Suryaa.co.in

Andhra Pradesh

విశాఖ జాబ్‌మేళాలో దాదాపు 25 వేల ఉద్యోగాలు

-ఇప్పటికే 77 వేల ఉద్యోగార్థులు రిజిస్ట్రేషన్‌
-మొత్తం 206 కంపెనీల రాక. పక్కాగా ఏర్పాట్లు
-నేడు, రేపు (శని, ఆదివారాలు) ఏయూలో జాబ్‌మేళా
-అవసరం అయితే సోమవారం కూడా కార్యక్రమం
-విశాఖపట్నం ఆంధ్రా యూనివర్సిటీ, వైవీఎస్‌ మూర్తి -ఆడిటోరియమ్‌లో వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన -కార్యదర్శి, పార్టీ అనుబంధ విభాగాల ఇంఛార్జ్‌ వి.విజయసాయిరెడ్డి ప్రెస్‌మీట్‌:

విశాఖపట్నం:ప్రెస్‌మీట్‌లో వి.విజయసాయిరెడ్డి ఇంకా ఏం చెప్పారంటే..:
విద్యతోనే విజ్ఞానం–ఉద్యోగం:
గౌరవ సీఎం వైయస్‌ జగన్‌ గత మూడేళ్లుగా వినూత్న పథకాలు అమలు చేస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలే కాకుండా, నూతన విద్యా విధానాన్ని కూడా అమలు చేస్తున్నారు. నాడు–నేడు కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలలను పూర్తిగా మార్చేస్తున్నారు. ఆ విధంగా విద్యా ప్రమాణాలు పెంచుతున్నారు.

విద్య అనేది విజ్ఞానాన్ని పెంచుతుంది. దాంతో ఉద్యోగ అవకాశాలు కూడా పెంచాలన్నది సీఎంగారి లక్ష్యం. అందుకే విద్యా సంస్థలను పారిశ్రామిక, సేవా రంగాలకు అనుసంధానం చేస్తున్నారు. గ్రాస్‌ ఎన్‌రోల్‌మెంట్‌ రేషియో (జీఈఆర్‌)ను 36 శాతం నుంచి 50 శాతానికి పెంచే విధంగా కొత్త కోర్సులు, నూతన విద్యాలయాలు ప్రారంభించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

ఉద్యోగాల కల్పన–సామాజిక బాధ్యత:
మూడేళ్ల కాలంలో సీఎం వైయస్‌ జగన్‌ 4 లక్షలకు పైగా ఉద్యోగాలు ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే కాకుండా, ప్రైవేటు రంగంలో కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం జాబ్‌మేళాలు ప్రారంభించాం. తొలుత ఈ కార్యక్రమాన్ని తిరుపతిలో నిర్వహించాం. అక్కడ 5 వేల ఉద్యోగావకాశాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంటే, 7 వేలకు పైగా ఉద్యోగాలు వచ్చాయి. ఒక సామాజిక బాధ్యతగా వైయస్సార్‌ కాంగ్రెస్‌ ఈ జాబ్‌మేళా నిర్వహిస్తోంది.

విశాఖ జాబ్‌మేళా–ఏర్పాట్లు:
విశాఖలో శని, ఆదివారాలు (23, 24 తేదీలు) ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ 206 కంపెనీలు రిజిస్టర్‌ చేసుకున్నాయి. అవసరం అయితే, సోమవారం కూడా నిర్వహిస్తాం. ఇక్కడ 77 వేల మంది
vzg2 ఉద్యోగార్థులు రిజిస్టర్‌ చేసుకున్నారు. 23,935 ఖాళీలు ఇక్కడ భర్తీ చేయబోతున్నాం. దాదాపు 25 వేల ఉద్యోగాలు. అంటే కుటుంబంలో నలుగురిని లెక్క వేసుకున్నా, దాదాపు లక్ష మంది ముఖాల్లో చిరునవ్వులు చూడబోతున్నాం.

206 కంపెనీలకు 206 రూమ్‌లు కేటాయించాం. ప్రతి రూమ్‌ వద్ద ఆ కంపెనీకి సంబంధించి పూర్తి వివరాలు ప్రదర్శిస్తారు. ఏయే ఉద్యోగాలు, ఏయే అర్హతలు కావాలన్నది రూమ్‌ దగ్గర స్పష్టంగా ప్రదర్శించడం జరుగుతుంది. ప్రతి బ్లాక్‌లో వేర్వేరుగా ఫార్మా, ఐటీ, బీపీఓ, బ్యాంకింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, టెక్స్‌టైల్స్, ఇన్సూరెన్స్, మార్కెటింగ్‌ వంటి తొమ్మిది విభాగాలుగా విభజించి, ఆ రూమ్‌లు కేటాయించాం. ఇందుకోసం 13 భవనాల్లో 206 గదులు సిద్దం చేయడం జరిగింది.

