పారిశ్రామిక వేత్తలకు అవసరమైన సహాయ సహకారాలు అందించడానికి ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని సీఎం జగన్ అన్నారు. విజయనగరం జిల్లా ఎస్.కోట సమీపంలో ఎంఎస్ఎంఈ పార్కు అభివృద్ధికోసం అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నామని నవీన్ జిందాల్ సీఎంకు వెల్లడించారు. వచ్చే నెలలో దీని శంకుస్థాపకు సన్నద్ధమవుతున్నామని తెలిపారు. సౌరవిద్యుత్ రంగానికి సంబంధించి రాష్ట్రంలో పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నామని జిందాల్ సీఎంకు తెలిపారు.