Suryaa.co.in

Andhra Pradesh

వాహనదారుడుని చితకబాదిన నర్సీపట్నం పోలీసులు

నర్సీపట్నం: వాహనాల తనిఖీలో భాగంగా ఉదయం నుండి బలిఘట్టం ప్రాంతంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. వాహనదారుడు వద్ద అన్ని రికార్డులు ఉన్నా, ఏదో ఒక నెపంతో వాహనదారులు ఇబ్బందులు పెడుతున్నట్లు వాహనదారులు వాపోతున్నారు.
ఇదే క్రమంలో.. అటుగా ఫ్యామిలీతో వెళుతున్న వాహనదారుడుని, ఒక పోలీసు చేయి చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది .తలపై హెల్మెంట్ ఉన్నా,


అతడిని ఎందుకు చితక బాదుతున్నాడో తెలియని వైనం. ఒక వేళ రికార్డులు లేకపోతే చలానా విధించాలి. కానీ ఇలా తన భార్య ముందే కొట్టడం ఏమిటో అని పలువురు వాపోతున్నారు. ఇది ఇలా ఉండగా ఆ వీడియో తీసిన వ్యక్తి పై గంజాయి కేసు పెడతామని పోలీసులు ఆ వ్యక్తి కోసం వెతకడం మొదలుపెట్టారు అని విశ్వసనీయ సమాచారం.

– అవధానుల శ్రీనివాస శాస్త్రి

LEAVE A RESPONSE