టీడీపీ హయాంలో కట్టించిన ఇళ్లను వైసీపీ ఆదాయ వనరుగా మార్చుకొంది

253

– తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు

టీడీపీ హయాంలో కట్టించిన ఇళ్లను వైసీపీ ప్రభుత్వం ఆదాయ వనరుగా మార్చుకొందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. శుక్రవారం మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు ..
తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రదర్శనశాలను ఏర్పాటు చేశాం. ప్రభుత్వం ఎలాంటి చోట ఇంటి పట్టాలిచ్చిందో చూపాం. టీడీపీ హయాంలో 3,16,000 ఇళ్లను ప్రారంభించి 2,62,000 పూర్తి చేశాం. పేదవాడి ఇంటిపై కూడా వైసీపీకి ధనదాహం ఉంది. జగనన్న కాలనీల పేరుతో పేదలకిచ్చిన భూములు చెరువులను తలపిస్తున్నాయి. జగనన్న కాలనీ స్థలాలు ఇవ్వకుండా టీడీపీ కోర్టుల్లో కేసు వేసిందని చెప్పడం అబద్ధం.

పేదలకు ఇచ్చిన స్థలాలకు మేం అడ్డుపడలేదని ఆధారాలతో నిరూపించాం. వైసీపీ 3 సంవత్సరాల్లో ఐదిళ్లు మాత్రమే కట్టామని చెప్పుకోవడానికి సిగ్గుపడాలి. 1983 నుంచి 2019 వరకు ఎన్టీరామారావు, చంద్రబాబునాయుడు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఎన్ని ఇళ్లు కట్టిందో ఈ రాష్ట్ర ప్రజానికానికి తెలుసు. ఆ కాల నుంచి ఈ కాలం వరకు కూడా టీడీపీ బాసటగా ఉంది. తిరుపతి, నెల్లూరు లాంటి పట్టణాల్లో తదితర ప్రాంతాల్లో అనేక చోట్ల టిడ్కో ఇళ్లున్నాయి. పేదవాడికి టిడ్కో ఇళ్లు అవసరమని టీడీపీ భావించి ఇళ్లు నిర్మించింది.

వైసీపీకి ఎందుకింత పేదవాడి మీద కక్ష? పేదవాడికి ఇళ్లు అందించలేని దౌర్భాగ్య స్థితిలో వైసీపీ ప్రభుత్వముంది. బయట అనవసర ప్రసంగాలు చేస్తారు. టీడీపీ అడిగిన వాటికి సమాధానం చెప్పరు. పేదవాడికి ఇళ్లు అందించలేదని దౌర్భాగ్య స్థితిలో వైసీపీ ప్రభుత్వముంది. ఓట్లు వేయండి, ప్రతి సంవత్సరానికి 5 లక్షల ఇళ్లు కడతామని వైసీపీ ప్రభుత్వం అప్పుడు ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చింది. వైసీపీ మేనిఫెస్టో బైబిల్ లాంటిదని చెప్పి మేనిఫెస్టోలోని అంశాలను తుంగలో తొక్కారు.

ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తామని చెప్పావు. 3 సంవత్సరాలు పూర్తవుతుంది. ఇవ్వలేదు. కేవలం ఈ మూడేళ్లలో 5 ఇళ్లు మాత్రమే కట్టారు. 15 లక్షల ఇళ్లు ఎప్పుడు కడతారు? . వైసీపీ చెప్పేవాటిలో ఒక్కటి నిజంలేదు. ఏపీలో జగన్ 30 లక్షలమందికి పట్టాలటిచ్చారని గొప్పలు చెప్పుకున్నారు. జగనన్న కాలనీలు అని పేరు పెట్టారు. 2 సంవత్సరాల నుంచి సముద్రంలాంటి నీరున్న ప్రాంతాల్లో పట్టాలిచ్చారు. సకల సదుపాయాలతో అన్ని హంగులతో హైదరాబాద్, ముంబాయి అటువంటి సదుపాయాలతో ఇళ్లు నిర్మించి ఇవ్వాలి.

