ముగ్గురు కవులకు కేంద్ర అవార్డులు తెలంగాణ సాహితీలోకానికే గౌరవం

Spread the love

-కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు విజేతలకు బక్కని, రావుల అభినందనలు

కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన తెలంగాణ ముద్దుబిడ్డలు గోరటి వెంకన్న, దేవరాజు మహారాజు, తగుళ్ల గోపాల్ కు తెలుగుదేశంపార్టీ రాష్ట్ర అధ్యక్షులు బక్కని నర్సింహులు, టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర రెడ్డి అభినందనలు తెలిపారు.

3విభాగాల్లో కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు ముగ్గురికి ఏకకాలంలో దక్కడం తెలంగాణ సాహితీ ప్రపంచానికి దక్కిన గౌరవం. ‘‘పల్లె కన్నీరు’’ పెడుతోందన్న గోరటి రచనలు పేదలు, సామాన్యుల కష్టాలను కడతేర్చే కరదీపికలు.గోరటి వెంకన్న, దేవరాజు మహారాజు, తగుళ్ల గోపాల్ లకు కేంద్ర సాహితీ అవార్డులు దక్కడం తెలంగాణ కవులు, రచయితలకు స్ఫూర్తిదాయకంగా వారు పేర్కొన్నారు.

Leave a Reply