– వంగవీటి రంగా హత్యను రాజశేఖర్ రెడ్డి, ఎలాగైతే తనస్వార్థరాజకీయాలకు వాడుకున్నారో, అదేవిధంగా రాధాను బలితీసుకొని, తిరిగి అధికారంలోకి రావాలని జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నాడు.
– టీడీపీ శాసనసభ్యులు నిమ్మల రామానాయుడు
స్వర్గీయ వంగవీటి మోహనరంగా గురించి, రాధా ఇంటి దగ్గర జరిగిన రెక్కీ గురించి, కాపుల బాగోగుల గురించి వైసీపీ నేతలు, ఆ ప్రభుత్వం మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు, రాక్షసులు వేదపారాయణం చేసినట్లుగా ఉందని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, శాసనసభ్యులు నిమ్మల రామానాయుడు అభివర్ణించారు. శుక్రవారం ఆయన జూమ్ ద్వారా విలేకరులతో మాట్లాడారు.ఆ వివరాలు ఆయన మాటల్లోనే …
కాపులను ఎవరు ఆదరించి, అభిమానిస్తున్నారో, కాపులను ఎవరు అణగదొక్కుతున్నారో కాపులకు బాగాతెలుసు. కాపులకు టీడీపీ ప్రియమైన మిత్రువైతే, వైసీపీ బద్ధశత్రువు అనే పచ్చినిజాన్ని కాపులు ఇప్పటికే గ్రహించారు. కాపులను టీడీపీ ఎంతగానో ఆదరించింది. వైసీపీ మాత్రం అధికారంలోకి
వచ్చినప్పటినుంచి కాపువర్గాన్ని, ప్రముఖులైన కాపునేతలను అణచివేసే పనిలోనే ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో కాపువర్గంలో అమాయకులెవరూ లేరని ప్రభుత్వపెద్దలు, అధికారపార్టీవారుగుర్తిస్తే మంచింది. ఆనాడు నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి మొదలు ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి వరకు కాపులపై ఈర్ష్యాద్వేషాలతోనే వ్యవహరిస్తున్నారు.
కాపుల రిజర్వేషన్లను రద్దుచేసి వారికి తీరనిద్రోహం, తీవ్రఅన్యాయం చేశారు. వాటన్నింటిని కాపులు గమనిస్తున్నారు. 1989లో స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా హత్యను అడ్డంపెట్టుకొని, కాపుల సెంటిమెంట్ ను అడ్డం పెట్టుకొని, కాపు, కమ్మ కులాల మధ్య విద్వేషాలు, వైషమ్యాలు సృష్టించి, లబ్ధిపొందినమాట వాస్తవం కాదా? కాపులను తమరాజకీయఅవసరాలకు ముడిసరుకుగా ఉపయోగించుకున్నారు.అధికారంలోకి వచ్చాక 1989నుండి 1994వరకు 5 సంవత్సరాలపాటు వంగవీటి రంగా బొమ్మ పెట్టుకొని ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చినవారు,కాపువర్గానికి చేసింది శూన్యం. కనీసం రంగా కుటుంబానికి చేసింది కూడా ఏమీలేదు. రంగా గారి సతీమణి శ్రీమతివంగవీటి రత్నకుమారిని అవమానాలపాలు చేశారు రంగా కుటుంబానికి తీరని అన్యాయంచేయడంతోపాటు, కాపువర్గాన్ని తీవ్రంగా అణచివేసి, సమాజంలో వారిప్రాధాన్యతను తగ్గించడానికి ఆనాడున్న పాలకులు ప్రయత్నించింది నిజంకాదా? వంగవీటి రంగా బొమ్మను అడ్డం పెట్టుకొని గెలిచిన ఆనాటి ప్రభుత్వాలు, పాలకులకంటే వెయ్యిరెట్లు అధికంగా ఇప్పుడు అధికారంలో ఉన్నవారు కాపువర్గం ప్రాబల్యాన్ని తగ్గించడానికి వర్గాల మధ్యవైషమ్యాలు రాజేస్తున్నారు.