చెరువులను తలపిస్తున్న, స్మశానాలలో ఇళ్ల స్థలాలిచ్చారు. పేదవాడు గుడిశె వేసుకొని ఉండటానికి కూడా అవకాశంలేని స్థలాల్లో పట్టాలిచ్చారు. కొందరు ఎమ్మెల్యేలు, మంత్రులు పేదవాడి దగ్గర తక్కువ రేటుకు భూమి కొని అదే భూమిని ఎక్కువ డబ్బులకి ప్రభుత్వానికి ఇచ్చారు. ఇందులో 5 వేల కోట్లు అవినీతి చేశారు. పేదవారి భూములు తీసుకొని ల్యాండ్ ఎక్విజేషన్ లో ఎక్కువ డబ్బులు ఇచ్చి రూ.5 వేల కోట్లు దండుకున్నారు. పనికిరాని భూములు పేదలకిచ్చారు.
చెరువుల్లా ఉన్నా ఈ భూముల్లో ఎన్నార్జీయస్ కింద మట్టి కొప్పుకోవడానికి 5 వేల కోట్లు అవినీతి చేశారు. ఇళ్లల్లో అవినీతి చేశారు. చంద్రబాబు నాయుడికి పట్టాలివ్వడానికి ఇష్టమే. వైసీపీ మండల ప్రెసిడెంట్, జడ్పీటీసీ కేసు వేశారు. ఆధారాలతో నిరూపించాం. కేసులు వారే వేస్తారు. ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా వారే చేస్తున్నారు. చివరకు టీడీపీపై అభాండాలు వేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల మీద ఒక్క పైసా కూడా ఖర్చు చేయలేదు.

కేంద్ర ప్రభుత్వమే ఇళ్లన్నీ మంజూరు చేస్తోంది. లక్షా 80 వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇంటికి మంజూరు చేస్తోంది. అందులో లక్షా 50 వేలు క్యాష్ ఇస్తోంది. 30 వేల రూపాయలు ఎన్నార్జీయస్ లో మెటీరియల్ కాంపోనెంట్ కింద ఇచ్చి లక్షా 80 వేల రూపాయలతో ఇల్లు మంజూరు చేస్తే పేదవాడు ఎక్కడ నుంచి ఇల్లు కట్టుకోగలడు? ఇచ్చే డబ్బులు గొయ్యి కప్పుకోవడానికి కూడా సరిపోవు. వైసీపీ దౌర్భాగ్యపు పాలనలో ధరలు విపరీతంగా పెరిగాయి.

2019 వరకు 200 రూపాయలు వున్న సిమెంటు బస్తాను 400కు పెంచారు. టీడీపీ హయాంలో ఇసుక ఉచితంగా విచ్చలవిడిగా దొరికేది. నేడు ఒక లారీ ఇసుక 50 వేల రూపాయలు. ఐరన్ 42 వేలు టన్ను ఉండేది. నేడు టన్ను 70 వేలకు పెరిగింది. పేదవాడు ఇల్లు ఎలా కట్టుకోగలడనే విషయాన్ని వైసీపీ ప్రభుత్వం ఆలోచించడంలేదు. వైసీపీ ప్రభుత్వం పేదవాడిని మోసం, పచ్చి దగా చేస్తోంది. ఏ వ్యక్తిని కదిలించిన ప్రభుత్వం పై దండయాత్ర చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎంతమందికి పట్టాలిచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలి.

ఒక్క ఇంటికి ఒక్క పైసా ఇచ్చిన సందర్భంలేదు. కేంద్రం ఇచ్చిన డబ్బునే రాష్ట్రం ఇదిల్చీ కాలయాపన చేయడం తప్ప ఇంకోటి లేదు. ఈ దగా ప్రభుత్వం. సంవత్సరానికి 5 లక్షల ఇళ్లు కడతామన్నారు. 3 సంవత్సరాల్లో ఐదిళ్లే కట్టారు. ఇచ్చిన పట్టాల్లో ఒక పట్టాపై ఒక ఇళ్లు కూడా నిర్మించలేదు.
లక్షల కోట్ల రూపాయలతో కట్టిన టిడ్కో బిల్డింగ్ లలో పిచ్చి మొక్కలు మొలుస్తున్నాయి. ఏవైతే ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయో వాటిని ప్రారంభించి పేదవారికిస్తే కొంతమందికైనా ఉపయోగపడతాయని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఈ సందర్భంగా పేర్కొన్నారు.