రాష్ట్ర ప్రభుత్వం సినిమా టికెట్ల ధరల విషయంలో ఇచ్చిన జీవో 35ను నిలిపేయాలని నిర్మాత నట్టి కుమార్ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాథ్ రాయ్ ఈ అంశంపై విచారణ జరిపారు.సినిమా టికెట్ల ధరల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, ఈ ఏడాది ఏప్రిల్ 8న ఇచ్చిన జీవో 35 అమలు కోసం నిర్మాత, ఎగ్జిబిటర్ నట్టి కుమార్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ ఏడాది ఆగస్టు 5న తాను ఇచ్చిన వినతిని పరిగణనలోకి తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు.
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాథ్ రాయ్ ఈ వ్యాజ్యంపై విచారణ జరిపి .. జీవో 35, ఏపీ సినిమాలు (క్రమబద్ధీకరణ) చట్టంలోని సెక్షన్లు 9,10,11 లకు అనుగుణంగా పిటిషనర్ ఇచ్చిన వినతిపై నిర్ణయం తీసుకోవాలని హోంశాఖ ముఖ్యకార్యదర్శి, విశాఖపట్నం సంయుక్త కలెక్టర్, అనకాపల్లి ఆర్డీవోను ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చారు.