Suryaa.co.in

Andhra Pradesh

ప్రజా సమస్యలపై ఈగో వద్దు జగన్ రెడ్డీ….ఇష్యూను సాల్వ్ చేయండి

నర్సీపట్నంలో విద్యార్థుల పోరాటం పై చంద్రబాబు ట్వీట్

ప్చ్…ఈ ముఖ్యమంత్రికి ఎలాచెబితే అర్థం అవుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు. చివరికి చిన్న పిల్లలు సైతం వంతెన అప్రోచ్ రోడ్డు కోసం నిరసనల బాట పట్టే స్థితికి రాష్ట్రాన్ని తీసుకువచ్చారు.  నర్సీపట్నంలో వరాహ నదిపై మా ప్రభుత్వ హయాంలోనే వంతెన నిర్మించాం…వైసీపీ ప్రభుత్వం వచ్చాక పెండింగ్ లో ఉన్న ఆ కాసింత అప్రోచ్ రోడ్డు పనులు కూడా పూర్తిచేయలేదు. దీంతో మోడల్ స్కూల్ కు వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నీళ్లలో దిగి తమ కష్టం తీర్చాలని వేడుకుంటున్నారు. ఈ ముఖ్యమంత్రి తన పాలనలో కొత్తగా ఏమీ కట్టలేరని ప్రతి ఒక్కరికి తెలుసు…కనీసం రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న నిర్మాణాలను పూర్తి చేసినా ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. ప్రజా సమస్యలపై ఈగో వద్దు జగన్ రెడ్డీ….ఇష్యూను సాల్వ్ చేయండి.

LEAVE A RESPONSE