Suryaa.co.in

Andhra Pradesh

నారాయణ కుమార్తెలు,అల్లుడు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌‌పై విచారణ

అమరావతి : పదవ తరగతి ప్రశ్నాపత్రం లీకేజి కేసులో మాజీ మంత్రి నారాయణ కుమార్తెలు శరణి, సింధూర, అల్లుడు పునీత్‌ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌‌పై విచారణ జరిగింది. మూడు రోజుల క్రితం ముందస్తు బెయిల్‌ కోసం హౌస్‌మోసన్‌ పిటిషన్‌ దాఖలైంది. తొందరపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. హౌస్‌మోషన్‌ పిటీషన్‌‌పై బుధవారం పూర్తిస్థాయి విచారణ జరగనుంది. పిటిషనర్ల తరపున సీనియర్‌ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరపున పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ వాదనలు వినిపించారు. వాదనలు విన్న అనంతరం ఉత్తర్వులు కోసం కేసును హైకోర్టు రేపటికి వాయిదా వేసింది.

LEAVE A RESPONSE