింది. ఇండోర్ స్టేడియం నిర్మాణం రూ.1.25 కోట్లతో చేపడితే ఆపేశారు. అర్జునాపురం రోడ్డు కోసం రూ.1.25 కోట్లు టీడీపీ ప్రభుత్వం మంజూరు ఈ ప్రభుత్వం చేపట్టలేదు. వైసిపి ప్రభుత్వం ఆపేసిన అన్ని పనులు పూర్తి చేస్తాం.
టిడిపి హయాంలో 112 కోట్లతో ప్రతి ఇంటికి తాగునీటి కుళాయి ఏర్పాటు చెయ్యాలి అనే ఉద్దేశంతో పనులు ప్రారంభిస్తే వైసిపి ఆపేసింది.
టిడిపి వచ్చిన వెంటనే ప్రతి ఇంటికి తాగునీటి కుళాయి ఏర్పాటు చేస్తాం.
ఆళ్లగడ్డ మున్సిపాలిటీ ని అభివృద్ధి చెయ్యడం తో పాటు ప్రభుత్వం ఆసుపత్రిని అభివృద్ధి చేస్తాం.
ఆళ్లగడ్డ నియోజకవర్గం లో పేదల కోసం టిడిపి హయాంలో 3 వేల ఇళ్లు కడితే వాటిని లబ్దిదారులకు ఇవ్వకుండా వేధించింది జగన్ ప్రభుత్వం. ఇప్పుడు సిగ్గులేకుండా టిడిపి హయాంలో నిర్మించిన ఇళ్లకి వైసిపి రంగులు వేసుకుంటున్నారు.
ఆళ్లగడ్డను అభివృద్ధి చేసిన భూమా కుటుంబాన్ని జగన్ వేధిస్తున్నాడు.
తల్లి, తండ్రి లేని పిల్లల్ని జగన్ ఇబ్బంది పెడుతున్నాడు.
త్వరలోనే మన ఆడపులి బయటకు వస్తుంది. ఎన్ని ఇబ్బందులు పెట్టినా అఖిల ప్రియ మీ కోసం పోరాడుతూనే ఉంటుంది.
మీ తరపున పోరాడుతున్న విఖ్యాత్ రెడ్డి మీద కేసులు పెట్టి వేధించారు.
టిడిపి నాయకుల్ని, కార్యకర్తల్ని వేధించిన ఏ ఒక్కరిని వదలం. అందరికి వడ్డితో సహా చెల్లిస్తాం. ఆళ్లగడ్డ లో ఉన్నా అమెరికాలో ఉన్నా తీసుకొచ్చి లోపలేస్తాం.
ఉమ్మడి కర్నూలు జిల్లాలో 40 రోజులు పాదయాత్ర చేశాను, 507 కి.మీ నడిచాను. ఇక్కడ వలసలు, బిందెలతో తాగునీటి కోసం పడుతున్న కష్టాలు నన్ను కదిలించాయి.
2014 లో ఉమ్మడి కర్నూలు జిల్లాలో టిడిపి కేవలం మూడు ఎమ్మెల్యే సీట్లు మాత్రమే గెలిచింది అయినా విమానాశ్రయం, మెగా సీడ్ పార్క్ , మెగా సోలార్ పార్క్, సిమెంట్ కంపెనీలు, మూడు వేల కోట్లతో సాగునీటి ప్రాజెక్టులు నిర్మించాం.
2019 లో ఉమ్మడి కర్నూలు ప్రజలు 14 ఎమ్మెల్యే సీట్లు, రెండు ఎంపీ సీట్లు వైసిపి కి ఇచ్చారు. కనీసం ఒక్క అభివృద్ధి కార్యక్రమం అయినా చేసారా? టిడిపి చేసిన దాంట్లో 10 శాతం కూడా చెయ్యలేదు.
కర్నూలు కి టిడిపి చేసింది ఏంటో? వైసిపి నాయకులు చేసింది ఏంటో చర్చకు సిద్ధం అని సవాల్ చేస్తే వైసిపి వాళ్లు పారిపోయారు.
2024 లో అన్ని సీట్లలో టిడిపి ని గెలిపించండి అభివృద్ధి లో ఉమ్మడి కర్నూలు ని నంబర్1 చేస్తాం.