2004లో కాపులను బీసీల్లో చేర్చడంకోసం నియమించిన దాళ్వాయి సుబ్రమణ్యం కమిషన్, ఆప్రక్రియ నిర్వహణకోసం నాడు ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డిని రూ.46లక్షలు ఇమ్మని అడిగితే, ఆయననిర్లక్ష్యంగా వ్వవహరించారు. లక్షలుకాదుకదా.. కనీసం 4రూపాయలు కూడా ఇవ్వకుండా సుబ్రహ్మణ్యం కమిషన్ పనిచేయకుండా, కాపుల రిజర్వేషన్ ప్రక్రియకు జగన్మోహన్ రెడ్డి తండ్రి మోకాలడ్డాడు. ఆనాడు కాపులరిజర్వేషన్ ప్రక్రియు జరక్కుండా అడ్డుకున్నవారు నేడు కాపులను ఉద్ధరించేది తామేనన్నట్టు మోసపూరితప్రకటనలు చేస్తున్నారు.
కాపుల గురించి, రంగా గురించి, ఆయన కుటుంబం గురించి మాట్లాడే అర్హత, కనీసం వారిని తలుచుకునే అర్హత కూడా ఈ ప్రభుత్వానికి, ఇప్పటి ముఖ్యమంత్రికి లేవు. జీవో నెంబర్ 30 ను తీసుకొచ్చిన వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి 8 కులాలను బీసీల్లో చేర్చి… మూడు దశాబ్దాలుగా తమను బీసీల్లో చేర్చాలని మొత్తుకుంటున్న కాపులను మాత్రం బీసీల్లో చేర్చకుండా, వారిపై తనకున్న ఏహ్యాభావాన్ని చాటుకున్నది నిజంకాదా? రంగా హత్య కేసులో ప్రధాన ముద్దాయిగా చెప్పుకునే దేవినేని నెహ్రూని ఆదరించి, అతనికి హైదరాబాద్ లో 300 కోట్ల విలువైన భూములను రాజశేఖర్ రెడ్డి ఎలా అప్పచెప్పారో, ఆనాడే అంతటి విలువైన భూములను నెహ్రూకి తనతండ్రి ఎందుకు ఇచ్చారో జగన్మోహన్ రెడ్డి సమాధానంచెప్పగలడా అని ప్రశ్నిస్తున్నాం.
అలానే వంగవీటిరంగాను చంపడం తప్పు కాదని బహిరంగంగా చెప్పిన గౌతమ్ రెడ్డికి, జగన్మోహన్ రెడ్డి ఏపీ ఫైబర్ గ్రిడ్ ఛైర్మన్ పదవిఇచ్చి ఎందుకు సత్కరించాడో ముఖ్యమంత్రి సమాధానంచెప్పగలడా? దేవినేని నెహ్రూ.. రంగా హత్యకేసులో ముద్దాయి అయితే ఆయన కుమారుడు దేవినేని అవినాష్ ని, ఈ ముఖ్యమంత్రి ఇప్పుడు పక్కనెట్టుకొని అక్కున చేర్చుకోవడంలో అర్థమేమిటి? రంగా గారి కుమారుడు అయిన వంగవీటి రాధాని వైసీపీ ఇన్‌ఛార్జి పదవి నుంచి తప్పించడమేగాక, గత ఎన్నికల్లో ఆయనకు ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వడానికి కూడా జగన్మోహన్ రెడ్డికి మనస్సురాలేదు. ఆ విధంగా తన కుల అహంకారంతో కాపుల ప్రతినిథి అయిన రాధాను జగన్మోహన్ రెడ్డి అవమానించలేదా?
రాధా హత్యకు కుట్ర పన్ని రెక్కీ నిర్వహించిన అరవసత్యం వైసీపీ విజయవాడ ఫ్లోర్ లీడర్ కాదా? అదే అరవసత్యం టీడీపీ జాతీయ కార్యాలయంపై దాడిచేస్తే అతన్ని జగన్మోహన్ రెడ్డి ఆలింగనం చేసుకొని అభినందించింది నిజంకాదా? టీడీపీ కార్యాలయంపై దాడికి పాల్పడిన అరవసత్యాన్ని జగన్మోహన్ రెడ్డి అభినందించడంవల్లే, అతను మరింత అత్యుత్సాహంతో, జగన్ కు మరింత దగ్గర కావాలన్న తాపత్రయంతో, ముఖ్యమంత్రిమెప్పు పొందాలన్న ఉద్దేశంతోనే ఇప్పుడు రాధాఇంటివద్ద రెక్కీ నిర్వహించి, రాధాపై తెగబడేప్రయత్నం చేయడం నిజంకాదా?
