*ఉద్వేగానికి గురైన పార్టీ నాయకులు, కార్యకర్తలు
*పెండింగ్ పనుల పూర్తి, పరిశ్రమల ఏర్పాటుతో రుణం తీర్చుకుంటానన్న లోకేష్
ఉమ్మడి నెల్లూరు జిల్లాకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు కందుకూరు నియోజకవర్గ సరిహద్దుల్లో రాళ్లపాడు ప్రాజెక్టువద్ద యువనేత నారా లోకేష్ ఘనంగా వీడ్కోలు పలికారు. మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఆనం రాంనారాయణరెడ్డి, కోవూరు ఇన్ చార్జి దినేష్ రెడ్డి, ఉదయగిరి ఇన్ చార్జి బొల్లినేని రామారావు, పార్టీ సీనియర్ నాయకులు వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి, ఆనం వెంకటరమణారెడ్డి, కైవల్యారెడ్డి, కోటంరెడ్డి గిరిధర్, బీద గిరిధర్, ఆనం రంగమయూర్ రెడ్డి తదితరులు యువనేతకు వీడ్కోలు పలికారు.
యువనేత లోకేష్ ఉమ్మడి నెల్లూరు జిల్లాను వీడుతున్న సమయంలో పార్టీ నేతలు, కార్యకర్తలు ఉద్వేగానికి గురయ్యారు. పార్టీ సీనియర్ నేతలను హత్తుకొన్న యువనేత లోకేష్ జిల్లాలో టిడిపి జెండా రెపరెపలాడించాలని కోరారు. నెల్లూరు జిల్లాలో పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఏ కష్టమొచ్చినా వెన్నంటి ఉంటానని భరోసా ఇచ్చారు.31రోజులపాటు తనను కుటుంబసభ్యుడి మాదిరిగా ఆదరించి ఆతిధ్యమిచ్చిన నెల్లూరు జిల్లా ప్రజలకు యువనేత లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు. టిడిపి అధికారంలోకి వచ్చాక నెల్లూరు జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి, పరిశ్రమల ఏర్పాటు ద్వారా రుణం తీర్చుకుంటానని చెప్పారు.
ప్రకాశం జిల్లాలో లోకేష్ కు అపూర్వ స్వాగతం
ఉమ్మడి నెల్లూరు జిల్లాలో విజయవంతంగా యువగళం పాదయాత్ర పూర్తిచేసిన యువనేత లోకేష్ శనివారం సాయంత్రం ఉమ్మడి ప్రకాశం జిల్లా కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గంలోకి అడుగుపెట్టారు. కందుకూరు నియోజకవర్గ సరిహద్దుల్లోని రాళ్లపాడు ప్రాజెక్టు వద్ద యువనేత లోకేష్ కు ఉమ్మడి ప్రకాశం జిల్లా అపూర్వ స్వాగతం పలికారు. కందుకూరు ఇన్ చార్జి ఇంటూరి నాగేశ్వర రావు, పార్టీ సీనియర్ నాయకులు దామచర్ల జనార్ధన్, నూకసాని బాలాజీ, గొట్టిపాటి రవి,ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్,ఎం ఎం కొండయ్య, బి ఎన్ విజయ్ కుమార్, పోతుల రామారావు, దివి శివరాం, ఇంటూరి రాజేష్, మాల్యాద్రి, ఎరిక్షన్ బాబు, ముత్తమల అశోక్ రెడ్డి తదితరులు యువనేతను స్వాగతించారు. భారీగా తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలతో రాళ్లపాడు ప్రాజెక్టు పరిసరాలు కిటకిటలాడాయి. భారీ కటౌట్లతో ఏర్పాటుచేసిన స్వాగత ద్వారాలు, గజమాలలు, బాణాసంచా మోతలు, డప్పుశబ్ధాలతో నారా లోకేష్ కి టిడిపి నాయకులు, కార్యకర్తలు. ఘన స్వాగతం పలికారు. కందుకూరు నియోజకవర్గంలో అడుగడుగునా యువనేతకు జనం నీరాజనాలు పలికారు.
