వనతి శ్రీనివాసన్, పురంధేశ్వరి పేర్లు పరిశీలన
– వనతి శ్రీనివాసన్ వైపే సీనియర్ల మొగ్గు?
– బీజేపీ వర్గాల్లో జోరుగా చర్చ
ఢిల్లీ: బీజేపీ జాతీయ పార్టీ పగ్గాలు మహిళా నేత అందుకోనున్నారా? అందులో ముఖ్యంగా దక్షిణాది వారికే ఆ అవకాశం దక్కనుందా? తాజాగా ఆ పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చ దీని చుట్టూనే తిరుగుతోంది. వీరిలో తమిళనాడుకు చెందిన శ్రీనివాసన్ పేరు చాలాకాలం నుంచి వినిపిస్తోంది.
బీజేపీ అధ్యక్ష పదవిని మహిళకు ఇవ్వాలని ఆర్‌ఎస్‌ఎస్ నిర్ణయించింది. ఢిల్లీలో ఆర్‌ఎస్‌ఎస్ సమావేశం మొదలైంది. ఈ సమావేశంలో బీజేపీ అధ్యక్ష పదవికి సంబంధించి చర్చించనున్నట్లు తెలుస్తోంది. బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి ఈసారి మహిళను వరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
మహిళా అధ్యక్షురాలి రేసులో నిర్మలా సీతారామన్‌తో పాటు పురందేశ్వరి వనతి శ్రీనివాసన్‌ల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఇటీవల జేపీ నడ్డా, బీఎల్ సంతోష్‌తో నిర్మలా సీతారామన్ భేటీ అయిన విషయం తెలిసిందే.
ఈసారి బీజేపీ అధ్యక్ష పదవిని మహిళకు ఇవ్వాలని ఆర్‌ఎస్‌ఎస్ నిర్ణయించింది. ఈరోజు ఢిల్లీలో ఆర్‌ఎస్‌ఎస్ సమావేశం మొదలైంది. ఈ సమావేశంలో బీజేపీ అధ్యక్ష పదవికి సంబంధించి చర్చించనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. మూడు రోజుల పాటు ఈ సమావేశాలు జరుగనున్నాయి. ఈసారి బీజేపీ అధ్యక్ష పదవిని మహిళకు అవకాశం ఇస్తే బాగుంటుందని బీజేపీలో కొందరు నేతల మాట. ఈ క్రమంలో ఈసారి ఎవరిని బీజేపీ అధ్యక్ష పదవి వరిస్తుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.