Suryaa.co.in

Telangana

కాళ్లు మొక్కెయ్.. సీటు పట్టేయ్

– తెలంగాణలో అధికారుల నయాట్రెండ్
– కాళ్లు మొక్కి ఎమ్మెల్సీ పొందిన వెంకట్రామిరెడ్డి
– ఇప్పుడు కేసీఆర్ కాళ్లకు మొక్కిన శ్రీనివాసరావు
– బ్యూరోక్రసీ పరువు తీస్తున్నావంటూ మాజీ ఐఏఎస్ మురళీ ఫైర్

తెలంగాణలో సీఎం కేసీఆర్ కాళ్లకు మొక్కిన వారికి మొక్కినంత ఫలం. ఫలితం! వారి కష్టం ఊరకపోదు. జస్ట్ ఓ ఐదు సెకన్లు అలా నడుము కిందకు వంచి, సారు కాళ్లకు మొక్కితే చాలు. ఏ ఎమ్మెల్సీనో, ఏ ఎమ్మెల్యేనో అయిపోవచ్చు. ఖతం. దానితో వాళ్ల దశ తిరిగిపోతుంది. ఇప్పుడు తెలంగాణలో రాజకీయాలపై ముచ్చటపడుతున్న అధికారులు, ఇదే ట్రెండ్ ఫాలో అయిపోతున్నారు. కాదంటారా? అర్జెంటుగా ఇది చదివేయండి మరి!

తెలంగాణ ప్రజారోగ్యం సంచాలకులు గడల శ్రీనివాసరావు సిఎం కేసిఆర్‌ కాళ్లు మొక్కారు. ఒక సారి కాదు ….రెండు సార్లు…. మీరు వింటున్నది నిజమే…. ఈ వీడియో చూస్తే….మీకే అర్థం అవుతుంది. ఎక్కడనుకుంటున్నారా…. ఇంకెక్కడ…. ప్రగతిభవన్‌లో. తెలంగాణలో కొత్తగా 8 మెడికల్‌ కాలేజీలను సిఎం కేసిఆర్‌ ప్రగతిభవన్‌ నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు.

ఆ సమయంలోనే శ్రీనివాస రావు కేసిఆర్‌ కాళ్లు మొక్కారు. అదీ అందరు చూస్తుండగానే…సిఎం కేసిఆర్‌ కు పూల బొకే ఇచ్చిన శ్రీనివాస రావు పనిలో పనిగా ఒక లెటర్‌ కూడా సిఎంకు ఇచ్చారు. కాళ్లు మొక్కిన టైంలో సిఎం పక్కనే ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావు, మరో మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి, ఛీఫ్‌ సెక్రటరీ సోమేశ్‌ కుమార్‌ కూడా ఉన్నారు. ఈ కాళ్లు మొక్కే సీన్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

ఇంతకీ హెల్త్‌ డైరెక్టర్‌ సిఎం కాళ్లు ఎందుకు మొక్కారు….అనే చర్చ మొదలైంది. ఆయన కొంత కాలంగా రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారు. కొత్తగూడెం అసెంబ్లీ టిక్కెట్‌ కోసం సిఎంను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. ఆ మధ్య క్షుద్ర పూజల్లో పాల్గొన్నారని రచ్చ రచ్చ జరిగింది. ఇదిగో ఇప్పుడు ఇలా కాళ్లుమొక్కారు.

ఈ వీడియో చూసిన మాజీ ఐఎఎస్‌ ఆకునూరి మురళి ఘాటుగా రియాక్టయ్యారు. బ్యూరోక్రసీ పరువు తీస్తున్నావంటూ మండిపడ్డారు. ఇదంతా కొత్తగూడెం టిక్కెట్‌ కోసమేగా…. మొన్న కొత్తగూడెం వెల్తే…చూశా…టౌన్‌ నిండా మీ ఫ్లెక్సీలే. పదవి మిస్‌ యూజ్‌ చేస్తూ…ఏదో కార్యక్రమాలు చేస్తున్నారని నాతో కొందరన్నారు…అంటూ మురళి ట్విట్టర్‌ వేదికగా శ్రీనివాస రావు దుమ్ము దులిపేశారు. ఇంక నెటిజన్ల
సంగతి సరే సరి…. ఈ ట్రెండ్‌ను ఇప్పటిది కాదు. గతంలో సిద్దిపేట కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి, సంగారెడ్డి కలెక్టర్‌ డాక్టర్‌ శరత్‌ కూడా ఇలాగే సిఎం కేసిఆర్‌ కాళ్లు మొక్కారు. తర్వాత వెంకట్రామిరెడ్డి ఎమ్మెల్సీ అయ్యారు. ఇప్పుడు శ్రీనివాస రావూ….అదే ట్రెండ్‌ ఫాలో అయినట్లున్నారు.చూద్దాం. కేసీఆర్ కాళ్లా వేళ్లా పడిన శ్రీనివాసరావు కష్టం ఫలిస్తుందో లేదో?!

LEAVE A RESPONSE