-ఈసారి ఎవరి శవం లేస్తుందోనని జనం వణికిపోతున్నారు
-రాజమౌళి జగన్ తో సినిమా తీస్తే ఆస్కార్ అవార్డు రావడం ఖాయం
-రచ్చబండ సభలో యువనేత నారా లోకేష్ వ్యంగ్యాస్త్రాలు
మంగళగిరి: 2019లో కోడికత్తి ఘటన తర్వాత బాబాయి ఎగిరిపోయారు, 2024లో గులకరాయి డ్రామాతో ఈసారి ఎవరికి మూడుతుందోనని భయపడి తల్లి విదేశాలకు వెళ్ళిపోయారు, ఇప్పుడు ఎవరి శవం లేస్తుందోనని జగన్ గురించి తెలిసిన రాష్ట్రప్రజలు భయంతో వణికిపోతున్నారని యువనేత నారా లోకేష్ ఎద్దేవా చేశారు.
మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలం గొడవర్రులో రచ్చబండ సభలో లోకేష్ మాట్లాడుతూ… జె-గ్యాంగ్ చెప్పినట్టు చేసినందుకు ఏ పాపం తెలియని దళితబిడ్డ కోడికత్తి శీనును అయిదేళ్లపాటు జైలులో పెట్టారు. తాజాగా జగన్ కు స్పెషల్ గులకరాయి తగిలింది. ఆ రాయి అలాంటి,ఇలాంటి రాయికాదు. జగన్ తోపాటు వెల్లంపల్లి రెండు కళ్లకు తగిలింది. రాయి తగిలిందని చెప్పిపుడు జగన్ తలపై వేసిన బ్యాండేజ్ సైజు రోజురోజుకు పెరిగి నిన్న అకస్మాత్తుగా మాయమైపోయింది.
రాజమౌళి జగన్ తో సినిమా తీస్తే ఆస్కార్ అవార్డు రావడం ఖాయం. సొంత తల్లి, చెల్లికి న్యాయం చేయలేనివాడు తమకు ఏం న్యాయం చేయగలడో అందరూ ఆలోచించాలి. ఇదంతా గమనించబట్టే ఇప్పుడు రాష్ట్ర ప్రజలంతా జరుగు, జరుగు జగన్ అంటున్నారు. జగన్ పని అయిపోయింది. జగన్ కు శవరాజకీయాలు అంటే బాగా ఇష్టం. 2014లో తండ్రి శవంతో, 2019లో బాబాయి శవంతో రాజకీయం చేశారు.
ఈ నెలలో సకాలంలో వృద్ధులకు పెన్షన్ ఇవ్వకుండా 32మందిని పొట్టనబెట్టుకుని రాజకీయం చేయాలని చూశారు. జగన్ డ్రామాలన్నీ రాష్ట్ర ప్రజలందరికీ అర్థమయ్యాయి. ఇక ఆయనను నమ్మడానికి ఎవరూ సిద్ధంగా లేరు. వృద్ధులకు ప్రస్తుతం 3వేలు ఉన్న పెన్షన్ ను ప్రజాప్రభుత్వం అధికారంలోకి రాగానే రూ.4వేలకు పెంచుతాం. వాలంటీర్ వ్యవస్థ ద్వారానే వారి ఇళ్లకు వెళ్లి పెన్షన్ అందించే బాధ్యత తమదని యువనేత లోకేష్ పేర్కొన్నారు.