– మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ
రాజమహేంద్రవరం: 25 ఏళ్లు రాజమండ్రితో అనుభవం ఉంది. ఈరోజు నా ఉన్నత స్థితికి ఈప్రాంతము తో అనుభవం మరువ లేనిది. స్వంత మనుషుల మధ్య ఉండడం ఆనందంగా ఉంది. రాజమండ్రి ప్రజలు కొత్త దనం కోరుకుంటారు. పై స్థాయిలో ఉన్నవారు సమాజానికి మేలు చేయాలని ప్రతి ఒక్కరూ ఆలోచన చేశారు. కందుకూరి వీరేశలింగం పంతులు గారు మార్గదర్శకంగా నిలిచిన మహానుభావుడు, తొలి వితంతు వివాహం జరిగిన ప్రాంతం ఇది.
సివిల్స్ తొలి మూడు ర్యాంకులు అమ్మాయలు సాధించడం ఒక ఉదాహరణ. ఇందులో సమాజం ప్రోత్సాహం కాదనలేని వాస్తవం. అయినా ఇప్పటికీ వికృతమైన పద్దతిలో మహిళలు పై అత్యాచారాలు పెరిగాయి. 25 శాతం నేరాలు పెరిగాయి. వివాహాలు విఫలం అవ్వడం ఆందోళన కలిగిస్తున్న అంశమని, ప్రేమా, పెద్దలు కుదిర్చిన వివాహమా అనేది సంబంధం లేకుండా జరుగు తున్నాయన్నారు. కుటుంబ వ్యవస్థలో 80 శాతం గృహ హింస కేసులు జరుగుతున్న యని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా కొత్త వరవడికి శ్రీకారం చుట్టారని తెలిపారు. గతంలో మహిళలకు జరిగిన దాడులు వ్యక్తి గతం అనే వారు, మన ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా ఆ సమస్యపై స్పందిస్తూ, మంత్రులు కూడా బాధితులను కలవడం జరుగుతోంది. పోలీసులు కూడా స్పందిస్తున్నారు. మహిళలు పేరున ఇళ్ళ పట్టాలు ఇవ్వడం మరో ముందడుగు. సమాజానికి పిలుపు నిస్తున్నాను.. మహిళ బయటకి వచ్చి పిర్యాదు చేస్తే ప్రభుత్వం చర్యలు తిసుకొగలదన్నారు. రాజస్థాన్ లో ఒక ఘటన ఉటంకిస్తూ , స్వచ్ఛంద సంస్థ గ్రామానికి త్రాగునీరు వ్యవస్థ ఏర్పాటు చేస్తే ఆ గ్రామ మహిళలూ వ్యతిరేకించారు.
మూలాల్లోకి వెళితే నీటి కోసం వెళ్ళే సమయంలో మా బాధలు కోసం మాట్లాడు కుంటున్నాము. ఇప్పుడు ఆ అవకాశం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు యొక్క ఇబ్బందులు తెలుసుకుని, వారి పక్షాన నిలబడి పరిష్కారం చూపేందుకు సమాజం ఆలోచన చేయాలి.. మహిళలు సమస్యలు పట్ల సరైన అవగాహన స్పందించాలని సామాజిక చైతన్య నగరం రాజమహేంద్రవరం నుంచి పిలుపు నిస్తున్నానని పేర్కొన్నారు .
మహిళలు కొన్ని హక్కులు సాధించారంటే , మహిళా కమిషన్ ఏర్పడింది అంటే ఎందరో పోరాటాలు చెయ్యడం, స్పందించడం సామాజిక ఉద్యమంతోనే సాధ్యం అయిందని పేర్కొన్నారు. మహిళలు ఉద్యోగాలు చేస్తున్నా, జీతం భర్త చేతుల్లో పెట్టడం చూస్తున్నాము . ఈ సమావేశంలో కృష్ణ మోహన్, పార్థసారథి, తదితరులు పాల్గొన్నారు.