అరవ సత్యం చర్యలకు జగన్మోహన్ రెడ్డే బాధ్యతవహించాలి. వైసీపీ నుంచి రాధాను బయటికి ఎందుకు నెట్టారో జగన్ సమాధానం చెప్పాలి. స్వర్గీయ వంగవీటి మోహనరంగా విగ్రహ ఆవిష్కరణకు వెళ్లిన తనపై జగన్మోహన్ రెడ్ ఆగ్రహంతో చిందులుతొక్కి, అవమానించాడని, అదిభరించలేకనే తాను వైసీపీనుంచి బయటకు వచ్చానని రాధా వాపోయింది నిజంకాదా? తనతండ్రి విగ్రహ ఆవిష్కరణకు వెళ్లడానికి కూడా జగన్ అనుమతి తీసుకోవాలా అని వంగవీటి రాధా మిత్రులతో చెప్పుకొని బాధపడింది నిజంకాదా? వైసీపీలో తనకు జరిగిన అవమానాన్ని జీర్ణించుకోలేక, జగన్మోహన్ రెడ్డి తనను దూషించిన వైనాన్ని జీర్ణించుకోలేకనే కదా రాధా నీలిపార్టీకి గుడ్ బై చెప్పారు.
ఆ విధంగా రంగా హత్యలో కీలకంగా వ్యవహరించినవారిని ఆదరించడంతోపాటు, రాధాను దారుణంగా అవమానించిన వారే, ఇప్పుడు దొంగే దొంగ దొంగ అని అరచినట్లుగా ప్రవర్తిస్తూ, తమతప్పులను, ఇతరులపైకి నెట్టాలనిచూస్తున్నారు. వంగవీటి మోహనరంగా హత్య కేసులో ప్రధాన ముద్దాయిలుగా ఉన్నవారికి వందలకోట్ల విలువైనభూములిచ్చి, అభినందిస్తారు. వారి వారసులకి పదవులిచ్చి సత్కరిస్తారు. రాధా ఇంటిపై రెక్కీ నిర్వహించిన వారెవరో తెలిసికూడా ఈప్రభుత్వం వారిని రక్షిస్తోంది. వారుజైలుపాలు కాకుండా వారికి రక్షణగా ఉంది.
అలాంటి ప్రభుత్వంలోని వారు, ప్రభుత్వాన్ని నడిపేవారు రంగా హత్యగురించి మాట్లాడుతూ, వర్గాల మధ్య చిచ్చుపెట్టి, తమ రాజకీయస్వార్థానికి ప్రజలను బలిచేయాలని చూస్తున్నారు. వైసీపీ రెండేన్నరేళ్ల పాలనలో అభివృద్ధి, సంక్షేమంలో రాష్ట్రంపూర్తిగా వెనుకబడిపోయింది. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి జగన్మోహన్ రెడ్డి అండ్ కో నానా తంటాలు పడుతున్నారు. మళ్లీ అధికారంలోకి రాలేరని సర్వేల ద్వారా తేలింది. దాంతో ఏంచేయాలో పాలుపోకనే కాపు- కమ్మ కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తున్నారు.
రంగా హత్యగావింపబడిన తరువాత ఎలాగైతే కాపులు, కమ్మవర్గం మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి, వారు..వారు తన్నుకుచచ్చేలాచేశారో, అదే ఫార్మాలాను ఇప్పుడు కూడా తెరపైకి తెచ్చి, రంగా గారి వారసులను మట్టుపెట్టి, వారి చావులను తమ కుట్రరాజకీయాల అమలుకు వాడుకోవాలని చూస్తున్నారు. అధికారంలోకి రావడంకోసం వైసీపీ చేస్తున్నకుట్రలో భాగంగానే రాధా ఇంటిపై జరిగిన రెక్కీ అని స్పష్టంచేస్తున్నాం. ఈ వాస్తవాన్ని కాపుసోదరులు, ఇతరవర్గాల వారు గమనించి జాగ్రత్తగా మసలుకోవాలని కోరుతున్నాం.
రాధాను హత్యచేయడంకోసం అతనిపై రెక్కీ నిర్వహించిన దోషులను జైలుపాలు కాకుండా కాపాడుతున్న వారికి, కాపువర్గంతోపాటు పేదలు, బడుగు బలహీన వర్గాలవారు తగినవిధంగా బుద్ధిచెప్పడం ఖాయమని హెచ్చరిస్తున్నాం. ఈప్రభుత్వ కుట్రలకు రాధాను బలికాకుండా కాపాడుకునే బాధ్యతను తామందరం సమిష్టిగా తీసుకొని, పేదప్రజల నాయకుడిని కాపాడుకుంటామని తేల్చిచెబుతున్నాం.