Suryaa.co.in

National

సౌర తుఫాను వచ్చే అవకాశం నాసా వెల్లడి

– సౌర తుఫాను వలన ఎలర్జీలు పెరిగే అవకాశం
– సూపర్ స్పెషలిస్ట్ ఇమ్యునాలజిస్ట్ డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్ వెల్లడి

సూర్యుడి నుండి వెలువడే సౌర తుఫాను వచ్చే అవకాశం ఉంది అని నాసా వెల్లడించిన విషయం విధితమే. ఈసారి జరగబోయే సౌర తుఫాను భూమి మీద కేంద్రీకృతం అయ్యే అవకాశం కూడా ఉందని నాసా వర్గాలు తెలిపాయి.

Earth/ భూమి ఉపరితలంలోని ఎట్మాస్ఫియర్, కొంతవరకు వాటి సౌర తుఫాను ప్రభావాన్ని భూమిపై నివారించి – జీవరాసులని కాపాడే అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు.

దీనిపై ఎలర్జీ సూపర్ స్పెషలిస్ట్ ఇమ్యునాలజీ డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్ మాట్లాడుతూ, 1859 జరిగిన సౌర తుఫాను ప్రభావం వలన ఆరోగ్య సమస్యలు కొన్ని కనుక్కోవడం జరిగిందని, సౌర తుఫాను అత్యధికముగా X ray, UV Rays & Gamma Rays భూమిపై తాకుతాయని, దీని ప్రభావము మానవ వ్యాధి నిరోధక శక్తి, ఎలర్జీల పై ఉంటుందని వెల్లడించారు.

Gamma Radiation మరియు UV Radiation ఎవరైతే ఎదుర్కొంటారో, ఎక్స్పోజ్ అవుతారు, వారికి చర్మము పై విపరీతమైన ఎలర్జీలు పెరిగే అవకాశం ఉందని డాక్టర్ వ్యాకరణం తెలిపారు. Gamma రేడియేషన్

వలన ఆస్తమా రోగులకి ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంటుందని, చర్మం ఎండిపోయ్యే అవకాశం ఉంటుందని, వివిధ రకమైన ఎలర్జీలు పెట్రేగి అవకాశం ఉంటుందని వెల్లడించారు.

ఎవరు జాగ్రత్తపడాలి?
*అలర్జిక్ అరటికెరియా- skin Allergy
(విపరీతముగా చర్మంపై దురదలు, దద్దుర్లు)
*స్కిన్ ఫోటో సెన్సిటివిటీ – skin burns
*ఊపిరితిత్తుల్లో శ్వాస పీల్చుకునే గొట్టాలు మూసుకొని ఆస్తమా ఇబ్బందులు ఉన్నవారు బయటకి వెళ్లకుండా ఇంట్లో ఉండడం శ్రేయస్కరమని సలహా ఇచ్చారు.

ఏమి జాగ్రత్తలు తీసుకోవాలి??
* సాధ్యమైనంతవరకు ఇంట్లో ఉండడానికి ప్రయత్నించండి.
* చర్మంపై సన్ స్క్రీన్ లోషన్ తప్పనిసరిగా రాసుకో వలెను.
* అలర్జీ వ్యాధులతో బాధపడుతున్న వారు కొద్దిగా ఎక్కువగా మంచినీరు తాగవలెను. శరీరంలో నీటి శాతం తగ్గినట్లు అయితే, దాని ప్రభావం వలన చర్మము ఎండిపోయే విధంగా ఏర్పడుతుందనిపడుతుందని, అప్పుడు అలర్జీలు విపరీతంగా పెరుగుతాయి.
* ఆస్తమా బాధతో ఉన్నవారు, వైద్యుల సలహా మేరకు ఖచ్చితముగా ఇన్హేలర్స్/ ఆస్తమా మందులు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు.
* అత్యవసర పరిస్థితుల్లో ఇంట్లో ఉండకుండా,వైద్యులని వెంటనే సంప్రదించాల్సిన అవసరం ఉంది.

ఎన్ని రోజుల వరకు సౌర తుఫాను ప్రభావం?
సౌర తుఫాను భవించిన ఎడల, ఇది సుమారు 6 నుంచి 8 గంటల వరకు భూమిపై దీని ప్రభావం ఉంటుంది. అంటే సుమారు 13th, 14th, 15th july 2023 తారీకు వరకు ఎలర్జీలు పెరుగుతున్నాయా లేదా గమనించుకో అవసరం ఉంది.

-డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్
పల్మనాలజిస్ట్,అలర్జీ సూపర్ స్పెషలిస్ట్,స్లీప్ డిజార్డర్స్ స్పెషలిస్ట్.
నేషనల్ టోల్ ఫ్రీ నెంబర్ : 1800-425-0095.

LEAVE A RESPONSE