Suryaa.co.in

Andhra Pradesh

వరద బాదితులకు జిల్లా నుండి నిత్యావసర వస్తువులు

– జిల్లా టిడిపి అధ్యక్షులు తిక్కారెడ్డి వెల్లడి

కర్నూలు: గత నాలుగు రోజుల నుండి విజయవాడ లో వరదల కారణంగా జలమయమైన ప్రాంతాలలోని బాదితుల సహాయార్థము కర్నూలు జిల్లా తెలుగుదేశంపార్టీ అధ్వర్యంలో రెండు మూడు రోజులలో వారికి కావలసిన నిత్యావసర వస్తువుల కిట్లను అందజేసేందుకు నిర్ణయం తీసుకున్నామని కర్నూలు పార్లమెంట్ తెలుగుదేశంపార్టీ అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి తెలియజేశారు.

ఈ రోజు వారు జిల్లా పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, ఆకెపోగు ప్రభాకర్, నాగేశ్వరరావుయాదవ్, ఇతర నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన పత్రికా, మీడియా ప్రతినిధుల సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు.

జిల్లాలోని మంత్రులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, మాజీ యం.యల్.ఎ.లు, మాజీ యం.పి.లు, మాజీ యం.యల్.సి.లు పార్టీలో వివిధ హెూదాలలో ఉన్న నాయకులు వరదసహాయక కార్యక్రమాలలో పాలుపంచుకునేలా జిల్లా పార్టీ ద్వారా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ప్రతి నియోజకవర్గం నుండి 1000 వరకు కిట్లను అందజేసేందుకు కృషి చేస్తామన్నారు.

LEAVE A RESPONSE