మంగళగిరి: భారీ వర్షాల కారణంగా ముంపుకు గురైన ప్రాంతాలను పరిశీలించడానికి మంత్రి నారా లోకేష్ మంగళగిరి టౌన్‌లోని టిడ్కో గృహాలను సందర్శించారు. ఈ సందర్శనలో ఆయన మున్సిపల్ సిబ్బంది, పార్టీ నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సహాయ కార్యక్రమాలను సమీక్షించారు.
బాధితులతో మాట్లాడిన లోకేష్, వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పరిసర ప్రాంతాల్లో చేరిన నీటిని వీలైనంత త్వరగా బయటకు తోడే చర్యలను వేగవంతం చేయాలని స్థానిక అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
గతంలో టిడ్కో ఇళ్లను ఎటువంటి ప్రణాళికతో నిర్మించామో, ఆ పనులు అన్నీ పూర్తి చేసి సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రజలకు సహాయం అందించడంలో ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.