దారిపొడవునా యువనేత లోకేష్ తో ఫోటోలు దిగేందుకు జనం ఎగబడ్డారు. లోకేష్ ను చూసేందుకు మహిళలు, యువకులు, చిన్నారులు పెద్దఎత్తున తరలివచ్చారు.మార్గమధ్యలో వివిధ వర్గాల ప్రజలు లోకేష్ ను కలిసి తాము ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రాలు సమర్పించారు. మరో ఏడాదిలో రాబోయే చంద్రన్న ప్రభుత్వం అందరి సమస్యలు పరిష్కరిస్తుందని భరోసా ఇస్తూ యువనేత ముందుకు సాగారు. 155వరోజు యువనేత లోకేష్ 17.9 కి.మీ.ల పాదయాత్ర చేశారు. ఇప్పటివరకు యువగళం పాదయాత్ర 2057.3 కి.మీ. మేర పూర్తయింది. ఆదివారం సాయంత్రం వలేటివారిపాలెంలో జరిగే బహిరంగసభలో లోకేష్ ప్రసంగిస్తారు.
నారా లోకేష్ ను కలిసిన మర్రిగుంట గ్రామస్తులు
ఉదయగిరి నియోజకవర్గం మర్రిగుంట గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.మర్రిగుంట నుండి వెలిగంట్ల చర్చి రోడ్డును తారురోడ్డుగా మార్చాలి.మా గ్రామంలో ఓవర్ హెడ్ ట్యాంకు నిర్మించి మంచినీరు అందించాలి.గ్రామంలో డ్రైనేజీల్లో మురుగునీరు పేరుకుపోయింది.మా గ్రామంలో 2,500మీటర్ల సీసీ రోడ్లు నిర్మించాలి.మా గ్రామంలో పొలం వెళ్లేందుకు అవసరమైన రోడ్లు వేయాలి.ఆంజనేయస్వామి విగ్రహం నుండి చర్చి వరకు రోడ్డు వేయాలి. విగ్రహం వద్ద కరెంటు సదుపాయం ఏర్పాటు చేయాలి.మా గ్రామంలో కరెంటు సమస్యలు అధికంగా ఉన్నాయి. మా గ్రామంలో జెడ్పి హైస్కూలుకు ప్రహరీగోడ నిర్మించాలి.
నారా లోకేష్ స్పందిస్తూ… జగన్మోహన్ రెడ్డి పాలనలో గ్రామీణాభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు.తాగునీరు, డ్రైనేజీ, కరెంటు, మౌలిక సదుపాయాలు కల్పించడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైంది.పంచాయతీలకు చెందిన రూ.9వేల కోట్లను జగన్ ప్రభుత్వం దారిమళ్లించింది.టీడీపీ హయాంలో గ్రామీణ ప్రాంతాల్లో25వేల కిలోమీటర్ల సీసీరోడ్లు, 30లక్షల ఎల్.ఈ.డీ వీధి దీపాలు వేశాం.టిడిపి అధికారంలోకి వచ్చాక మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేస్తాం, కరెంటు సమస్యలు పరిష్కరిస్తాం.ప్రతిఇంటికీ తాగునీటి కుళాయి అందజేసి, 24/7 స్వచ్చమైన నీరు అందజేస్తాం.
నారా లోకేష్ ను కలిసిన రెణమాల ముస్లింలు
ఉదయగిరి అసెంబ్లీ నియోజకవర్గం రెణమాల గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.మా గ్రామంలో మంచినీటి సమస్య అధికంగా ఉంది.రెండు రోజులకు ఒకసారి మంచినీరు వస్తోంది, ఇవి తాగడానికి ఉపయోగపడడం లేదు.మినరల్ వాటర్ కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తోంది. కొంతమంది కొనుక్కోలేక కలుషిత నీరు తాగి రోగాలబారిన పడుతున్నారు.మా గ్రామంలోని ఈద్గాకు ప్రహరీ నిర్మించి నమాజ్ చేసుకునేందుకు సౌకర్యం కల్పించాలి.మా గ్రామంలో హైస్కూల్ ఏర్పాటు చేసి మా పిల్లలు పక్క గ్రామాలకు వెళ్లకుండా చూడాలి.మైనారిటీలకు సబ్సిడీ లోన్లు ఇప్పించి ఆర్థిక తోడ్పాటునందించాలి. మా గ్రామంలో సీసీ రోడ్లు నిర్మించాలి.
