Suryaa.co.in

Political News

నిర్వాసితుల నినాద‌మై`నారా`..

క‌న్నీళ్లు తుడిచేందుకు క‌దిలొచ్చాడు.. నిర్వాసితుల పోరుకి నినాద‌మ‌య్యాడు..
పోరాడితే మ‌హా అయితే అరెస్టు చేస్తారు. అంత కంటే ఇంకేం చేస్తారని తెగింపు ప్రద‌ర్శించాడు.
క‌లిసి పోరాడ‌దామంటూ పోల‌వ‌రం నిర్వాసితుల గుండెల నిండా ధైర్యం నింపాడు.
తెలుగుదేశం పార్టీ జాతీయ‌ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్వాసితుల క‌ష్టాలు తెలుసుకునేందుకు ఆయా ప్రాంతాల్లో మంగ‌ళ‌వారం, బుధ‌వారం చేసిన ప‌ర్య‌ట‌న విజ‌య‌వంతంగా ముగిసింది.
భ‌ద్రాద్రి సీతారామ‌య్య‌ని ద‌ర్శించుకుని నిర్వాసిత గ్రామాల సంద‌ర్శ‌న‌కు బ‌య‌లుదేరారు నారా లోకేష్‌. భ‌ద్రాచ‌లంలో నారా లోకేష్ అడుగిడిన నుంచీ తూర్పుగోదావ‌రి జిల్లాకి వెళ్లేంత వ‌ర‌కూ టిడిపి నేత‌లు, కార్య‌క‌ర్త‌లు పోటెత్తారు. మంగ‌ళ‌వారం ఉద‌యం తూర్పుగోదావ‌రి జిల్లా కూన‌వ‌రం మండ‌లం టేకుల‌బోరు, వీఆర్ పురం మండ‌లం శ్రీరామ‌గిరి, చింతూరుల‌లో ప‌ర్య‌టించి నిర్వాసితుల స‌మ‌స్య‌లు అడిగి తెలుసుకున్నారు. బుధ‌వారం రంప‌చోడ‌వ‌రం చేరుకుని ప్ర‌ధాన కూడ‌లిలో ప్ర‌జ‌ల్ని ఉద్దేశించి ప్ర‌సంగించారు. మ‌ధ్యాహ్నం దేవీప‌ట్నం మండ‌లం, పెద‌వేంప‌ల్లి, ఇందుకూరు, ముసిరిగుంట గ్రామంలో పోల‌వ‌రం నిర్వాసితుల్ని క‌ష్టాలు విని తీవ్ర ఆవేద‌న‌కి గుర‌య్యారు.
సాయంత్రం గోక‌వ‌రం మండ‌లం క్రిష్ణునిపాలెంలో నిర్వాసితులతో భేటీ అయి వారి స‌మ‌స్య‌లు సావ‌ధానంగా విన్నారు. మొత్తం ప‌ర్య‌ట‌న‌లో నిర్వాసితులు త‌న దృష్టికి తీసుకొచ్చిన స‌మ‌స్య‌ల‌న్నీ విన్నాక ప్ర‌భుత్వం ముందు కొన్ని డిమాండ్లు నారా లోకేష్ పెట్టారు.
నిర్వాసితులు కొత్త డిమాండ్లు ఏమి ప్రభుత్వాన్ని కోరడం లేద‌ని, జగన్ రెడ్డి ఇచ్చిన హామీలు నేరవేర్చాలని మాత్రమే అడుగుతున్నార‌ని, అవి కూడా నెర‌వేర్చేందుకు జ‌గ‌న్‌రెడ్డి ప్ర‌భుత్వం సిద్ధంగా లేక‌పోవ‌డం విచార‌క‌ర‌మ‌న్నారు.
నిర్వాసితుల డిమాండ్లు
2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలి.
భూమికి భూమి,పోడు భూమికి పట్టా ఇవ్వాలి.
18 ఏళ్ళు నిండిన వాళ్లకి ఇస్తా అన్న ప్యాకేజి తక్షణమే ఇవ్వాలి
పది లక్షల ప్యాకేజి,ఎకరానికి రూ.1.15 లక్షలు ఇచ్చిన వారికి అదనంగా 5 లక్షలు ఇవ్వాలి.
25 రకాల వసతులతో ఇళ్ల నిర్మాణం తక్షణమే పూర్తి చెయ్యాలి.


ప్ర‌భుత్వానికి సూటి ప్ర‌శ్న‌లు
నిర్వాసిత గ్రామాల్లో ద‌య‌నీయ ప‌రిస్థితులు చూసి చ‌లించిపోయిన నారా లోకేష్‌…అంతా క‌లిసి స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి ఉద్య‌మిద్దాం అని పిలుపునిచ్చారు. మ‌హా అయితే త‌న‌ను అరెస్ట్ చేస్తార‌ని, నిర్వాసితుల స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం తాను జైలుకెళ్ల‌డానికైనా సిద్ధ‌మేన‌ని ప్ర‌క‌టించారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌భుత్వానికి కొన్ని ప్ర‌శ్న‌లు సంధించారు లోకేష్‌.
నిర్వాసితుల‌కు ప్యాకేజీ అందించేందుకు ఈ రోజు వ‌ర‌కూ అర్హుల లిస్ట్ ఎందుకు ప్రకటించడం లేదు.
పునరావాస కాలనీల్లో క‌నీసం తాగునీటి సౌక‌ర్యం కూడా క‌ల్పించ‌లేక‌పోవ‌డానికి కార‌ణం ఏంటి?
కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 4 వేల కోట్లను నిర్వాసితులకు ఇవ్వ‌కుండా ఎందుకు మ‌ళ్లించారు?
25 వసతులతో కాలనీలు కడతామ‌ని హామీ ఇచ్చిన కాల‌నీలో ఒక్క ఇల్ల‌యినా పూర్తి అయ్యిందా?
18 ఏళ్ళు నిండిన వారికి ప్యాకేజీ అన్నారు కానీ ఇవ్వ‌లేదు ఎందుకు?
ఇచ్చిన హామీలు నెర‌వేర్చ‌కుండా జగన్ రెడ్డి గిరిజనుల్ని జలసమాధి చేస్తా అంటే ప్ర‌తిప‌క్షంగా తెలుగుదేశం పోరాటం తీవ్రం చేస్తుంద‌ని హెచ్చ‌రించారు. చివ‌రి నిర్వాసితుడు వ‌ర‌కూ ఆదుకునేలా ప్ర‌భుత్వంపై ఒత్తిడి తెస్తామ‌న్నారు.
తాను ప‌ర్య‌ట‌నకి వ‌స్తున్నాన‌ని గ్రామాల్లో పోలీసుల్ని పంపి నిర్వాసితుల్ని త‌ర‌లించేశార‌ని, ద‌మ్ముంటే మంత్రులు నిర్వాసిత గ్రామాల్లో ప‌ర్య‌టించాల‌ని నారా లోకేష్ స‌వాల్ విసిరారు. నెర‌వేరని హామీలిచ్చిన గాలి ముఖ్య‌మంత్రిని గాలోడు అని సంబోధించి క‌ల‌క‌లం రేపారు. త‌న‌పై విమ‌ర్శ‌లు మాని, నిర్వాసితుల్ని ఆదుకోవ‌డంపై శ్ర‌ద్ధ పెట్టాల‌ని ప్ర‌భుత్వానికి సూచించారు.

– చైతన్య

LEAVE A RESPONSE