Suryaa.co.in

Editorial

ఏపీలో ఎన్డీఏ కూటమిదే హవా

– కూటమికి 19 నుంచి 23 ఎంపీ సీట్లు
– వైసీపీకి 2-6 సీట్లు
– నంద్యాల, తిరుపతి, ఒంగోలు, అనంతపూర్, హిందూపూర్, రాజంపేటలో నువ్వా-నేనా
– స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ సర్వే ఫలితాలు
– తెలంగాణ ఎన్నికల్లో నిజమైన సంస్థ సర్వే ఫలితాలు
( అన్వేష్)

అంతా అనుకున్నట్లే జరుగుతోంది. అందరి అంచనాలు నిజమవుతున్నాయి. ఏపీలో రానున్న అసెంబ్లీ,పార్లమెంటు ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ-జనసేన ఉన్న ఎన్డీఏ కూటమికే ప్రజలు పట్టం కట్టబోతున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో 19 నుంచి 23 సీట్లతో కూటమి హవా కొనసాగుతుందని ప్రముఖ సర్వే సంస్థ స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ వెల్లడించింది.

నిజానికి అనేక జాతీయ సర్వే సంస్థలు, జాతీయ మీడి యా సంస్థలు ఎన్డీఏ కూటమి 18 సీట్లు సాధించటం పక్కా అని గత నెలలోనే ప్రకటించాయి. ఇప్పుడు స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ సంస్థ మరొక అడుగు ముందుకేసి.. కూటమి 23 సీట్ల వరకూ సాధించే అవకాశం ఉందని వెల్లడించింది. దీనితో ఏపీలో కూటమి హవా కొనసాగుతోందని స్పష్టమవుతోంది. వైసీపీ 2 నుంచి 6 సీట్లకు పరిమితం కావచ్చని పేర్కొంది.

కాగా అసెంబ్లీ స్థానాల్లో సైతం కూటమి విజయవిహారం చేస్తుందని జాతీయ సర్వే సంస్థలు ఇప్పటికే వెల్లడించాయి. కొన్ని సంస్థలు ఎన్డీఏ కూటమి 135 సీట్లు సాధిస్తుందని వెల్లడించగా, మరికొన్ని 150 సీట్ల వరకూ సాధిస్తుందని పేర్కొన్నాయి. కూటమి ఏర్పడక ముందు.. టీడీపీ ఒంటరిగా 100 సీట్లు సాధిస్తుందని మరికొన్ని సర్వే సంస్థలు ప్రకటించిన విషయం తెలిసిందే.

కాగా.. తాజాగా స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ సర్వేలో నంద్యాల, తిరుపతి, ఒంగోలు, అనంతపూర్, హిందూపూర్, రాజంపేటలో ఫలితాలు నువ్వా-నేనా అన్నట్లు ఉంటాయని వెల్లడించింది.

ఇటీవలి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సైతం ఈ సంస్థ వెల్లడించిన ఫలితాలు నిజమయ్యాయి. కాంగ్రెస్ 59-67, బీఆర్‌ఎస్ 36-44, బీజేపీ 7-9, ఇతరులు 6-8 సీట్లు సాధిస్తాయని స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ వెల్లడించగా, ఎన్నికల ఫలితాలు అదే రుజువుచేయడం విశేషం. ఇప్పుడు ఏపీలో కూడా, ఈ సంస్థ వెల్లడించిన సర్వే ఫలితాలు నిజమవడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

LEAVE A RESPONSE