గెజిట్ నోటిఫికేషన్ జారీ
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో వాహనాల రిజిస్ట్రేషన్ ప్లేట్లలో రాష్ట్ర కోడ్‌గా టీఎస్ స్థానంలో టీజీ అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇక నుండి తెలంగాణలో వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్‌లు టీఎస్ స్థానంలో టీజీ పేరుతో ఉండే విధంగా రిజిస్ట్రేషన్లు చేయాలని పేర్కొన్నారు.
నోటిఫికేషన్ ప్రకారం, సీరియల్ నంబర్ 29- ఏ , టీఎస్ కింద రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల కోసం వాహనాలపై రిజిస్ట్రేషన్ గుర్తు టీజీ గా సవరించి గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు.