కేంద్రానిది కక్ష్యపూరిత వైఖరి

– రైతుల కల్లాల విషయంలో తెలంగాణ ఖర్చుచేసిన రూ.150 కోట్లు వెనక్కు పంపాలని ఆదేశాలు ఇవ్వడం సరికాదు
– రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

ఉపాధిహామీ చట్టంలో post harvesting facility is a permitted work under para 4(1)(iii) of the Act అని స్పష్టంగా పేర్కొన్నారు.ఏపీ, తమిళనాడు, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాలలో ఉపాధిహామీ కింద కల్లాల నిర్మాణం జరుగుతున్నది .. కానీ తెలంగాణ విషయంలో వివక్ష చూపుతున్నది. పెరిగిన సాగునీటి వసతుల నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాలలో కల్లాలు లేక రైతులు ధాన్యం రోడ్ల మీద పోసుకుంటున్నారు .. దాని వల్ల కొన్ని చోట్ల ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. ఉపాధి హామీ పథకం గురించి పార్లమెంటులో ప్రధాని మోడీ ఎద్దేవా చేశారు .. తప్పనిసరి పరిస్థితులలో దానిని కొనసాగిస్తున్నారు.ఉపాధి ఏ రంగంలో లభించినా ప్రోత్సహించాలి.సాగునీటి రాకతో సేద్యం పెరిగి తెలంగాణలో పనులు పెరిగాయి .. ఇతర రాష్ట్రాల నుండి వలస వస్తున్నారు.

వ్యవసాయ రంగంలో కూలీల కొరత వస్తుందని గ్రహించి మొట్టమొదట వ్యవసాయానికి ఉపాధిహామీ పథకాన్ని అనుసంధానం చేయాలని ప్రశ్నించింది బీఆర్ఎస్ తరపున ప్రస్తుత ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్.2014, 2019 బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో ఉపాధిహామీని వ్యవసాయానికి అనుసంధానం చేస్తామని హామీ ఇచ్చి విస్మరించారు .. ఈ విషయాన్ని పలుమార్లు నేను గుర్తు చేయడం జరిగింది.

2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పి పెట్రోల్, డీజిల్, ఎరువుల ధరలు పెంచి సాగు ఖర్చులు పెంచారు.60 ఏళ్లు నిండిన రైతులకు పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేశారు.రూ.లక్ష కోట్లతో వ్యవసాయంలో మౌళిక సదుపాయాల కల్పన చేస్తామన్న హామీ ప్రకటనలకే పరిమితం అయ్యారు. స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేస్తామని 2013 సెప్టెంబరులో గాంధీనగర్ లో జరిగిన సదస్సులో మోడీ స్వయంగా ప్రకటించారు.స్వామినాథన్ సిఫార్సులకు భిన్నంగా కొత్త ఫార్ములాను అమలుచేస్తూ మద్దతుధర ఇస్తున్నామని చెప్పడం విడ్డూరం.కనీస మద్దతుధరల అమలుకు చట్టం తెస్తామని చెప్పిన మోడీ దానిని పూర్తిగా పక్కనపెట్టారు.ఇన్ని అబద్దాలతో కేంద్రంలో అధికారంలోకి రావడం దురదృష్టకరం.

నల్లచట్టాలతో రైతుల ఉసురుతీసి చివరకు రైతుల పోరాటానికి తలొగ్గి జాతికి క్షమాపణ చెప్పి వెనక్కు తీసుకున్నా ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదు.రైతుల విషయంలో కాంగ్రెస్ పార్టీ, బీజేపీ రెండు ఒక్కటే .. అందుకే రైతుల పోరాటంలో వారి వైపు నిలబడే మొకం ఆ పార్టీకి లోకపోయింది.ఒక్క రైతుబంధు కింద తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికి రూ.58 వేల కోట్లు రైతులకు ఇచ్చింది.రైతుబంధు పట్ల రైతుల సానుకూలతను చూసి కేంద్రం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన కింద ఏడాదికి 3 విడతలలో కేవలం 6 వేలు ఇచ్చే పథకం ప్రవేశపెట్టింది.

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన కింద ఏడాదికి రూ.6 వేలు అని గొప్పగా ప్రవేశపెట్టిన బీజేపీ ప్రభుత్వం 2019 తొలి విడతలో 11.84 కోట్ల మందికి ఇస్తే 2022 నాటికి ఆ రైతుల సంఖ్య 3.87 కోట్లకు తగ్గిపోయింది.ఏకంగా ఎనిమిది కోట్ల రైతులకు కత్తెర వేయడం కేంద్రం చిత్తశుద్దిని తెలియజేస్తుంది.

భూ రికార్డులను డిజిటలైజేషన్ చేస్తామన్నారు .. తెలంగాణ ప్రభుత్వం చేస్తుంటే కేంద్రం చేయూతనివ్వడం లేదు.ప్రతి రైతుకు రూ.లక్ష వడ్డీ లేని రుణం ఇస్తామని చెప్పారు ఏ రాష్ట్రంలో కూడా ఇచ్చిన దాఖలాలు లేవు.కాంగ్రెస్, బీజేపీల రైతు వ్యతిరేక వైఖరి గమనించే పంజాబ్ రైతులు ఆప్ పార్టీకి పట్టం కట్టారు.దేశ వ్యవసాయ రంగాన్ని కుదేలు చేయడం వెనక ఉద్దేశాలు ఏంటో అర్దం కావడం లేదు.

రైతు బంధు, రైతుభీమా పథకాలు, ఉచిత కరంటుతో తెలంగాణ రైతాంగాన్ని చైతన్యం చేసి ఆత్మవిశ్వాసం పెంచాం.కేంద్ర విధానాలతో రైతుల ఆత్మస్థయిర్యం దెబ్బతినే అవకాశం ఉన్నది.వ్యవసాయం అనేది వర్క్ ఫ్రం హోం కాదు.ప్రతి రైతు పొలంలో దిగాలి .. చెమట చిందించాలి .. అలాంటి రైతుకు ప్రేరణ ఉండాలి.లక్షల కోట్లు ఎగ్గొట్టిన కార్పోరేట్లకు రుణాలు మాఫీ చేస్తున్నారు .. రైతులకు మాత్రం మొండి చేయి చూపుతున్నారు.

గాంధీ తన ఎరవాడ జైలు పుస్తకంలో రస్కి అనే రచయిత తనకు ఆదర్శం అని చెప్పారు .. గ్రామాలు బాగుపడాలి .. పల్లెసీమలు పచ్చబడాలి అని అన్నారు.కానీ కేంద్రం గాంధీ ఆశయాలను విస్మరిస్తున్నది.కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను ప్రతి ఒక్కరూ గమనించాలి.తెలంగాణ రైతుల కల్లాల విషయంలో కేంద్రం వైఖరిని రేపటి ధర్నాలో పెద్ద ఎత్తున పాల్గొని నిరసన తెలపాలి.

Leave a Reply