క్యూఆర్‌సీ (క్విక్‌ రెస్పాన్ప్‌ కోడ్‌) ద్వారా విద్యార్థులు తమ అర్హతలకు తగిన భవనాన్ని ఎంపిక చేసుకుని అక్కడికి వెళ్లాల్సి ఉంటుంది. ప్రతి భవనం దగ్గర హెల్ప్‌ డెస్క్‌లు ఉంటాయి. అక్కడ మీకు కావాల్సిన పూర్తి సమాచారం ఇస్తారు. కియోస్క్‌లు కూడా ఉంటాయి. వాటి ద్వారా కూడా విద్యార్థుల పని సులభం అవుతుంది.

ఎండలు బాగా ఉన్నాయి కాబట్టి, ముందు జాగ్రత్తగా మూడు వైద్య బృందాలు ఏర్పాటు చేస్తున్నాం. విద్యార్థులకు మంచినీళ్లు, నిమ్మరసం అందుబాటులో ఉంచుతున్నాం. మహిళలు, గర్భిణిలు వస్తే వారికి ఇబ్బంది కలగకుండా చూస్తాం. ఒక భవనం నుంచి మరో భవనం వద్దకు వెళ్లడం కోసం ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌ ఏర్పాటు చేశాం.

ఇక్కడకు వచ్చిన 206 కంపెనీలకు ఒకొక్కరికి 4గురు వలంటీర్లు, ప్రతి భవనానికి 5గురు టీచర్లను నియమించాం. ఆ మేరకు 860 మంది వలంటీర్లు ఇక్కడ సేవలందించనున్నారు. అవసరం అయితే సోమవారం కూడా కార్యక్రమం నిర్వహించి 30 వేల మందికి ఉద్యోగాలు వచ్చేలా ప్రయత్నిస్తాం.

అందరి సహకారం:
ప్రతిదీ ఒక క్రమ పద్ధతిలో చేస్తూ, కార్యక్రమంలో ఏ ఒక్కరికి ఏ మాత్రం అసౌకర్యం కలగకుండా వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పని చేస్తోంది. ఇందుకు ఆంధ్రా యూనివర్సిటీ కూడా సహాయ సహకారం అందిస్తోంది. వర్సిటీ వీసీ డాక్టర్‌ ప్రసాదరెడ్డి గారితో పాటు, మంత్రి అమర్‌నాథ్, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఈ కార్యక్రమం కోసం ఎంతో కృషి చేస్తున్నారు.

ఎన్ని ఇంటర్వ్యూలకైనా హాజరు:
ఇక్కడికి చాలా పెద్ద కంపెనీలు వస్తున్నాయి కాబట్టి, విద్యార్థులు కావాలంటే అయిదారు రెస్యూమ్స్‌ తెచ్చుకోవచ్చు. వారు కోరుకున్న ఉద్యోగం కోసం ప్రయత్నించవచ్చు. ఆ మేరకు ఇంటర్వ్యూలకు హాజరు కావొచ్చు. ప్రతి రూమ్‌ దగ్గర అక్కడ ఏయే ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. అర్హతలు ఏం కావాలి? ఎక్కడ ఆ ఖాళీలున్నాయి? ఎంత మందిని భర్తీ చేస్తారన్న అన్ని పూర్తి వివరాలు ప్రదర్శిస్తారు.

ఎప్పటికప్పుడు నియామకపత్రాలు:
జాబ్‌మేళా కార్యక్రమాన్ని లాంఛనంగా శనివారం ఉదయం 9 గంటలకు ప్రారంభిస్తాం. 15 నిమిషాల్లోనే దాన్ని పూర్తి చేస్తాం. అయితే అప్పటికే ఉదయం 8.30 గంటలకే ఇంటర్వ్యూలు మొదలై సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయి. ఉద్యోగాలకు ఎంపికైన వారికి ప్రతి రోజూ సాయంత్రం 4 నుంచి 7 గంటల వరకు స్నాతకోత్సవ మందిరంలో నియామక పత్రాలు ఇవ్వడం జరుగుతుంది.
ఈ ఇంటర్వ్యూలకు దాదాపు 50 వేల మంది హాజరు కావొచ్చు. దాదాపు 25 వేల మందిని నియమించవచ్చు. అంటే ప్రతి ఇద్దరిలో ఒకరు ఎంపిక అవుతారు.
ఎక్కడైనా ఆయా సంస్థల ఉన్నతాధికారుల అనుమతి కావాల్సి వస్తే, ఆ విద్యార్థులకు మాత్రం ఒక వారం రోజుల్లో నియామక పత్రాలు పంపడం జరుగుతుంది.

ఇది నిరంతర కార్యక్రమం:
ఈ జాబ్‌మేళా నిరంతరం కొనసాగుతుంది. కాబట్టి ఉద్యోగాలు రాని వారు నిరాశ చెందవద్దు. ఇప్పటికే 77 వేల మంది నమోదు చేసుకున్నారు కాబట్టి, ప్రస్తుతానికి రిజిస్ట్రేషన్లు ఆపాం. వీలైనంత మందికి ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య ఉండకూడదన్నదే సీఎం వైయస్‌ జగన్‌ లక్ష్యం. అందుకే ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. అందుకే
ఇక్కడ అవసరమైతే సోమవారం కూడా కార్యక్రమం నిర్వహిస్తామని విజయసాయిరెడ్డి వివరించారు.

LEAVE A RESPONSE