Suryaa.co.in

Andhra Pradesh

ప్ర‌పంచ‌మే మ‌న రాష్ట్రం వైపు జాలిగా చూసేలా అధ్వానంగా మార్చేశారు

– జగన్‌పై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ సెటైర్లు

దేశమంతా ఏపీ వైపు చూసేలా చేస్తాన‌న్న జ‌గ‌న్‌రెడ్డి గారు, మూడేళ్లు పూర్తికాకుండా దేశ‌మేం ఖ‌ర్మ‌, ప్ర‌పంచ‌మే మ‌న రాష్ట్రం వైపు జాలిగా చూసేలా అధ్వానంగా మార్చేశారు. చంద్రబాబు గారి హ‌యాంలో
lkఉద్యోగావ‌కాశాలకు నెంబ‌ర్ వ‌న్ గా వున్న ఏపీని ఒక్క చాన్స్ పేరుతో వ‌చ్చిన‌ జ‌గ‌న్ నెంబ‌ర్‌ సెవెన్ కి దిగ‌జార్చారు. ఏపీ ఉద్యోగార్థుల్లో నైపుణ్యం, ఆంగ్ల ప‌రిజ్ఞానం శూన్యం అని జాతీయ నైపుణ్యాల నివేదిక‌-2022
lk1వెల్ల‌డించింది.. త‌ల‌కాయ ఎక్క‌డ పెట్టుకుంటారు జ‌గ‌న్ గారు! ఉద్యోగాల క‌ల్ప‌న అంటే మీ కుటుంబానికి, కులానికి నామినేటెడ్ ప‌ద‌వులు ఇచ్చినంత సులువు కాదు జ‌గ‌న్ రెడ్డి గారు. ప్ర‌ఖ్యాత కంపెనీలు
lk2 ర‌ప్పించాలంటే కియా వాళ్ల‌ని బెదిరించినంత ఈజీ కాదు. విభ‌జ‌న‌తో న‌ష్ట‌పోయిన ఆంధ్ర‌ప్ర‌దేశ్ పునఃనిర్మాణ‌మంటే ప్ర‌జావేదిక కూల్చినంత సులువు కాదు ముఖ్య‌మంత్రి గారూ..కళ్లు మూసుకుని  పాలు తాగుతూ నన్నెవరూ చూడలేదని పిల్లి అనుకున్నట్టు…దుబాయ్ ఎక్స్ పోలో షెల్ కంపెనీలతో డొల్ల ఒప్పందాలు కుదుర్చుకుని ఎవ్వరికీ తెలియదు అనుకున్నారు గౌరవ మంత్రి మేకపాటి గారు. ఉత్తుత్తి కంపెనీతో జరిగిన ఉత్తుత్తి ఒప్పందాన్ని, 3 లక్షలు కూడా లేని కంపెనీ పెడతామన్న 3 వేల కోట్ల పెట్టుబడి లోగుట్టుని టిడిపి బయటపెట్టింది. మంత్రి, సర్కారు పెద్దలు తేలుకుట్టిన దొంగల్లా స్పందించడంలేదు.

LEAVE A RESPONSE