Suryaa.co.in

Andhra Pradesh

కుప్పంలో అక్రమ మైనింగ్‌పై ఎన్జీటీ ఆదేశాలు

– అక్రమ మైనింగ్ జరిగినట్లు నిర్థారించిన ఎన్జీటీ
– కమిటీల పేరుతో కాలయాపన చెయ్యకుండా అక్రమ మైనింగ్ పై 26.05.2022 నాటికి రిపోర్ట్ సమర్పించాలని ఆదేశం

అక్రమ మైనింగ్ జరిగిన మాట వాస్తవమే మరోసారి నిర్థారించిన ఎన్జీటీ. దీనిపై వాస్తవాలు నిగ్గుతేల్చేందుకు కమీటీ ఏర్పాటు చేశామని ఎన్టీటీకి తెలిపిన ప్రభుత్వం..

ఇప్పటికే అటవీ శాఖ ఈ భూములు రెవెన్యూ పరిధిలోకి వస్తుందని స్పష్టం చేయటం మరియు 2021లో ఈ ప్రాంతంలో తనిఖీలు చేశామని మైనింగ్ శాఖ నివేదిక సమర్పించినందున ఇకపై దీనిపై కమిటీ వేయాల్సిన అవసరం లేదని అభిప్రాయం వ్యక్తం చేసిన ఎన్జీటీ. దీనిపై ఎలాంటి ఆలస్యం లేకుండా అన్ని సంబంధిత శాఖల నుంచి రిపోర్టు తీసుకుని 26-05-2022 నాటికి పూర్తి నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసిన ఎన్జీటీ.
Kuppam-NGT-order

LEAVE A RESPONSE