Suryaa.co.in

Andhra Pradesh

ప్రజల ఆలోచనలు దారి మళ్ళించడం, రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే ప్రభుత్వం కొత్త జిల్లాలు

– ప్రపంచం మెచ్చిన ఎన్టీఆర్ లాంటి గొప్పవ్యక్తి పేరు జిల్లాకు పెట్టడం ఆయన్ని అవమానించడంకాదా?
• ప్రజలకు పాలనచేరువచేయడానికే జిల్లాల విభజన అంటున్న ముఖ్యమంత్రి, అదేసూత్రాన్ని అమరావతి విషయంలో ఎందుకు కాదంటున్నాడు?
• జిల్లాల విభజన పేరుతో ప్రభుత్వమే రియల్ ఎస్టేట్ వ్యాపారానికి శ్రీకారంచుట్టడం దుర్మార్గం.
• జగన్మోహన్ రెడ్డి తనస్వార్థంకోసం చేసిన జిల్లాలఏర్పాటుని టీడీపీ అధికారంలోకివచ్చిన వెంటనే ప్రజల ఆలోచనలు, ఆకాంక్షల ప్రకారం సరిచేస్తుంది.
-మాజీ ఎమ్మె ల్సీ బీదా రవిచంద్ర

జగన్మోహన్ రెడ్డి 26 జిల్లాలను ఏర్పాటుచేశామని గొప్పలుచెప్పుకుంటుంటే, వైసీపీనేతలు, మంత్రులేమో జిల్లాకేంద్రాలు ప్రజలకు అందుబాటులోఉండటానికే తమనాయకుడు అలాచేశారని సమర్థిస్తున్నారని, అదేవిధమైన ఆలోచన, సమర్థింపు, ముఖ్యమంత్రి, మంత్రు లకు రాజధాని అమరావతివిషయంలో ఎందుకులేకుండాపోయిందని టీడీపీనేత, మాజీ ఎమ్మెల్సీ బీదారవిచంద్ర ప్రశ్నించారు.మంగళవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.ఆ వివరాలు ఆయన మాటల్లోనే ..

జిల్లాల వికేంద్రీకరణ ఏవిధంగా అయితే చేశామో, అదేవిధంగా మూడురాజధానులకు కట్టుబడి ఉంటామని ఈప్రభుత్వం ఇప్పటికీ మూర్ఖంగా మాట్లాడుతోంది. ముఖ్యమంత్రి చెప్పి నట్టు విశాఖను పరపాలనారాజధానిచేస్తే, అది రాయలసీమవాసులకు ఎలాదగ్గరగా ఉంటుం దో ఆయనేసమాధానంచెప్పాలి. అలానే కర్నూలు న్యాయరాజధానిగాఉంటే, అక్కడికి ఉత్తరాంధ్ర జిల్లాలప్రజలు వెళ్లాలంటే వారికి ఎన్నిఇబ్బందులు ఉంటాయి? ప్రభుత్వం ప్రజల సౌకర్యంకోసమే జిల్లాలవిభజనచేసినట్టు చెప్పడం పచ్చిఅబద్ధం.

జిల్లాలవిభజనలో గత రెండునెలలుగా ప్రజలు ఇచ్చిన వినతులు, వారిఆలోచనలను ఈప్రభుత్వం ఎందుకు పరిగణ నలోకి తీసుకోలేదని ప్రశ్నిస్తున్నాం. ప్రజలంతా పార్టీలకు, ప్రాంతాలకు అతీతంగా కలిసి ఎన్ని సార్లు మొరపెట్టుకున్నా ప్రభుత్వం జిల్లాల విభజనలో వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోలేదు. నెల్లూరుజిల్లాకేంద్రానికి 15 నిమిషాలప్రయాణదూరంలో ఉన్న గూడూరును తీసుకెళ్లితిరుపతిలోకలిపారు. హిందూపురాన్ని సత్యసాయిజిల్లాలో కలిపారు.

కావలికి చుట్టుపక్కల ఉండే మండలాలను తీసుకెళ్లి దూరంగాఉన్న కందుకూరుజిల్లాలో కలిపారు. ఉదయగిరి కేంద్రంగా జిల్లాకావాలని ఎప్పటినుంచో డిమాండ్లు వినిపిస్తుంటే ఆ నియోజకవర్గాన్ని ముక్కలుచేసి ఏకంగా మూడురెవెన్యూడివిజన్లలోకలిపేశారు. ఇలా అనేక ప్రాంతాలను దగ్గరగాఉన్న జిల్లాకేంద్రాలనుకాదని, ఎక్కడోదూరంగా ఉన్నకొత్తజిల్లాల్లో కలిపి, ప్రజలకోసమేచేశామంటూ కట్టుకథలు చెబుతున్నారు.