నారా లోకేష్ స్పందిస్తూ… సంక్షేమ కార్యక్రమాలకు లక్షలకోట్లు ఖర్చుపెడుతున్నామని డబ్బాలు కొట్టుకుంటున్న ముఖ్యమంత్రి… గ్రామీణ ప్రాంతాల్లో గుక్కెడు నీళ్లు ఇవ్వలేకపోవడం దారుణం. గత నాలుగేళ్లుగా మైనారిటీల సంక్షేమాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి తీవ్ర నిర్లక్ష్యం చేశారు.టిడిపి అధికారంలోకి రాగానే వాటర్ గ్రిడ్ ఏర్పాటుచసి ఇంటింటికీ తాగునీటి కుళాయి అందజేస్తాం.గ్రామంలో విద్యార్థులను సంఖ్యకు అనుగుణంగా హైస్కూలు, ఈద్గా ప్రహరీగోడ నిర్మాణం చేపడతాం.ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటుచేసి ముస్లింలకు స్వయం ఉపాధి రుణాలను అందజేస్తాం.
నారా లోకేష్ ను కలిసిన నేకునంపేట గ్రామస్తులు
ఉదయగిరి నియోజకవర్గం నేకునంపేట తూర్పుపాలెం గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.మా గ్రామంలో 300 కుటుంబాలు నివసిస్తున్నాయి, మేమంతా వ్యవసాయంపై మేం అధారపడి జీవిస్తున్నాం.రెణమాల ట్యాంక్ గా పిలిచే చెరువు చెరువు కింద 1,300 ఎకరాల్లో వరి, పత్తి పంటలు పండిస్తున్నాం.ఈ చెరువుకు నీరు అందించాలి.కొండాపురం టు కొమ్మి రోడ్డులోని పార్లపల్లి వరకు రోడ్డు వేయాలి.దీనివల్ల 10కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. రవాణా సౌకర్యం సులభమవుతుంది.తూర్పుపాళెం నుండి రెణమాల వరకు రోడ్డు సౌకర్యం కల్పించాలి.మీరు అధికారంలోకి వచ్చాక మా సమస్యలను పరిష్కరించాలి.
నారా లోకేష్ స్పందిస్తూ…జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక చిన్ననీటి వనరులను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు.గత నాలుగేళ్లుగా గ్రామీణరోడ్లు అస్తవ్యస్తంగా తయారయ్యాయి. గత టిడిపి హయాంలో చిన్ననీటి వనరుల అభివృద్ధికి నీరు-ప్రగతి కింద రూ.18,265 కోట్లు ఖర్చుచేశాం.టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామీణరోడ్లు, పుంతరోడ్ల నిర్మాణం చేపడతాం.రెణమాల చెరువుగు సాగునీరు అందజేసి, రైతుల కష్టాలు తొలగిస్తాం.
నారా లోకేష్ ను కలిసిన పెంట్రాల గ్రామస్తులు
ఉమ్మడి ప్రకాశం జిల్లా కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గం పెంట్రాల పంచాయితీ చీమలపెంట గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.నారా లోకేష్ ను కలిసిన కందుకూరు నియోజకవర్గం, పెంట్రాల పంచాయతీ, చీమలపెంట గ్రామస్తులు.మా గ్రామంలోని రాళ్లపాడు రిజర్వాయర్ ఎడమ కాలువ ద్వారా 10గ్రామాల పరిధిలో సుమారు 4వేల ఎకరాలకు సాగు నీరు అందుతోంది.వైసీపీ ప్రభుత్వం రిజర్వాయర్ కు సంబంధించిన ఎడమ కాలువ గేటు మరమ్మతులు చేయలేదు.కాలువకు అవసరమైన పూడికతీత పనులు కూడా ఏమీ చేపట్టలేదు.ఏ పని చేసినా ఆ భారాన్ని రైతులపై మోపి ఇబ్బందిపెడుతున్నారు.మీరు అధికారంలోకి వచ్చాక కాలువ మరమ్మతులు, పూడికతీత పనులు నిర్వహించాలి.
నారా లోకేష్ స్పందిస్తూ… జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సాగునీటి ప్రాజెక్టులను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది.జగన్ సర్కారు నిర్లక్ష్యం కారణంగా అన్నమయ్య డ్యామ్, పులిచింతల గేట్లు, గుండ్లకమ్మ గేట్లు కొట్టుకుపోయాయి.గత టిడిపి హయాంలో ఇరిగేషన్ పై రూ.68,294 కోట్లు ఖర్చుచేశాం.చిన్ననీటి వనరుల అభివృద్ధికి నీరు-ప్రగతి కింధ 18,265 కోట్లు వెచ్చించాం.టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాళ్లపాడు రిజర్వాయర్ ఎడమకాల్వ గేట్ల నిర్మాణం చేపడతాం.రాష్ట్రవ్యాప్తంగా కాల్వల మరమ్మతులు, పూడికతీత పనులు చేపట్టి రైతుల కష్టాలు తీరుస్తాం.
నారా లోకేష్ ను కలిసిన లింగసముద్రం రైతులు
కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గం లింగసముద్రం రైతులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.మా ప్రాంతంలో రాళ్లపాడు ప్రాజెక్టు ఉంది.ఈ ప్రాజెక్టు నుండి లింగసముద్రం కొత్తచెరువు, పాతచెరువు, విశ్వనాథపురం చెరువులకు నీరు రావడం లేదు.ఈ చెరువుల కింద పంటలు పండాల్సిన వేలాది ఎకరాల భూమి నేడు బీడు భూములుగా మారాయి.వర్షాధార పంటలు కూడా పండే పరిస్థితులు లేవు.రైతులు కూలీలుగా మారి, భూములను వదులుకుని ఇతర ప్రాంతాలకు, రాష్ట్రాలకు వలసలు వెళుతున్నారు.రాళ్లపాడు ప్రాజెక్టు గేటు నుండి నీరు వృధాగా పోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు.లిఫ్ట్ ద్వారా చెరువులకు నీరు ఇస్తే మా భూములకు నీరు అంది పంటలు పండించడానికి ఉపయోగకరంగా ఉంటుంది.మీరు అధికారంలోకి వచ్చాక రాళ్లపాడు ప్రాజెక్టు నుండి చెరువులకు నీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలి.
నారా లోకేష్ స్పందిస్తూ… జగన్ అండ్ కోకు దోచుకోవడం, దాచుకోవడం తప్ప రైతుల సమస్యలపై శ్రద్ధలేదు.రైతుల కోసం గత ప్రభుత్వంలో నిర్మించిన లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలకు కరెంటు బిల్లులు కట్టలేక మూలనబెట్టిన దివాలాకోరు ప్రభుత్వమది.గత నాలుగేళ్లులో రాష్ట్రంలో ఇరిగేషన్ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే రాళ్లపాడు ప్రాజెక్టు గేట్లకు మరమ్మతులు చేపడతాం.లిఫ్ట్ ద్వారా సమీప గ్రామాల చెరువులకు నీరందించే అంశాన్ని పరిశీలిస్తాం.నీరులేక రైతుల పొలాలు ఎండిపోయే పరిస్థితులను రానీయం, ప్రతిఎకరాలకు సాగునీరు అందిస్తాం.
నారా లోకేష్ ను కలిసిన లింగసముద్రం బలిజపాలెం ప్రజలు
కందుకూరు నియోజకవర్గం లింగసముద్రం బలిజపాలెం ప్రజలు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.మా గ్రామంలో 300కుటుంబాలు నివసిస్తున్నాం.గ్రామంలో హిందువులకు శ్మశానవాటిక లేదు.బలిజలకు కమ్యూనిటీ హాలు లేదు.11కేవీ విద్యుత్ లైను తీగలు బాగా కిందికి ప్రమాదకర స్థాయిలో ఉన్నాయి.ఈ లైన్లను గ్రామం బయటినుండి వెళ్లేలా మళ్లించే చర్యలు తీసుకోవాలి.గ్రామంలో సీసీ రోడ్లు లేక వర్షాకాలం ఇబ్బందులు పడుతున్నాం.మీరు అధికారంలోకి వచ్చాక మా సమస్యల్ని పరిష్కరించాలి.
నారా లోకేష్ స్పందిస్తూ… జగన్ ప్రభుత్వం కాపులు, బలిజల సంక్షేమాన్ని పూర్తిగా గాలికొదిలేసింది.గత ప్రభుత్వంలో మంజూరుచేసిన కాపు, బలిజల కమ్యూనిటీ హాళ్లను కూడా ఈ ప్రభుత్వం నిలిపివేసింది.జగన్ అధికారంలోకి వచ్చాక గ్రామాల్లో కనీసం బ్లీచింగ్ పౌడర్ చల్లడానికి కూడా నిధుల్లేని దుస్థితి కల్పించారు. టిడిపి హయాంలో గ్రామీణ ప్రాంతాల్లో 25వేల కి.మీ.ల సిసి రోడ్లు, 30లక్షల విద్యుత్ దీపాలు ఏర్పాటుచేశాం.మళ్లీ టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామీణ ప్రాంతాల్లో పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలు కల్పిస్తాం.