Suryaa.co.in

Telangana

నీరా కేఫ్ నిర్మాణ పనులు పూర్తి

రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు, యువజన సర్వీసుల శాఖల మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ లోనే తన క్యాంపు కార్యాలయంలో ఎక్సైజ్ & టూరిజం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నీరా పాలసీలో భాగంగా నీరా ప్రాసెసింగ్, బాటిలింగ్ లపై అధికారులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో టూరిజం ఎండి మనోహర్, ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు డేవిడ్ రవికాంత్ దత్త రాజ్ గౌడ్ చంద్రయ్య ES లు సత్యనారాయణ, రవీందర్రావు, అరుణ్ కుమార్, విజయ్ భాస్కర్ తదితర అధికారులు పాల్గొన్నారు.

అనంతరం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నీరాపాలసిలో భాగంగా నిర్మించిన నీరా కేఫ్ నిర్మాణ పనులు పూర్తయిన సందర్భంగా ప్రారంభించడానికి ముందస్తు ఏర్పాట్లను రాష్ట్ర ఎక్సైజ్ ,క్రీడా, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు, యువజన, సర్వీసుల శాఖల మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ పరిశీలించారు. నీరా కేఫ్ ను దేశంలో ఏ రాష్ట్రం లో లేని విధంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించామన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గీత కార్మికుల సంక్షేమ, అభివృద్ధితో పాటు వారి ఆత్మ గౌరవాన్ని నిలిపేలా ఈ నీరా కేఫ్ ను తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు.

నీరా కేఫ్ పరిశీలనలో భాగంగా మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ వెంట రాష్ట్ర ప్రభుత్వ వివిధ సంస్థల కార్పొరేషన్ చైర్మన్లు డాక్టర్ ఆంజనేయ గౌడ్ ,డాక్టర్ దూదిమెట్ల బాలరాజ్ యాదవ్, శ్రీధర్ రెడ్డి, బీసీ కమిషన్ సభ్యులు K. కిషోర్ గౌడ్, టూరిజ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ మనోహర్ , తదితరులు ఉన్నారు.

LEAVE A RESPONSE