జిల్లాల విభజనతో ఎందుకింత గందరగోళంచేశారో, ఎందుకింత అశాస్త్రీయత పాటించారో ముఖ్యమంత్రి సమాధానంచెప్పాలి. జిల్లాలవిభజనలో ప్రజల అవసరాలు.. ప్రాంతీయ అవసరాలను ఈప్రభుత్వం అసలు పరిగణ నలోకి తీసుకోనేలేదు. ఎన్టీఆర్ పేరుతో జిల్లా ఏర్పాటు చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారు. స్వర్గీయఎన్టీ ఆర్ గారిపేరు హైదరాబాద్ లోని అంతర్జాతీయ విమానాశ్రయానికి పెడితే, జగన్మోహన్ రెడ్డి తండ్రి రాజశేఖర్ రెడ్డి ఆపేరు తొలగించింది నిజంకాదా?

మరి ఆనాడు ఎన్టీఆర్ ను అవమానించిన రాజశేఖర్ రెడ్డి తీరుని జగన్మోహన్ రెడ్డి… ఆయనపార్టీ వారు ఎందుకుఖండించలేదు? చంద్రబాబుగారు ఎన్టీఆర్ పేరుతో తీసుకొచ్చిన పథకాలను ఈ ముఖ్యమంత్రి ఎందుకు తీసేశాడు? ఆఖరికి పేదలకడుపునింపే అన్నాక్యాంటీన్లు కూడా తీసేశాడు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకివచ్చినప్పటినుంచీ నందమూరి తారకరామారావు విగ్రహాలు కూల్చేయించే పనిలోనే ఉన్నాడు.

ఆయన విగ్రహాలు కూలుస్తూ, ఆయనపేరు ఏదో ఒకజిల్లాకుపెట్టామంటూ సిగ్గులేకుండా చెప్పుకుంటున్నారు. నందమూరి తారకరామారావు గారి పేరుని, ఆయనకీర్తిప్రతిష్టలను తనస్వార్థానికి వాడుకుంటున్న ఈముఖ్యమంత్రి, ఈప్ర భుత్వం పనిగట్టుకొని మరీ ఆయనకుటుంబసభ్యులను అవమానిస్తూ, వారిపరువు ప్రతిష్టలు మంటగలిపేలా వ్యవహరిస్తుండటాన్ని కూడా ప్రజలంతా గమనిస్తున్నారు.

ఈ ప్రభుత్వం, ప్రజల అభిప్రాయాలు, వారి ఆలోచనలుపరిగణనలోకి తీసుకోకుండా, ప్రభుత్వ చర్యలు, అసంబద్ధనిర్ణయాలతో వారుపడుతున్న ఇబ్బందులనుంచి వారి ఆలోచనలు మళ్లిం చడానికే కొత్తజిల్లాల నాటకాన్ని మొదలెట్టింది. ప్రభుత్వానికి, ముఖ్యమంత్రిఅవినీతి, దోపిడీకి వ్యతిరేకంగా టీడీపీచేస్తున్న పోరాటం ప్రజల్లోకి వెళ్లకూడదన్న కుఠిలబుద్ధితోనే కొత్తజిల్లాలను తెరపైకితెచ్చారు. ఒకజిల్లాకేంద్రానికి సమీపంలో ఉండే మండలాలను మరోకొత్త్తజిల్లాలో కలిపారు.

అధికారపార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులఅభిప్రాయాలనుగౌరవించి, వారుచెప్పిన విధం గానే ముఖ్యమంత్రి జిల్లాలకు రూపకల్పనచేశాడు. జిల్లాల నోటిఫికేషన్ వెలువడిన కొన్నిగంటలకే రియల్ ఎస్టేట్ వ్యాపారంచేసుకొని, ప్రజలనుదోచుకోండి అన్నట్లుగా తనపార్టీవారిని రెచ్చగొడుతూ, పాతజిల్లాకేంద్రాల్లో భూములవిలువ పెంచుతూ జీవో ఇచ్చింది. రేణిగుంట ప్రాంతంలో 400శాతం వరకు భూమివిలువ పెరిగిందనే వార్తలు ఇప్పటికే మీడియాలో వస్తున్నాయి.

భూములవిలువ పెంచడం ద్వారా, జిల్లాల పేరుతో ప్రభుత్వమే అధికారికంగా రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెరతీసింది. ప్రజలను గందరగోళ పరిచి, తాముఅనుకున్నది సాధించుకోవడానికే ప్రభుత్వం ఈ పన్నాగానికి పాల్పడింది. జిల్లాల విభజనలో ఈముఖ్యమంత్రి, ప్రభుత్వం ప్రజల అభిప్రాయాలకు, వారిఆలోచనలకు విలువఇవ్వకుండా చేసినతప్పిదాలన్నింటినీ టీడీపీ అధికారంలోకి వచ్చినవెంటనే సరిచేస్తుం దని, ప్రజలఆకాంక్షలకు అనుగుణంగా జిల్లాలరూపురేఖలు మారుస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.

LEAVE A RESPONSE