Suryaa.co.in

Telangana

ఓటర్ల నమోదులో నిర్లక్ష్యం పనికిరాదు

– డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్

సికింద్రాబాద్ : ఓటర్ల నమోదు ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని, నిర్లక్షంగా వ్యవహరించరాదని డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ అధికారులను ఆదేశించారు. సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలో కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ పై అధికారులతో ఆయన సితాఫలమండీ లోని తన క్యాంపు కార్యాలయంలో సమీక్షను నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు అవకాశాన్ని ఓటర్లందరూ సద్వినియోగం చేసుకొనేలా అధికార యంత్రాంగం కృషి చేయాలనీ సూచించారు. కార్పొరేటర్ సామల హేమ, డిప్యూటీ కమీషనర్ సుధాంశు, బీ ఆర్ ఎస్ సమన్వయకర్తలు రాజ సుందర్, జలంధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE