-ఎన్నికల విధుల నుంచి తపించండి
-సీఎం ఓఎస్డీ బంధువునంటూ బెదిరిస్తున్నారు
-రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి వర్ల రామయ్య లేఖ
నెల్లూరు రూరల్ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డిని వెంటనే బదిలీ చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధి కారి ముకేష్‌కుమార్ మీనాకు టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య గురువారం లేఖ రాశారు. డీఎస్పీ శ్రీనివాసరెడ్డి ముఖ్యమంత్రి ఓఎస్డీగా పనిచేస్తున్న నీలకంఠరెడ్డికి దగ్గర బంధువని. ఆయన మాట మేరకు వైకాపాకు అనుకూలంగా పనిచేస్తున్నారని పేర్కొన్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్నారని తెలిపారు. వైకాపా ఎన్నికల ప్రచారానికి అనాధికారికంగా కూడా అనుమతులిస్తూ, టీడీపీకి చట్టబద్ధంగా అనుమతులు కోరిరా ఇబ్బందులు పెడుతున్నారని వెల్లడిరచారు. ఎవరైనా ప్రశ్నిస్తే తన బంధువు సీఎం ఓఎస్డీ అని, నన్నెవరూ ఏమి చేయేలేరని ఎదురుదాడి చేస్తున్నారని లేఖలో వివరించారు. ఆయన పదవిలో కొనసాగితే ఎన్నికలు సజావుగా జరగవని, వెంటనే బదిలీ చేసి ఎన్నికల విధులకు దూరంగా పెట్టాలని కోరారు.