– రోగుల తీవ్ర ఇబ్బందులు
హైదరాబాద్: నీలోఫర్ లో రెండు రోజుల క్రితం సంపు వద్ద ఉన్న బోర్ పాడవడంతో అత్యవసర విభాగం లోని ఐదంతస్తులకు నీటి కొరత ఏర్పడింది. ఈ భవనంలో పిడియాట్రిక్, పిడియాట్రిక్ సర్జరీ, గైనిక్ విభాగానికి సంబంధించి ప్రసవాల గదితో పాటు నిత్యం 25 నుంచి 30 సర్జరీలు జరిగే ఆపరేషన్ థియేటర్ ఉన్నాయి.రెండు రోజులుగా నీరందక నరకం చూసి నట్లు రోగులు, రోగి సహాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.