Suryaa.co.in

Telangana

అక్టోబర్ నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ

హైదరాబాద్: రేషన్ కార్డులు, హెల్త్ కార్డులపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.అక్టోబర్ లో అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్, హెల్త్ కార్డులు మంజూరు చేస్తామని ప్రకటించింది.

సెప్టెంబర్ 16న కేబినెట్ సబ్ కమిటీ భేటీ జరిగింది. అనంతరం మంత్రి ఉత్తమ్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కేబినెట్ సబ్ కమిటీ భేటీలో చర్చించిన విషయాలను మీడియాకు వెల్లడించారు.

కొత్త రేషన్ కార్డు విధివిధానాలు రూపొందిస్తున్నామని చెప్పారు మంత్రి ఉత్తమ్. తెల్ల రేషన్ కార్డు అర్హులు ఎవరనేదానిపై వచ్చే భేటీలో నిర్ణయిస్తామన్నారు. ఇతర రాష్ట్రాల్లో రేషన్ కార్డులు ఎలా ఇస్తున్నారనేదానిపై అధ్యయనం చేస్తున్నామని తెలిపారు.

రేషన్ కార్డుల నిబంధనలు ఎలా ఉండాలని పార్టీలకు లేఖ రాశామన్నారు.. కొంత మంది ప్రజాప్రతినిధులు విలువైన సూచనలు చేశారు. వచ్చిన సూచనలన్నీ సమావేశంలో చర్చించామని తెలిపారు.

రాష్ట్రంలో దాదాపు 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయన్నారు మంత్రి ఉత్తమ్. అందరికి ఆరు కిలోల బియ్యం ఉచితంగా ఇస్తామన్నారు. గత ప్రభుత్వం 49 వేల రేషన్ కార్డులు మాత్రమే ఇచ్చింది..అవి కూడా బై ఎలక్షన్ వచ్చిన నియోజకవర్గాల్లోనే రేషన్ కార్డులు ఇచ్చారు.

బీఆర్ఎస్ రాష్ట్రమంతా ఏ నాడు రేషన్ కార్డులు ఇవ్వలేదు . మేం పారదర్శకంగా రేషన్ కార్డులు జారీ చేస్తాం. సెప్టెంబర్ 21 నమరోసారి కేబినెట్ సబ్ కమిటీ భేటీ ఉంటుంది. ఈ నెలాఖరులోగా కేబినెట్ కమిటి రిపోర్ట్ ఇస్తుంది. అక్టోబర్ లో అర్హులైన అందరికీ కొత్త రేషన్ కార్డులు ఇస్తామని మంత్రులు వెల్లడించారు.

LEAVE A RESPONSE