భీమ్లా నాయక్ నుండి నిత్యా మీనన్ లుక్ రిలీజ్ చేసి అభిమానులను ఆకట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ – రానా కలయికలో భీమ్లా నాయక్ వస్తున్న సంగతి తెలిసిందే. సాగర్ డైరెక్షన్లో మాటల తెరకెక్కుతున్న ఈ మూవీ ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ఫై నాగ వంశీ నిర్మిస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే , మాటలు అందిస్తుండడం విశేషం.
ఈ చిత్రంలో పవన్ సరసన నిత్యామీనన్ నటిస్తుండగా.. రానాకు సరసన సంయుక్త మీనన్ నటిస్తుంది. ఈ క్రమంలో నిత్యా మీనన్ లుక్ ను రిలీజ్ చేసి ఆకట్టుకున్నారు. అంతే కాదు ఈ చిత్రం నుండి అంతా ఇష్టం అనే పాటను అక్టోబర్ 15న విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ మేరకు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఒక పోస్టర్‌ను విడుదల చేసింది. ఒక గుడిసె ముందు పవన్ కళ్యాణ్, నిత్యా మీనన్ కూర్చొని ఉన్న ఈ పోస్టర్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటుంది. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కాబోతోంది. థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.